తొలిప్రేమ
హైదరాబాద్ మహానగరం...ఆకాశాన్ని తాకే భవంతులు, నిత్యం రద్దీగా కనిపించే రహదారులు, హడావుడిగా సాగిపోయే జనజీవనం... అలాంటి నగరంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కల్యాణ మండపం అది.ఆ రోజు ఆ కల్యాణ మండపం పెళ్లి కళతో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పూల అలంకరణలు, మెరిసిపోయే విద్యుత్ దీపాలు, సంప్రదాయాన్ని ప్రతిబింబించే అందమైన మండపం... అడుగడుగునా వైభవం ఉట్టిపడుతోంది.వేల సంఖ్యలో బంధువులు, ప్రముఖులు, పేరుమోసిన వ్యాపారవేత్తలు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు.అంతటి వైభవంగా జరుగుతున్నది ఎవరి వివాహమో కాదు...ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ వర్మ గారి ఏకైక కుమారుడు సిద్ధార్థ్ వర్మ వివాహం!పెళ్లి మండపంలో వేదమంత్రాలు మారుమోగుతున్నాయి. హోమగుండం నుంచి వెలువడుతున్న పొగతో పాటు నెయ్యి పరిమళం పరిసరాలన్నింటినీ నింపేస్తోంది.పెళ్లి కొడుకు…