New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Ghost love 👻 – 4
Ghost love 👻 4 min read

Ghost love 👻 – 4

అవ్యూక్త్  💝 శిశిర

అవి  అతనీ ఫోన్ నుంచి ప్యూన్ కి కాల్ చేసి క్యాంటీన్ నుంచి ఉప్పు , కారం , పంచదార తీసుకొని రమ్మని చెప్పి కాల్ కట్ చేసి….

అతడినే అయోమయంగా చూస్తూ ఉన్న శిశిర నీ చూస్తూ ” ఎంటి బంగారం నన్ను అలా చూస్తున్నావ్…? ఇప్పుడు క్యాంటీన్ నుంచి అవి ఎందుకు తెప్పిస్తున్నాను అనా…?

నువ్వే చూస్తావు గా జస్ట్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్….” అని చెప్పి ప్యూన్ తెచ్చే వాటి కోసం వేవుట్ చేస్తూ ఉంటాడు….

ఐదు నిమిషాలకి అవి చెప్పిన ఐటెన్స్ తెచ్చి అతని ముందు పెట్టేసి వెళ్ళిపోతాడు ప్యూన్…

తన ముందు ఉన్న వాటిని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉప్పు డబ్బా తీసుకొని మూడు స్పూన్లు సాల్ట్ నీ  పప్పు లో   వేసి మిక్స్ చేస్తాడు…

ఆ తరవాత కారం డబ్బా తీసుకొని పచ్చడిలో మిక్స్ చేసి , కర్డ్ ( పెరుగు ) లో షుగర్ మిక్స్ చేసి ఆ డబ్బాలు అన్నీ పక్కన పెట్టి , అతడినే షాకింగ్ గా చూస్తున్న శిశిర నీ కన్నింగ్  గా నవ్వుతూ చూసి….

అతనే  స్వయంగా ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లో ఆ కర్రీస్ అన్నీ వడ్డించి ఆ ప్లేట్ శిశిర చేతిలో పెట్టీ
”  నాతో పాటు నువ్వు కూడా తిను బంగారం ” అని చెప్తాడు.

తన కళ్ళ ముందే కర్రీస్ అన్నిటిలో ఉప్పు , కారం వేసి ఇప్పుడు ఆ కర్రీస్ తనకి వడ్డించి తినమని చెప్తున్నా అవే నే చూస్తూ ఉంటుంది.

అవి తన ప్లేట్ తీసుకొని తింటూ ఉంటె శిశిర మాత్రం అలాగే అయోమయంగా అతన్నే చూస్తూ ఉంటుంది.

తినమని చెప్పిన కూడా ఇంకా అతడినే అయోమయంగా చూస్తున్న శిశిర నీ చూసి అతని చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టీ, శిశిర చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని అతనే పప్పు , పచ్చడి అన్నంతో కలిపి బలవంతంగా శిశిర బుగ్గలు రెండు వత్తి పట్టుకుని బలవంతంగా ఆమె నోట్లో కుక్కుతాడు.

ఆ ఒక్క ముద్ద నోట్లోకి వెళ్ళగానే  కారం వల్ల నోరు అంతా మంట పుడుతూ ఉంటే , పప్పు లో ఉన్న సాల్ట్ వల్ల నాలుక అంతా ఏదోలా అయిపోయి వికారంగా , రకరకాలుగా ఉంటుంది శిశిర కి.

ఆ ఒక్క ముద్ద తన గొంతు దిగలేక బయటికి వస్తూ ఉంటే ” ఆ అన్నం ముద్ద తినకుండా బయటికి కక్కావ్ అనుకో చంపేస్తా ” అని కోపంగా  ఎర్రటి కళ్ళతో చూస్తూ బెదిరిస్తాడు అవి.

శిశిర చాల కష్టంగా ఆ ముద్ద నీ మింగి కళ్ళల్లో నీళ్ళతో అవి నీ చూస్తూ ఉంటే ” అయ్యో బంగారం మంటగా ఉందా…? ” అని జాలి చూపిస్తున్నట్టు అడిగి …..

నేను హాస్టల్ లో ఉన్నప్పుడు కూడా ఇంతే… ఆ హాస్టల్ లో వాళ్ళు పెట్టే ఫుడ్ లో ఒక దానిలో ఉప్పు ఎక్కువ ఉంటే , ఇంకో దాంట్లో కారం ఎక్కువ ఉంటుంది…కొన్నిటిలో అయితే అసలు ఉప్పు లేకుండా చప్పగా ఉంటుంది.

ఇలా చెత్త గ ఉన్న ఫుడ్ నీ రోజు తినలేక ఎన్ని సార్లు ఫుడ్ తినకుండా ఆకలితో నిద్రపోయానో నికు తెలుసా…? అని అడిగాడు ఆ ఓల్డ్ డేస్ గుర్తు చేసుకుంటూ….

( అవి వాళ్ళకి ఉన్న షాపింగ్ మాల్ , సినిమా థియేటర్ అవి అన్నీ ఈ మధ్యనే సంపాదించారు..అవి చిన్నప్పుడు వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ )

అవి శిశిర బుగ్గలు వదిలి ” హూ ప్లేట్ లో ఉన్న ఫుడ్ మొత్తం కంప్లీట్ చెయ్ ” అని చెప్తాడు.

శిశిర ఏమి మాట్లాడకుండా ఒకసారి అవి నీ చూసి ప్లేట్ లో ఉన్న ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది.

అవి అతను తిన్న రెండు ముద్ధలకే కడుపు ఫుల్ గా అనిపిస్తూ ఉంటే ఇంకా ప్లేట్ లోనే చెయ్యి కడిగేసుకొని అతని చైర్ దగ్గరికి వెళ్లి కూర్చొని మెయిల్స్ అవి చెక్ చేసుకుంటూ ఉంటాడు…

శిశిర కష్టపడి ఆ ఫుడ్ అంతా తిని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్న కూడా సైలెంట్ గానే ప్లేట్ పక్కన పెట్టీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ అంతా క్లీన్ చేసి , మళ్ళీ క్యారేజ్ సర్దుకొని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉండగా….

అతను షుగర్ కలిపి పెట్టిన పెరుగు గిన్నె నీ చూపిస్తూ ఆ షుగర్ మిక్స్ చేసినా కార్డ్ తిను ” అని అవి మాటలు వినిపించి వెనక్కి తిరిగి అతన్ని చూసింది.

అవి మాత్రం మెయిల్స్ చెక్ చేసుకుంటూ ” నన్ను చూసింది చాలు చెప్పింది చెయ్ ” అని అంటాడు ల్యాప్ టాప్ నుంచి చూపు తిప్పకుండా…

శిశిర కి ఆ ఫుడ్ తిన్న దగ్గర నుంచి కారం వల్ల కడుపు లో , గుండెల్లో విపరీతంగా మంట పుడుతుంటే , తన నాలుక మిద అప్పుడే చిన్న చిన్న గుల్లలు లాగ వచ్చి , లైట్ గా నాలుక కట్ అయ్యింది.

మరో పక్క వామిట్ ఫీల్ వస్తూ ఉంటే కష్టంగా వాటిని కంట్రోల్ చేసుకుంది.ఇప్పుడు అవి ఆ పెరుగు తినమని చెప్తూ ఉంటె ఒక్క నిమిషం అతన్ని అలాగే చూసి వెళ్లి ఆ గిన్నె తీసుకొని షుగర్ కలిపినా పెరుగు ఒక స్పూన్ తిన్నది.

శిశిర కి అసలు పెరుగు అంటేనే ఇష్టం ఉండదు అందులోనూ షుగర్ కలిపినా పెరుగు తింటూ అంటే ఇంకా వామిట్ ఫీల్ ఎక్కువ అవుతు ఉండేసరికి కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వామిట్ చేసుకుంది.

అప్పుడే ఆ రూం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన అవి ఫ్రెండ్ అజయ్ శిశిర అలా వామిట్ చేసుకోవడం చూసి నవ్వుతూ అవి దగ్గరికి వెళ్లి అతని చెయ్యి పట్టుకొని ఊపేస్తూ ” కంగ్రాట్స్ రా మామ నువ్వు నాన్నవి కాబోతునందుకు నాకు  చాల ఆనందంగా ఉంది ” అని చెప్తాడు.

ఆ మాట వినగానే అవి , శిశిర ఇద్దరు షాక్ అయ్యి పోతారు…

To be continued….