ఆ రోజు ముంబైలోని ప్రతి ఇంట్లో, ప్రతి టీవీలో ఛానల్ 24/7 రిపోర్టింగ్ హోరెత్తిపోతోంది. “ది హ్యాంగోవర్” పబ్ వెనుక జరుగుతున్న డ్రగ్స్ దందాను ఒక మిస్టరీ గర్ల్ తన ప్రాణాలకు తెగించి షూట్ చేసిన వీడియో సిటీని కుదిపేసింది. ( ఇది ఎలా అని అడుగుతారు అందుకే చెప్తున్నా, ఆ పబ్ కి వచ్చినా వాళ్ళు వీడియో కూడా తీశారు కానీ రోజీ పేస్నీ బ్లార్ చేసి వీడియో వైరల్ చేశారు ) ఆ వీడియో తీసింది ‘రోజీ’ అని ప్రపంచానికి తెలియదు కానీ, ఆ సాహసం చేసింది ఒక అమ్మాయి అని తెలిసిన నెటిజన్లు #దిమిస్టరీగర్ల్ అని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
కానీ ఆ పబ్ ఓనర్‌కి మాత్రం ఆ వీడియో తీసింది రోజీ అని తెలిసి. ఆ రహస్యం ఆమెతోనే అంతం కావాలి అని రౌడీలను పంపాడు.