New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
crazy ప్రేమమ్ 💕 – 1

crazy ప్రేమమ్ 💕 – 1

 

 

ఉదయం 8:30 గంటలు…

 

సూర్యుడి కిరణాలు నెమ్మదిగా భూమిని తాకుతున్నాయి.

 

ఊరిలోని ఆ పాత ఇంటి ముందు తులసికోట దగ్గర దీపం వెలుగుతోంది..

 

ఆముక్త చేతిలో పూజా పళ్లెం పట్టుకుని దేవుడికి దండం పెట్టుకుంది.

 

ఆముక్త :

 

“దేవుడా… ఈరోజు కాలేజీలో నా మొదటి రోజు. అంతా మంచిగా జరగాలి. నాకు మంచి ఫ్రెండ్స్ దొరకాలి.”

 

అని చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్లింది.

 

కొద్దిసేపటి తర్వాత…

 

లేత పింక్ కలర్ లంగావోణి, చిన్న జిమికీలు, జడలో మల్లెపూలు పెట్టుకుని అద్దం ముందు నిలబడింది…

 

 

 

అమాయకంగా లంగావోణీలో  ముద్దుకే ముద్దు వచ్చే అంత అందంగా ఉంది.. 

 

 

 

 

అచ్చమైన తెలుగింటి అమ్మాయి…

లంగావోణి కట్టుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని, కాళ్లకు పట్టీలు వేసుకుని చూడగానే 

 

 

పల్లెటూరి అందం గుర్తొచ్చేలా ఉంటుంది.

చిన్న చిన్న విషయాలకే మురిసిపోతుంది.

 

 

ఎవరైనా ప్రేమగా పలకరిస్తే చాలు… మనస్ఫూర్తిగా నవ్వేస్తుంది.

 

 

అందరితో మంచిగా ఉంటుంది. పెద్దగా మాట్లాడటం రాదు. అబద్ధాలు చెప్పడం తెలియదు.

 

 

చిన్న పిల్లల మనస్తత్వం… స్వచ్ఛమైన మనసు.

తనవాళ్ల కోసం ఏదైనా చేసే అమ్మాయి.

 

 

కానీ తనని ఎవరైనా బాధపెడితే మాత్రం బయటకు చెప్పకుండా మనసులోనే బాధపడుతుంది.

 

 

అమ్మ:  ఆముక్త… ఇంకా ఎంతసేపమ్మా? కాలేజీకి టైమ్ అవుతోంది!

 

ఆముక్త : వస్తున్నానమ్మా…

 

అమ్మ: ఏంటమ్మా! మొదటి రోజు కదా… కాస్త జాగ్రత్తగా ఉండు.

 

 

ఆముక్త: సరే అమ్మా… బాయ్!

 

అంటూ అమ్మకు ముద్దుగా వీడ్కోలు చెప్పి బయటకు వచ్చింది.

 

 

💗💗💗💗💗💗

 

 

మరోవైపు…

 

ఒక పెద్ద బంగ్లా.

 

మెట్ల మీద నుంచి స్టైలిష్‌గా కిందకు దిగుతున్నాడు  శివాంశ్ దేవ్ – .

 

బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చేతికి వాచ్.

 

కింద సోఫాలో కూర్చున్న అతని తండ్రి అతన్ని చూసి…

 

తండ్రి: శివ్… ఈరోజైనా కాస్త త్వరగా వెళ్తావా?

 

శివ్: నాన్నా… నాకు టైమ్ చెప్పాల్సిన అవసరం లేదు…

 

 

తండ్రి: నీ కోపం కొంచెం తగ్గించుకోరా!

 

 

పేరు శివ్…పొగరు, కోపం ఉన్న రాయల్ బాయ్.

 

 

డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న రాయల్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి… చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాడు…

 

 

 

బ్లాక్ షర్ట్, చేతికి ఖరీదైన వాచ్, కళ్లలో పొగరు, మాటల్లో అహంకారం.

 

 

 

తన మాటకు ఎదురు చెప్పేవాళ్లు అంటే అస్సలు నచ్చదు.

 

 

కోపం వస్తే ఎదురుగా ఎవరున్నారో కూడా పట్టించుకోడు.

 

అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడడు…

 

 

తన ప్రపంచం తనదే అన్నట్టుగా ఉంటాడు.

శివ్ కి ప్రేమంటే బలహీనత… 

 

 

ఎవరి ముందు తలవంచడమంటే అస్సలు ఇష్టం ఉండదు..!

 

 

వీడు ఎప్పటికి మారతాడు అనుకుంటూ జాగ్రత్త శివ్ !

 

 

సమాధానం కుడా చెప్పకుండా కారు కీస్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.

 

 

💗💗💗

 

 

కొద్దిసేపటికి…

 

 

కొత్తగా వచ్చిన విద్యార్థులతో కాలేజీ అంతా సందడిగా ఉంది.

 

. ఆముక్త గేటు దగ్గర నిలబడి ఆశ్చర్యంగా కాలేజీని చూస్తోంది.

 

ఆముక్త మనసులో:

 

“అబ్బా… ఎంత పెద్ద కాలేజీ! ఇక్కడ నేను ఎలా ఉంటానో ఏంటో!”

 

 

అంటూ లోపలికి నడవడం మొదలుపెట్టింది.

 

అప్పుడే…

 

ధడామ్!!

 

ఒక బలమైన ఢీ.

 

ఆమె చేతిలోని పుస్తకాలన్నీ కింద పడిపోయాయి.

 

ఎదురుగా చూస్తే…

 

శివ్!

 

శివ్ : ఏయ్! కళ్ళు కనిపించడం లేదా?

నీకు లాగి పెట్టి ఒకటి పీకాడు !!

 

 

ఆముక్త: ఏడుస్తూ  సోరి చెప్పాను కదా అండీ.. 

 

 

శివ్ :  సారీ అంటే సరేసరిపోయందా నాకు నచ్చని పని చేస్తే ఊరుకోను.. 

 

 

 

అండ్ నన్ను గుద్దుకుని  సారీ అంటే సరిపోయిందా.. కళ్ళు మూసుకుని నడుస్తున్నావా 

 

 

 

ఆముక్త : సారీ అండి… నేను చూడలేదు.

 

 

శివ్ : రోడ్డు మీద నడుస్తున్నావా? ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా చూసుకోవాలి కదా!

 

 

ఆముక్త: సారీ చెప్పాను కదండీ…

 

 

శివ్ : నాకు సారీలు అవసరం లేదు. నడిచేటప్పుడు చూసుకుని నడువు.

 

 

 

అంటూ ముందుకు వెళ్లబోయాడు.. ఆగి మళ్లీ 

లాగి పెట్టి ఒకటి పీకాడు !!

 

 

ఏడుస్తూ సోరి చెప్పాను కదా అండీ నాకు నచ్చని పని చేస్తే నేను చూస్తు ఊరుకోను అది నా విషయంలో… 

 

 

ఆముక్త కింద పడిన పుస్తకాలు తీసుకుంటూ చిన్నగా గొణిగింది..

 

 

ఆముక్త : వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ  తప్ప నాదే అనుకుంటా అందుకే కొట్టాడు .. 

 

 

అయినా ఇంత గట్టిగా నా కొట్టేది “వామ్మో… ఏంటో ఈ పొగరుబోతు ! సారీ చెప్పినా వినడు. మనిషా లేక కోపాల .. 

 

వెంటనే వెనక్కి తిరిగాడు.

 

ఆముక్త : ఏమన్నావ్?

 

ఆముక్త ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 

 ఆముక్త: ఏం లేదండి…

 

శివ్ : నా గురించి ఏదో అన్నావ్ కదా?

 

ఆముక్త : అది… మరి హాహాహా ఏం లేదులెండి!!

 

 ఆముక్త :  డౌట్గ్ చూస్తూ నీ  పేరేంటి?

 

ఆముక్త :  ఆ  .. ఆముక్త.

 

శివ్ : హ్మ్… గుర్తుపెట్టుకుంటా!

 

ఆముక్త : ఎందుకండి?

 

 

శివ్ :  ఏంటే భయం పోయిందా ఇంకోక్కసారి కొట్టాలా …

 

 

ఆముక్త : ఏంటండీ?? 

 

 

నా దారిలో మళ్లీ ఎదురుపడకుండా ఉండటానికి!

అని కోపంగా వెళ్లిపోయాడు.

 

 

ఆముక్త అతన్ని చూస్తూ…

 

 

 

ఆముక్త : ఆపిన ఏడుపు మళ్లీ వచ్చేసింది ఎంత వద్దు అన్నా .. 

 

 

“హమ్మయ్య! వెళ్లిపోయాడు. దేవుడా… మొదటి రోజే ఇలాంటి వాళ్లను చూపించావేంటి?”

 

 

అని తల పట్టుకున్న క్రింద కుర్చీని ఏడుస్తూ ఏడుస్తూనే ?? .

 

 

కానీ తనకు తెలియని విషయం ఏంటంటే…

 

ఆ రోజు జరిగిన ఆ చిన్న గొడవే నా జీవితాన్ని మార్చేసింది అని?? 

 

 

అదే సమయంలో కాలేజీ కారిడార్‌లో…

 

 

ఫ్రెండ్: ఏంట్రా శివ్ … ఎవరితోనో గొడవ పడుతున్నావ్?

 

 

శివ్ : ఏం లేదు రా… ఏదో పిచ్చి పిల్ల .

 

 

ఫ్రెండ్: పిచ్చి పిల్లా ? లేదా చిన్న పిల్లా?  మరి ఎందుకంత కోపం?

 

 

శివ్ : నోరు మూసుకుని నీ పని చూసుకోరా!

అంటూ క్లాస్‌లోకి వెళ్లిపోయాడు..

 

 

మరోవైపు ఆముక్త తన క్లాస్‌రూమ్ వెతుక్కుంటూ వెళ్తోంది..

 

 

తనకు తెలియకుండానే శివ్ కూర్చున్న క్లాస్‌లోకి అడుగుపెట్టింది!

 

 

ఆముక్త : ఎక్స్క్యూజ్ మీ… ఇది ఫస్ట్ ఇయర్ క్లాస్ ఆ?

 

 

శివ్ తల పైకెత్తి చూశాడు..

ఎదురుగా మళ్లీ అదే అమ్మాయి!

 

 

శివ్ : నువ్వా!!

 

ఆముక్త : అయ్యో దేవుడా… మళ్లీ ఇతనేనా!!

 

 

శివ్ : ఏయ్… ఏం మాట్లాడుకుంటున్నావ్?

 

 

ఇంకా ఉంది… ❤️

 

 

 

శివాంశ్ దేవ్ –  అంహరం వల్ల  ఆముక్త  ఎలాంటి పరిస్థితిని తెస్తుంది ?

 

అసలు శివ్ కోపాన్ని ఆముక్త ఎలా ఎదుర్కొంటుంది?