New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 5

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 5

రాహుల్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ రావడంతో కోపంగా  మేఘ ఫోన్ పగలకొట్టి , ఫాస్టుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు రుదిర్….

 

అలా కోపంలో ఫాస్ట్ గా వెళ్తున్న రుదిర్ కార్ కి సడెన్గా. ఒక వ్యక్తి అడ్డుగా వస్తారు… రుదిర్ ఉన్న కోపంలో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ … అడ్డు వచ్చిన వ్యక్తి నీ  చూడకుండా డాష్ ఇస్తాడు…

 

రుదిర్ కార్ బాగ ఫాస్ట్ గా డ్రైవ్ చెయ్యడం వల్ల ఆ డాష్ ఇచ్చిన పర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడుతాడు…

 

అది చూసిన భయంతో మేఘ పెద్దగా అరుస్తుంది… రుదిర్ కూడా కార్ బ్రేక్ మిద కాలు వేసి ఆపుతాడు….

 

కార్ ఆగడమే ఫాస్ట్ ఫాస్ట్ గా మేఘ కార్ దిగి ఆ పడిపోయిన పర్సన్ దగ్గరికి వెళ్లి , బోర్ల పడి ఉన్న అతనినీ ముందుకి తిప్పింది.

 

అంతే అక్కడ ఎర్రటి రక్తం మడుగులో పడి ఉన్న రాహుల్ నీ చూడగానే షాక్ తో ఫ్రీస్ అయిపోయింది మేఘ.

 

మేఘ వెనకే కార్ దిగి ఎలాంటి ఎస్ప్రేషన్ లేకుండా వచ్చిన రుదిర్ కూడా ఒళ్ళు అంతా రక్తం కారుతూ స్పృహలో లేని రాహుల్ నీ చూసి ఏం పట్టనట్టు అలా చూస్తూ ఉంటాడు అంతే…

 

ఒక్క నిమిషం తర్వాత తేరుకున్న మేఘ రా…రాహుల్ అని అరుస్తూ అతని చెంపలు తడుతూ ఉంటుంది..

 

రాహుల్ ఎంత పిలిచినా పలకడం లేదు కదలడం లేదు…రాహుల్ రక్తం అక్కడ అంతా పారి సిమెంట్ రోడ్డు మొత్తం ఎర్రటి రక్తం మడుగుల కనిపిస్తుంది.

 

రాహుల్….రాహుల్…లే … ప్లీజ్ రాహుల్ లే ..” అని అరుస్తూ , మరో పక్క  ఏడుస్తూ .. రాహుల్ ఎంత పిలిచినా లెగడం లేదు అని …తన వెనకే ఉన్న రుదిర్ నీ చూస్తూ….

 

” సార్ రాహుల్ సార్ నీ అర్జంట్ గా హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాలి ప్లీస్ … ” అని చేతులు జోడించి రిక్వెస్ట్ చేసింది మేఘ.

 

మేఘ రాహుల్ కోసం అతన్ని రిక్వెస్ట్ చెయ్యడం రుదిర్ కి నచ్చలేదు…కోపంగా మేఘ రెక్క పట్టుకొని పైకి లేపి ” నికు ఇందాకే చెప్పాను కదా…! నికు నా ఫ్యామిలీ తో ఎలాంటి రిలేషన్ లేవు…

 

నికు ఎలాంటి హక్కులు లేవు . మా ఫ్యామిలీ మ్యాటర్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు ” అని చాలా చాలా సీరియస్ గా చెప్తాడు రుదిర్.

 

రుదిర్ అలాంటి క్రిటికల్ సిట్యువేషన్ లో కూడా అలా మాట్లాడం మేఘ కి నచ్చలేదు… రుదిర్ కళ్ళలోకి చూస్తూ…తన చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ…

 

” ఈ రింగ్ మీరు నాకు తోడుగా రోజే మీకు నాకు సగం పెళ్లి అయిపోయింది…ఇప్పుడు మీరు నాకు హాఫ్ హస్బెండ్…అక్కడ పడిపోయి ఉన్న రాహుల్ నాకు మరిది అంటే నాకు కొడుకు తో సమానం…

 

మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను తనని కాపడతాను…నాకు తనని కాపాడాల్సిన హక్కు , బాధ్యత  ఉంది….రాహుల్ నా కుటుంబం లో ఒక్కడు ” అని చెప్పి  ..

 

రక్తం మడుగులో పడి ఉన్న రాహుల్ దగ్గరికి వెళ్లి కష్టం గా అతన్ని పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది మేఘ .

 

రుదిర్ తొడిగిన రింగ్ చూపించి అతను తనకి అర్ధ మొగుడు అని చెప్పిన మాటలే రుదిర్ చెవిలో మారుమోగుతూ ఉంటాయి…

 

ఒక్క నిమిషం తర్వాత గట్టిగా గాలి పీల్చుకొని వదిలి వెళ్లి మేఘ చేతిలో ఉన్న రాహుల్ నీ అతని భుజాన వేసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు.

 

మేఘ కూడా పరుగున కార్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి కూర్చొని రాహుల్ నీ తన ఒడిలో పడుకోబెట్టుకుంది.

 

మేఘ నీ తన ఒడిలో ఉన్న రాహుల్ నీ ఒకసారి చూసి కార్ ఎక్కి పది నిమిషాల్లో హాస్పటల్ ముందు కార్ ఆపాడు రుదిర్.

 

వెంటనే నర్స్ వాళ్ళు స్ట్రెచర్ తీసుకొని వచ్చి రాహుల్ నీ icu లోకి తీసుకొని వెళ్ళి , ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు…

 

మేఘ డ్రెస్ అండ్ రుదిర్ డ్రెస్ అంతా రాహుల్ బ్లడ్ మరకలతో నిండిపోయింది.

 

మేఘ icu రూం బయట ఉన్న దేవుని విగ్రహం కి దండం పెట్టుకుంటు ఉండగా రుదిర్ అక్కడకి వచ్చి , మేఘ చెయ్యి పట్టుకొని అక్కడ నుంచి ఒక మూలకి లాక్కొని వెళ్లి…

 

తనని గోడకు అదిమి పెట్టీ, మేఘ బుగ్గలు రెండు వత్తి పట్టుకుని కోపంగా చూస్తూ.. ” నిన్ను రిపేర్ చెయ్యడానికి ట్రై చేసిన వాడిని అసలు నువ్వు ఎందుకు కాపాడాలి అనుకుంటున్నావు…? ” అని యమ సీరియస్ గా అడుగుతాడు..

రాహుల్ మేఘ నీ రేప్ చెయ్యడానికి ట్రై చేసాడా…? మరి మేఘ ఎందుకు అంత చేసిన రాహుల్ మిద కన్సర్న్ చూపిస్తుంది…?

 

అసలు అన్నతో రిలేషన్ లో ఉన్న మేఘ నీ రాహుల్ ఎందుకు బలవంతం చేయబోయాడు…?

 

ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం..

 

To be continued….