A BOLD ANGLE BY MY…( MAN 🥵) – 1
(( ఈ కథ ఇందులో వున్నా పాత్రాలు మరియు విభినమైన సన్నివేశాలు పూర్తిగా నా మేధో సంపత్తి.. నా అనుమతి లేకుండా ఈ కథ ను కాపీ చేసిన, వేరే పేర్లతో ఇతర ప్లాటఫామ్ లో పోస్ట్ చేసిన లేదా కాంటెంట్ ని మర్చి రాసిన కాపీరైట్ కింద లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను.. ఈ స్టోరీ పూర్తి హక్కులు LUCKY నాకు మాత్రమే సొంతం..))
ముంబై స్కై డెక్ పెంట్ హౌస్ :-
నగరం నడివాడ్డున 50 అంతస్తుల ఎత్తులో ఆకాశాన్ని తాకుతూన గ్లాస్ బిల్డింగ్. లోపల ఇటలీయాన్ వైట్ మార్బుల్ మెరిసిపోతుంది. పైకప్పు నుంచి వేలాడుతున్న వేలా క్రిష్టాల్స్ ఉన్న ఖరీదైన షాండిలయర్ ఆ గదిలో ఒక రాజసాని ఇస్తున్నాయి. గాలిలో ఖరీదైన ఉద్ (oud) సువాసన.. బయట నగరం మొత్తం చిన్న బొమ్మ ల కనిపిస్తుంది..
ఒక వెల్వట్ సోఫాలో గభిరంగా, ఒక మహారాణి లాగా కూర్చొని జ్యూస్ సిప్ చేస్తుంది.. ఒక అమ్మాయి.
” ఏవండీ కిడ్నాపర్ గారు ! ఆ గన్ తుడవడం ఆపి.. చికెన్ 65 కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా? అసలే 6th మంత్ ప్రెగ్నెన్సీ కదా ఆకలి ఎక్కువ వేస్తుంది.. తొందరగా చికెన్ 65 తీసుకుని వస్తే తినిపెడతా, ఆరేజ్ చేస్తారు గా? చేస్తారు లేండి ఇంత రిచ్ బిల్డింగ్ కట్టుకున్నారు గా.. ఒక ప్లాట్ చికెన్ పెట్టలేరా? “
అతను పిచ్చి మొఖం వేసి,, వణుకుతున్న చేతితో గన్ పట్టుకొని ” అమ్మాయి.. నువ్వు కిడ్నప్ అయ్యావు ! ఈ విషయం గుర్తుందా? ఇక్కడ నా మొగుడు వస్తున్నాడు అని నా గుండె ఆగిపోతుంటే..నీకు చికెన్ కావాలా? చికెన్ కాదు.. ఇంకోసారి ఆ మాట అంటే.. అంటున్న విల్లన్ కి పెద్ద సౌండ్ వినిపించింది..
బయట గేటు దగ్గర నాలుగు మిడ్ నైట్ బ్లాక్ రేంజ్ రోవర్స్ బుల్లెట్ వేగంతో వచ్చి ఆగాయి. ఆ టైర్ల రాపిడికి రోడ్డు మీద నుంచి పొగలు వచ్చాయి. రెండో కారు నుంచి ఒక అతను అడుగు బయట పెట్టాడు. ఆరడుగుల పైచిలుకు ఎత్తు.. వొంటికి హత్తుకున్నట్టు ఉన్న బ్లాక్ షర్ట్.. పై రెండు బటన్స్ విప్పి ఉండటంతో అతని గంభీరమైన ఛాతి, దాని మీద ఉన్న ఆ పాత గాయం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అతను తన Rolex వాచ్ చూసుకుంటూ, కళ్ళజోడు తీసి తన తీక్షణమైన చూపుతో పైకి చూశాడు. ఆ చూపుకి ఆ గ్లాస్ బిల్డింగ్ కూడా వణికినట్టు అనిపించింది. అతను లోపలికి అడుగు పెడుతుంటే.. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అతనిలోని ఆ “Death Aura” చూడగానే వాళ్ల చేతులు వణికి గన్లు కింద పడిపోయాయి. ఒక్కొక్కడూ భయంతో రెండడుగులు వెనక్కి వేశారు..
అతను తలుపులు తన్నుకుంటూ లోపలికి వచ్చాడు. అతని బాడీగార్డ్స్ విలన్ మనుషులని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి నేలకి తొక్కేశారు. అతను ప్రశాంతంగా విలన్ ముందు నిలబడి, తన జేబులోంచి ఒక పాప్‌కార్న్ గింజను నోట్లో వేసుకుని చిలిపిగా నవ్వాడు..
అతను విల్లన్ వైపు చూస్తూ.. “రేయ్.. నా లైఫ్ లో ఎవరికీ థాంక్స్ చెప్పలేదు రా.. కానీ నీకు మాత్రం థాంక్స్! నా పెళ్ళాం రోజు ఇంట్లో బోర్ కొడుతోంది అని ప్రాణాలు తీసేది.. నువ్వు చాలా గ్రేట్ రా! నేను అడగకుండానే తనని ఇంత రిచ్ ప్లేస్‌కి పిక్నిక్ తీసుకొచ్చావు.”అన్నాడు.😎🍿
ఆ అమ్మాయి కోపంతో లేచి వచ్చి అతని కాలర్ పట్టుకుని .. “రేయ్ సచ్చినోడా! ఆఫీసులో కూర్చుని సీసీటీవీలో నన్ను కిడ్నాప్ చేస్తుంటే పాప్‌కార్న్ తింటూ లైవ్ చూస్తావా? నా లైఫ్ నీకు బిగ్ బాస్ షో లా కనిపిస్తుందా రా? ఎంత భయపడ్డానో తెలుసా?” అంది..
అతను ఆమెను నడుము దగ్గర పట్టుకుని తన వైపుకు బలంగా లాక్కుని, ఆమె కళ్ళలోకి రొమాంటిక్ ఇంటెన్స్ గా చూస్తూ.. “హేయ్.. ఊరుకో వే! ఈ ప్రపంచాన్నే తన కంటి చూపుతో శాసించే ఈ దయా నే భయపెట్టే దానివి నువ్వు.. అలాంటిది నువ్వు భయపడటం ఏంటి? నిన్ను చూసి ఆ యముడైనా భయపడాలి కానీ.. నువ్వు భయపడటమేంటి?” అన్నాడు రీస్పి వాయిస్ తో.🥵🔥
దయ ఆ విల్లన్ వైపు చూసి నవ్వుతూ ” ముఖ్యంగా రోజీ.. వీడు నిన్ను కారు ఎక్కించడానికి పడ్డ కష్టం ఉంది చూడు.. అది నేను బాగా ఎంజాయ్ చేశాను. నువ్వు వాడు ఇచ్చిన జ్యూస్ తాగి కారు ఎక్కనని మారాం చేస్తుంటే, వాడు పడ్డ తిప్పలు చూసి నేను పాప్‌కార్న్ తింటూ పడి పడి నవ్వుకున్నాను. ఆ సీన్ కోసం మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి మరీ చూశాను!” అన్నాడు 😂🍿
అతని ఛాతి మీద కొడుతూ “రేయ్ ! అంత ఎంజాయ్ చేశావా? అయినా నందు.. వీడు చాలా మంచి విలన్ రా! నన్ను, మన బేబీని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. చిన్న గీత కూడా పడకుండా అంత కేర్ తీసుకున్నాడు.. అందుకే వీడిని వదిలేయ్..అంది.
దయ నవ్వి “అవునా! అంత కేర్ తీసుకున్నాడా? సరే.. కానీ వీడు నీకు చికెన్ పెట్టలేదు అన్నావుగా! ఆ విషయంలో నేను డీప్ గా హార్ట్ అయ్యాను. నా సోల్ సాటిస్ఫాక్షన్ కి వీడికి ఏదో ఒకటి చేయాలి కదా.. ఏం చేయమంటావు?” అన్నాడు కొంటేగా..
ఆశగా చేతులు చాచి “నందు! నన్ను ఎత్తుకో!”అనగానే దయా ఆమెను గాలిలోకి ఎత్తుకోగానే.. రోజి అతని మెడ చుట్టూ చేతులు వేసి, అతని గుండెల మీద తల ఆన్చుకుంది.
“సరే నందు.. ఈ విలన్ ని వదిలేసి, మనకి చికెన్ పెట్టలేని వాడికి ఇది ఎందుకు..ఈ బిల్డింగ్ ని మాత్రం లేపేయి! చికెన్ కంటే ఈ బిల్డింగ్ ఎక్కువ కాదు కదా ?” అదోరకంగా నవ్వుతు కన్ను కొట్టి అంది😉🔥
ఆమె 6 నెలల పొట్ట వైపు చూసి, “ముందు లాగా ఎత్తుకుంటే నిన్ను ఇక్కడే తినేసేవాడిని.. కానీ ఈ 6 నెలల అడ్డు వల్ల ఆ ఫీల్ అంతా పోయింది. అందుకే చెప్పాను అబోర్ట్ చేసుకోమని.. వింటేగా! సరే.. ఒరేయ్! విలన్ ని బయట పడేసి, ఐదు నిమిషాల్లో ఈ రిచ్ బిల్డింగ్‌ని పేల్చేయండి. పద రోజీ.. ఇంట్లో నీకు చికెన్ తో పాటు అసలైన ఆట కూడా చూపిస్తాను!” అన్నాడు 😉..
ఇంతకీ ఎవరు ఈ కపుల్ అనుకుంటున్నారా మన ఈ స్టోరీ హీరోయిన్ & హీరో అండీ..
దయానంద్ సింగ్ రాథోడ్ ❤️🔥 రోజి ఆరోరా
చదివి వెళ్ళిపోకుండా రేటింగ్, కామెంట్ ఇవ్వడండి నాకు చాలా ప్రిషియస్..
TO BE CONTINUED:-
మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి గయ్స్.. లైక్స్ & ఫాలో చేయండి అబ్బా..
Swipe left/right or tap the sides to turn pages