డాడీ ప్రిన్సెస్ ❤️
– నాన్న గుండెల్లో యువరాణి
నరసింహారావు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో అతని జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంటుంది.
పెద్ద కొడుకు ఆదిత్య, పెద్ద కూతురు ఆద్య. చిన్న కూతురు అద్విత. ఇంట్లో అందరూ ఆమెను ప్రేమగా హనీ అని పిలుస్తారు.
హనీ అంటే నరసింహారావుకు ప్రాణం. ఆమె చిన్నప్పటి నుంచే తండ్రి గారాబంలో పెరిగింది. తన కూతురు నవ్వితే అతని మనసు ఆనందంతో నిండిపోయేది. ఆమెకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవాడు.