❤️ I Want You ❤️ MADLY…🥵 – 5
విషి ముద్ద పెట్టకుండా అలాగే ఉండిపోతే మమ్మీ..అంటూ కదుపుతుంది హనీ ( హనీ కి ఫోర్ ఇయర్స్ అయిన తన మాటలు నార్మల్ గా రాసేస్తున్న అనుకోకండి ..నాకు వాళ్ళ మాటలు రావు …నా బేబీస్ మాట్లాడే మాటలు కూడా అర్థమవ్వవు 🤧 సరిగ్గా ..అందుకే నార్మల్ గా రాసేస్తున్న ఏమనుకోకండి …అండ్ హనీ అసలు పేరు విరాజ్ దగ్గర మనకి తెలుస్తుంది ..ఈ లోపు మీరేమన్న అనుకుంటే చెప్పండి )
హా బంగారం అంటూ ఇంకా మాటలు పొడిగించకుండా గబగబా అన్నం తినిపించి లేస్తుంటే విషి చేయి పట్టుకుని ఆపి నువ్వు కూడా తిను అంటుంది …పాప దగ్గర ఎక్కువ వాధించలేక ఒకే అని చెప్పి నాలుగు ముద్దలు తిని గిన్నెలు అన్ని కిచెన్ లోపల సింక్ లో వేసేసి మొత్తం సర్దేసి హనీ ని తీసుకుని బెడ్రూం కి వెళ్ళిపోతుంది …
తనకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తుంటే మమ్మీ అని పిలుస్తుంది హనీ ..ఏంటీ బంగారం అంటుంది విషి.
మమ్మీ ఎప్పుడు డాడీ గురించి అడిగిన ఆన్సర్ చెప్పవేంటీ ?? మా ఫ్రెండ్స్ కి వాళ్ళ డాడీస్ టాయ్స్ తీసుకొస్తారంట…పార్క్ కి , షాపింగ్ కి , ఇంకా చాలా చోట్ల కి తిప్పుతారంట ..మరి నాకు డాడీ లేడా..?? ఎక్కడున్నాడు మమ్మీ?? మనకి ఎవరు లేరా?? ఎప్పుడూ నువ్వు నేను తప్ప మనింటికి ఎవరు ఎందుకు రారు ?? నాకు మమ్మీ ఉన్నట్టే నీకు కూడా మమ్మీ ఉంటుంది గా ?? ఎక్కడుంది మీ మమ్మీ?? అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది హని…నిజానికి హనీ ఎప్పుడూ డాడీ గురించి అడుగుతుంది కానీ ఇలా అందరి గురించి ఎప్పుడూ అడగలేదు … ఫస్ట్ టైమ్ తన మొఖం లో దిగులు చూసి స్కూల్ లో ఏదో జరిగిందని అర్ధం చేసుకుంటుంది…ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు తన మీద తనకే కోపం వస్తుంటే బంగారం … నువ్వింకా చిన్న పిల్ల వి.. వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు మనసు కి తీసుకోకుండా బాగా చదువుకోవాలి …ఇది చెప్పు …?? నీకు మమ్మీ తో ఉండడం నచ్చట్లేదా?? బోరింగ్ గా ఉందా?? మమ్మీ నిన్ను బాగా చూసుకోవట్లేదా?? అని అడుగుతుంది ..అలా అడుగుతున్నప్పుడు తన మాట తడబడుతుంది, తన గొంతు లో దుఃఖం , కళ్ళల్లో కన్నీరు ల కొట్టొచ్చినట్టు కనబడుతుంది … అలా అనకు మమ్మీ… యు ఆర్ ది బెస్ట్ మమ్మా….నాకు నువ్వంటే చాలా లవ్ ..అందరి కంటే అన్నిటికి కంటే …అంటూ కాసేపు బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచించి హా….!!😃 గుర్తొచ్చింది …నాకు ఈ డైనోసార్ బొమ్మ కంటే కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం…అంటూ విషి బుగ్గలపై తన చిట్టి పెదవులతో ముద్దులు పెడుతుంది…( చిన్న పిల్ల కదా..తనకి ప్రేమ నీ ఎలా చెప్పాలో తెలియలేదు …అందుకే తనకి ఇష్టమైన డైనోసార్ బొమ్మ కంటే కూడా ఇష్టం అని చెప్పింది ) హనీ మాటలకి తన పై చూపిస్తున్న ప్రేమ కి కరిగిపోతూ హనీ నీ గుండెలకి హత్తుకుని అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని బయటకి పంపేస్తోంది.. (గట్టిగా ఏడిస్తే పాప కూడా భయం తో ఏడుస్తుంది అని మౌనంగా ఏడుస్తుంది..)
ప్రపంచం లో ఎవరికి తను అక్కర్లేదు ..ఆ విషయం 4 సంవత్సరాల ముందే తనకి అర్థమైంది … కన్న తల్లి తండ్రి కూడా తనని అర్ధం చేసుకోలేకపోయారు …కర్కశంగా ఇంట్లోనుండి గెంటేశారు …కానీ కడుపున పుట్టిన బిడ్డ తనంటే అందరికంటే ఇష్టం అని చెప్తుంటే ఆనందం బాధ దుఃఖం అన్ని మూకుమ్మడిగా దాడి చేసీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది విషి.. విషి కన్నీళ్లు తన టీషర్టు నుండి లోపలికి వెళ్ళి తన వీపు కి తడి తగిలితే… ప్లీజ్ మమ్మీ డోంట్ క్రై …ఇంకెప్పుడు నిన్ను ఏమి అడగను ..నువ్వు నేను అంతే అంటూ విషి కి తానే అమ్మ అయి దిండి మీదకి పడుకోపెట్టి తన చిట్టి చేతులతో కన్నీళ్లు తుడిచి సారీ మమ్మీ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను..నాకెవ్వరు వద్దు ..నువ్వు నేను డైనోసార్…అంతే కొత్తింటికి వెళ్ళాక ఫ్రెండ్స్ ఉంటారని చెప్తున్నావ్ గా … నేను వాళ్ళతో బాగా ఆడుకుంటా … నిన్ను అస్సలు విసిగించను …నువ్వు ఏడవకు మమ్మీ..నాకు నువ్వు చాలు అంటూ పెద్ద ఆరిందా లా విషి జో కొడుతుంటే విషీ ఆనందాన్ని అదుపు చేసుకుంటూ హనీ చిన్ని చేతులకి ముద్దులు పెడుతూ థ్యాంక్ యు రా …నాకు కూడా నువ్వు తప్ప ఎవరూ వద్దు … మమ్మీ నీకోసమే బతుకుతుంది.. అందరూ చెప్పిన మాటలు పట్టించుకోకమ్మ అని తనకి అర్థమయ్యే లా చెప్పి తనని కౌగిట్లో కి తీసుకుని బేబీ హెయిర్ ను చెవి వెనక్కి సర్దుతూ ఆ టాపిక్ అక్కడితో కట్ చేసి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ నిద్రపుస్తుంది.
హనీ పడుకున్నాక లేచి తన కాళ్ళ దగ్గర కూర్చుని మమ్మీ వల్ల నీక్కూడా ఎవరూ లేరు తల్లి…. నా కడుపున పుట్టడమే నీ దురదృష్టం…కానీ నువ్వు నాకు పుట్టడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం రా… నీకు ఏ బంధాన్ని ఇవ్వలేకపోయినందుకు క్షమించు బంగారం అంటూ హనీ కాళ్ల దగ్గరే పడుకుని ఆ కాళ్ళని తన చేతులతో చుట్టేస్తూ పక్కనే ముడుచుకుని ఏడుస్తూ కలత నిద్ర లోకి జారుతుంది విషీ…
విషీ గతం ఏంటి?? తన హస్బెండ్ ఎక్కడ ??
విషి అమ్మ వాళ్ళు తనని ఎందుకు ఇంట్లో నుండి గెంటేశారు ?? తెలుసుకోవాలంటే …. కామెంట్ చేసి ఫాలో చేయండి 🥰
Swipe left/right or tap the sides to turn pages