[జహ్నవి గది – రాత్రి/ఉదయం]
వెన్నెల కురుస్తోంది.. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రివేళ, ఒక పాత బస్ స్టాప్ దగ్గర జహ్నవి ఆత్రుతగా పరిగెత్తుతోంది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, గుండె వేగంగా కొట్టుకుంటోంది. దూరం నుంచి ఒక వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఆమెకు కనిపిస్తోంది. అతని ముఖం చీకటిలో స్పష్టంగా లేదు, కానీ ఆ నడక, ఆ రూపం ఆమెకు చాలా పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది.
జహ్నవి: (గట్టిగా అరుస్తూ) “ఆగు! వెళ్ళిపోకు.. నన్ను వదిలేసి వెళ్ళిపోకు!”
ఆమె వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి, వెనక నుంచి అతని భుజాలని గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె కన్నీళ్లు అతని వీపును తడుపుతున్నాయి. “నిన్ను మళ్ళీ కోల్పోవాలని లేదు..” అని ఆమె అనుకుంటుండగానే…
“ఆహ్!” అంటూ జహ్నవి ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది.