తొలిప్రేమ – 1
హైదరాబాద్ మహానగరం… ఆకాశాన్ని తాకే భవంతులు, నిత్యం రద్దీగా కనిపించే రహదారులు, హడావుడిగా సాగిపోయే జనజీవనం… అలాంటి నగరంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కల్యాణ మండపం అది. ఆ రోజు ఆ కల్యాణ మండపం పెళ్లి కళతో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పూల అలంకరణలు, మెరిసిపోయే విద్యుత్ దీపాలు, సంప్రదాయాన్ని ప్రతిబింబించే అందమైన మండపం… అడుగడుగునా వైభవం ఉట్టిపడుతోంది. వేల సంఖ్యలో బంధువులు, ప్రముఖులు, పేరుమోసిన వ్యాపారవేత్తలు ఒక్కొక్కరుగా […]