A BOLD ANGLE BY MY…( MAN 🥵) – 5
శాంతి అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం:- 143
( నెంబర్ బాగుంది కదా 😁)
ముంబై నగరం అప్పుడప్పుడే మేల్కొంటోంది.ఆ అమ్మాయి అప్పుడే నిద్రలేచి, కిటికీ గుండా వస్తున్న సూర్యకిరణాలను చూస్తూ ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుంది. మొఖం కడుక్కుని నేరుగా బాల్కనీలోకి వెళ్ళింది. చల్లని గాలి తగులుతుంటే, గంటసేపు చాలా కాన్సంట్రేటెడ్‌గా యోగా చేసింది. రాత్రి పబ్ లో తొమ్మిది మందిని కొట్టిన ఆ బాడీలో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉందా అనిపించేలా ఆమె ఆసనాలు ఉన్నాయి.
యోగా పూర్తి కాగానే, తన మెడలో ఉన్న ఆ సీక్రెట్ చైన్ లాకెట్‌ని తీసి. అందులో ఉన్న చిన్న మెమరీ కార్డ్‌ని తీసి తన ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి. రాత్రి పబ్ లో రికార్డ్ చేసిన ఆ డ్రగ్స్ డీలింగ్ వీడియోని ఒకసారి చెక్ చేసుకుని, కళ్ళలో ఒక గెలుపు నవ్వుతో దాన్ని పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకుంది.
”ఈ ఒక్క వీడియో చాలు.. ఆ పబ్ ఓనర్ పునాదులు కదిలిపోవడానికి!” అని తనలో తాను అనుకుంటూ ఆఫీస్‌కి రెడీ అవ్వడానికి వెళ్ళింది.
కాసేపటికి బయటకు వచ్చింది. వైట్ కుర్తీ మరియు బ్లాక్ ప్లాజో వెర్ చేసి, చాలా సింపుల్ గా రేడీ అయి,మెడలో తన ఐడి కార్డ్ వేసుకుంది..
కిచెన్‌లోకి వెళ్ళి ఫ్రిజ్ ఓపెన్ చేసి, రెండు బ్రెడ్ ముక్కలకి జామ్ రాసుకుని తింటూ, ఒక గ్లాస్ పాలు తాగేసింది. తన ఆఫీస్ బ్యాగ్ సర్దుకుని, టేబుల్ మీద ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కీస్ తీసుకుంది.
వెళ్తూ వెళ్తూ తన ఫ్రెండ్ వర్షిణికి కాల్ చేసింది.
”వర్షి! నేను కింద పార్కింగ్‌లో ఉంటాను. నువ్వు ఐదు నిమిషాల్లో కిందకి రాకపోతే.. నిన్ను వదిలేసి నా బుల్లెట్ మీద దూసుకుపోతాను, జాగ్రత్త!”
కొద్దిసేపటికి వర్షి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరూ కలిసి బుల్లెట్ ఎక్కి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారు. అమ్మాయి బుల్లెట్ స్టార్ట్ చేసి గేర్ వేస్తుంటే వచ్చే ఆ ‘డుగ్ డుగ్’ శబ్దం ఆమె పర్సనాలిటీకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.
@@@@@@@@
ముంబై సిటీలోని ఒక బిజీ జంక్షన్.. ఎండ తీవ్రత పెరుగుతోంది. ఆమె తన బుల్లెట్ మీద ఉండగా, వెనక కూర్చున్న వర్షి రాత్రి జరిగిన పబ్ ఫైట్ గురించి ఏదో ఆసక్తిగా చెప్తూ నవ్వుతోంది. అంటే అప్పుడు పబ్ లో వర్షి కూడా ఉంది దానికి ఆ అమ్మాయి హెల్మెట్ తీసి బుల్లెట్ ట్యాంక్ మీద పెట్టి, తన నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంటూ నవ్వుతూ సమాధానం ఇస్తోంది..
సరిగ్గా అప్పుడే.. వాళ్ళ బుల్లెట్ పక్కన ఒక నిశ్శబ్దమైన గంభీరత ఆవరించింది. మెరిసిపోతున్న మిడ్ నైట్ బ్లాక్ రేంజ్ రోవర్ వచ్చి ఆగింది. ఆ కారు అద్దాలు చాలా నల్లగా (Z-category tint) ఉండటంతో లోపల ఎవరు ఉన్నారో బయట ఉన్న ఆమెకి కనిపించడం లేదు.
కారు లోపల:
దయా తన లాప్‌టాప్‌లో ఇంపార్టెంట్ డీల్ చెక్ చేస్తున్నాడు. కారు ఆగిపోవడంతో దయ కనుబొమ్మలు ముడిపడ్డాయి.
తల ఎత్తకుండానే గంభీరమైన గొంతుతో ( అంటే పుట్టుకతోనే దయ వాయిస్ లో బెస్ వుంది లేండి అతను నార్మల్ గా మాట్లాడిన ఆ వాయిస్ లో బేస్ కి ముందు ఉన్నవాడు భయపడతాడు)”వాట్ హాపెండ్ రిజ్వన్? ఎందుకు ఆగావు?”అడిగాడు
”రెడ్ సిగ్నల్ సార్.. జస్ట్ 5 మినిట్స్.”
దయ విసుగ్గా ఒక నిట్టూర్పు విడిచి, లాప్‌టాప్ పక్కన పెట్టి కార్ విండో వైపు చూశాడు. సరిగ్గా అదే సమయంలో బయట వర్షి ఏదో జోక్ వెయ్యడం తో గట్టిగా నవ్వింది ఆ అమ్మాయి . ఆ నవ్వులో ఒక స్వచ్ఛత, ఒక రకమైన ధైర్యం ఉన్నాయి.
దయ కళ్ళు ఆమె మీద పడ్డాయి. ఆ వైట్ కుర్తీ, కళ్ళలో ఉన్న గాఢమైన కాటుక, ఆ నవ్వు.. దయకి తెలియకుండానే ఒక సెకను పాటు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో తనని చూసి అందరూ భయపడతారు, కానీ ఈ అమ్మాయి ఎంతో స్వేచ్ఛగా, లోకాన్ని మర్చిపోయి నవ్వుతోంది. ఆమె కళ్లలో ఉన్న ఆ ‘స్పార్క్’ దయకి ఎందుకో కొత్తగా అనిపించింది.
కానీ మరుక్షణమే , “చిరాకు..” అన్నట్టుగా తల తిప్పుకుని మళ్ళీ లాప్‌టాప్ లో మునిగిపోయాడు.
బయట ఉన్న ఆమెకి మాత్రం తన పక్కనే ఒక “వైల్డ్ ” మాన్ ఉన్నాడని, తన జీవితాన్నే మార్చేయబోయే వ్యక్తి ఆ కారులోనే ఉన్నాడని అస్సలు తెలియదు. సిగ్నల్ పడగానే బుల్లెట్ రేస్ చేస్తూ ముందుకు దూసుకెళ్లిపోయింది. దయ కారు వెనకాలే నిదానంగా కదిలింది.
&&&&&&&&&&&&&&&&&
ఛానల్ 24/7 ఆఫీస్ పార్కింగ్ లాట్:-
ఆమె తన బుల్లెట్‌ను ఒక కట్ తీసుకుని పార్కింగ్ లాట్‌లో నిలబెట్టింది. హెల్మెట్ తీసి తన జుట్టును ఒక్కసారి సర్దుకుంటూ, తన పక్కనే ఉన్న గ్లాస్ మీద ప్రతిబింబాన్ని చూసుకుని ఒక కాన్ఫిడెంట్ స్మైల్ ఇచ్చింది.
వర్షికి బాయ్ చెప్పి, లిఫ్ట్ ఎక్కి తన డెస్క్ దగ్గరకు వెళ్ళింది.
తన సీట్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేస్తున్న సమయంలో.. తన కొలీగ్ వచ్చి..
”రోరా! నువ్వు రావడం కోసం సీఈఓ సార్ వెయిట్ చేస్తున్నారు. నిన్ను వెంటనే చాంబర్‌కి రమ్మన్నారు.”
దానికి తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న పెన్‌డ్రైవ్ తీసుకుని సీఈఓ చాంబర్ వైపు నడిచింది. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ఆమె వైపు ఒక రకమైన రెస్పెక్ట్ తో చూస్తున్నారు. ఎందుకంటే రోజీ ఆరోరా అంటే కేవలం రిపోర్టర్ కాదు.. ప్రాణాలకు తెగించి నిజాలను బయటకు తీసే ఒక ఫైటర్!
సీఈఓ చాంబర్:-
చాంబర్ లోకి అడుగు పెట్టగానే, రోజీ నేరుగా వెళ్ళి సీఈఓ టేబుల్ మీద ఆ పెన్‌డ్రైవ్‌ను పెట్టింది.
”సార్.. మీరు అడిగిన ముంబై డ్రగ్స్ డీలింగ్ ఫుటేజ్ ఇందులో ఉంది. ఆ పబ్ ఓనర్ తో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి ముఖాలు క్లియర్ గా రికార్డ్ అయ్యాయి.”
సీఈఓ ప్రతాప్ రాజ్ ఆ పెన్‌డ్రైవ్‌ను తన లాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి వీడియో చూశారు. ఆయన ముఖంలో ఒక సంతృప్తికరమైన నవ్వు కనిపించింది.
”ఎక్సలెంట్ ఆరోరా! నాకు తెలుసు.. ఈ డేంజరస్ ఆపరేషన్ నువ్వు మాత్రమే కాపబుల్ అని అందుకే నిన్ను పంపించాను. నువ్వు నా నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయవు. యూ నెవెర్ బ్రేక్ మై ట్రస్ట్! రియల్లీ.. గుడ్ జాబ్ ఆరోరా!”
“థాంక్స్ సార్! కానీ ఈ వీడియో ఈరోజు ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవ్వాలి. ఆ క్రిమినల్స్ కి అసలైన భయం అంటే ఏంటో తెలియాలి.” అని వెళ్ళబోతున్న తనని..
ఆరోరా ! నెక్స్ట్ వీక్ నా కొడుకు భరత్ రాజ్ కొత్త సీఈఓ గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు, నీకు తెలుసుకదా?
ఎస్ సార్! అయినా ఇపుడు అది ఎందుకు సార్? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది.
అదే ఆరోరా ! నువ్వు భరత్ కి PA గా వర్క్ చేస్తావా, ప్రేమోషన్ ఇస్తాను.
ఐ ఆమ్ సారీ సార్ ! నాకు ఇలా జర్నలిస్ట్ గా ఉండడమే నచ్చింది, PA గా వర్క్ చేయలేను..
అది కాదు ఆరోరా! నువ్వు వర్క్ బాగా చేస్తావ్, థాట్ టూ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది..
సారీ సార్ ! నేను జర్నలిజం లోకి వచ్చిందే నా ప్యాషన్ కోసం, అండ్ ఇందులో ఉండే త్రిల్ కోసం.. మీరు శాలరీ హైప్ చేస్తాను అన నేను ఈ థ్రిల్ నీ మిస్స్ చేసుకోలేను, అని వెళ్ళిపోయింది..
TO BE CONTINUED :-
లైక్స్ & కామెంట్స్ ఏవండీ అబ్బా….
ఇగ్నోర్ ది మిస్టేక్స్….
సపోర్ట్ చేసి ఫాలో చేయండి బంగారాలు… రెట్టింపు వేగంతో అప్డేట్స్ ఇస్తాను 🫶…
Swipe left/right or tap the sides to turn pages