A BOLD ANGLE BY MY…( MAN 🥵) – 4
((Hi ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నా, ఈ A BOLD ANGLE BY MY.. (MAN🥵) స్టోరీ, స్టోరీ నేమ్ లోనే ఇచ్చాను బోల్డ్ యాంగిల్ అని. సో ఫుల్ స్టోరీ 18+ రొమాన్స్ నచ్చిన వాళ్ళు చదివి, సపోర్ట్ చేయండి.. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి…))
రాథోడ్ మన్షన్…
ముంబై నగర శివార్లలో, జనసంచారానికి దూరంగా, ప్రకృతి ఒడిలో దాదాపు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఆ రాథోడ్ మాన్షన్. అది కేవలం ఒక ఇల్లు కాదు, దయానంద్ సింగ్ రాథోడ్ సామ్రాజ్యానికి అది ఒక కోట.
మాన్షన్ కి ఒక వైపున కృత్రిమంగా నిర్మించిన “వాటర్ మౌంటైన్” ఉంది. ఎత్తైన రాతి గుట్టల పైనుండి నీరు కిందకి జాలువారుతుంటే వచ్చే శబ్దం, ఆ ప్రాంతమంతా వ్యాపించిన చల్లని గాలి మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది. ఆ జలపాతం చుట్టూ అరుదైన విదేశీ మొక్కలు, రంగురంగుల పూల తోటలతో ఆ ప్రాంతం ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది.
జలపాతానికి కొంచెం దూరంలో, పాలరాతితో (White Marble) రాధాకృష్ణుల విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎంత సుందరంగా ఉందంటే, చూస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ దైవమే అక్కడ కొలువై ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. తెల్లటి మార్బుల్ పై ఉదయిస్తున్న సూర్యకిరణాలు పడి విగ్రహం దైవికమైన కాంతితో మెరిసిపోతోంది.
విగ్రహానికి పక్కనే అందంగా తీర్చిదిద్దిన తులసి కోట ఉంది. అప్పుడే పూజ ముగిసినట్టుగా.. తులసి మొక్కకు పసుపు, కుంకుమలు పెట్టి ఉన్నాయి. కోట ముందు వెలిగించిన అగరుబత్తుల సువాసన గాలిలో కలిసిపోయి ఉంది. అక్కడ ఉన్న ప్రమిదలో దీపం ఇంకా వెలుగుతూనే ఉంది, ఆ దీపపు కాంతి ఉదయం వేళ వచ్చే లేత ఎండలో కలిసిపోయి ఒక పవిత్రమైన అనుభూతిని ఇస్తోంది.
ఇక మాన్షన్ విషయానికి వస్తే, అది ఆధునిక ఆర్కిటెక్చర్ ఉంది. బ్లాక్ & వైట్ కలర్ థిమ్ లో ఆ మన్షన్ వుంది,చూస్తుంటేనే ఒక రకమైన భయం, గౌరవం కలుగుతాయి. మాన్షన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ దయానంద్ “Death Aura” కి నిదర్శనంలా నిలబడి ఉన్నారు.
మార్నింగ్ 5 :-
నగరం ఇంకా నిద్రలోనే ఉంది, కానీ రాథోడ్ మాన్షన్ లోని 3వ ఫ్లోర్ లో దయా కళ్ళు తెరిచాడు. అతను నిద్రలేవగానే చేసే మొదటి పని.. తన పక్కనే ఉన్న గన్ని ఫోన్ లో అందంగా నువ్వుతు ఉన్నా అన్షు ఫోటో వీటిని చూస్తాడు.
ఆ ఫ్లోర్ మొత్తం బ్లాక్ & గ్రే థీమ్‌లో ఉంటుంది. ఆ ఫ్లోర్ కి దయకి &అతని తల్లి కి తప్ప ఎవరికీ ఎంట్రీ లేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున అక్కడ అడుగుపెడితే.. దయ వారి ప్రాణాలతో ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు.
తన పర్సనల్ జిమ్‌లో గంటసేపు వర్కౌట్స్ పూర్తి చేసి, తరువాత బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన పంచ్‌ల వేగానికి ఆ బాక్సింగ్ బ్యాగ్ ముక్కలైపోతుంటే, కళ్లలో ఒక వింతైన తృప్తి. వర్కౌట్ తర్వాత ఫ్రెష్ అయి, తన ట్రేడ్ మార్క్ అయిన బ్లాక్ ఫార్మల్ సూట్ ధరించి, తడి జుట్టును వెనక్కి దువ్వుకుంటూ గంభీరంగా కిందకు దిగి వచ్చాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర –
మాన్షన్ అంతా తెల్లటి పాలరాతితో మెరిసిపోతుంటే, దయ అడుగు పెడుతుంటే ఆ రాజసమే వేరు. తులసి కోట దగ్గర పూజ ముగించుకుని వచ్చిన సౌమ్య సింగ్ రాథోడ్ ( పేరులో మాత్రమే సౌమ్యం ఉంటుంది) తన కొడుక్కి ఇష్టమైన టిఫిన్ వడ్డిస్తోంది.
“దయ.. నిన్న మోసం చేయాలని చూసిన వాడిని ఏం చేశావు?” అని అడిగారు ఆకాష్ సింగ్ రాథోడ్ గారు.
“వాడు నాతో మైండ్ గేమ్ ఆడాలని చూశాడు డాడీ.. సో హి ఈజ్ ఫినిష్డ్!”అన్నాడు..
సౌమ్య కొడుకు వైపు చూస్తూ, “రిజ్వన్ చెప్పాడు.. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయించావంట! వాడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాల్సింది కదా దయ?”అన్నారు..
సైడ్ స్మైల్ ఇస్తూ,”మామ్.. చంపేస్తే వాడికి నరకం ఎలా
తెలుస్తుంది? వాడు పర్మనెంట్‌గా బెడ్ పైనే ఉండాలి. ఒకేసారి ప్రాణం పోతే ఏం కిక్ ఉంటుంది? సో యూ డోంట్ వర్రీ.. వాడు బ్రతికి ఉండగానే హెల్ చూడాలి చూస్తాడు “అన్నాడు.
ఆయుష్ సింగ్ రాథోడ్ మధ్యలో మాట్లాడుతూ”ఎందుకు అన్నయ్య.. వాడిని సింపుల్ గా లేపేస్తే మనకి మనీ వెస్ట్, టైమ్ వెస్ట్ తగ్గుతుంది కదా!”అన్నాడు
“ఆయు బ్రో.. అలా సింపుల్ గా ప్రాణం పోతే వాడికి చేసిన తప్పు ఎలా తెలుస్తుంది? వాడు లైఫ్ లాంగ్ రిగ్రేట్ అవ్వాలి, అందుకే దయ బ్రో వాడిని అలా బెడ్ కి పరిమితం చేశాడు.” జ్యూస్ సిప్ చేస్తూ అంది అన్షు సింగ్ రాథోడ్.
దయ తన చెల్లి వైపు గర్వంగా చూసి .. “అన్షు! వాట్ అబౌట్ యువర్ డ్రైవింగ్ క్లాసెస్? అడిగాడు.
”ఐ విల్ ట్రై బ్రో.. బట్ ఆ ఇన్స్ట్రక్టర్ కన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ పై లేదు అనిపిస్తుంది.”
దయ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తన చెల్లి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే దయకి అస్సలు నచ్చదు. అప్పుడే లోపలికి వస్తున్న రిజ్వన్ ని చూసినా దయ..
“రిజ్వన్! ఆ డ్రైవింగ్ నేర్పించే వాడు నా చెల్లి మీద ఎక్కువ కన్సంట్రేట్ చేస్తున్నాడు అంట! వాడు టుమారో మార్నింగ్ సన్ నీ చూడకూడదు.. అది ఫిక్స్! మేక్ ఇట్ ష్యూర్ !”అని హ్యాండ్ వాష్ చేసుకుని పైకి లేచాడు..
ఎపుడైనా దయ కూల్ గానే మాట్లాడతాడు, కానీ తన ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చిన వాడు నెక్స్ట్ మార్నింగ్ నీ చూడకూడదు అనుకుంటాడు. దీనికి ఒక బలమైన రీజన్ ఉంది, అది ఏంటో గెస్ చేయండి ఈలోపు..
దయ తన కారు వైపు నడిచాడు. లోపల రిజ్వన్ తల ఊపి పని మొదలుపెట్టాడు.
TO BE CONTINUED :-
లైక్స్ & కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్…
సపోర్ట్ చేసి ఫాలో చెయ్యండి..
Swipe left/right or tap the sides to turn pages