New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 19

కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 19

కొద్దిసేపటి తర్వాత మీనాక్షి గారు తేరుకుని వైదేహిని వదిలి,

“క్షమించమ్మా! నిన్ను చూస్తే నా కూతురు గుర్తుకొచ్చి హత్తుకున్నాను” అంటూ తన కళ్లలో వచ్చిన కన్నీళ్లను పైట చెంగుతో తుడుచుకుంటూ చెప్తారు.

“ఇంతకీ నువ్వు ఎవరమ్మా? నీకు ఎవరు కావాలి?” అని అడుగుతుండగా, అర్జున్ మీనాక్షి గారి దగ్గరికి వచ్చి,

 

“తను వైదేహి, అమ్మమ్మా” అని చెప్తాడు.

 

మీనాక్షి గారు వైదేహి చేతులు పట్టుకుని,

“నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా! నువ్వు నిన్న చేసిన సహాయం చిన్నది కాదు. ఆ క్షణంలో అభికి ఏమైనా అయితే మేము కూడా బ్రతికుండేవాళ్లం కాదు” అంటూ ఏడుస్తుంటే, వైదేహికి చాలా బాధగా అనిపిస్తుంది.

 

“ప్లీజ్! మీరు అలా మాట్లాడకండి. నేనేమీ అంత పెద్ద సహాయం చేయలేదు. నా ముందు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే నేను అలాగే చేసేదాన్ని. మీరు ఇలా బాధపడకండి. నాకు కష్టంగా అనిపిస్తుంది” అని వైదేహి చెప్తుండగానే జనార్ధన్ గారు అక్కడికి వస్తారు.

 

అర్జున్ జనార్ధన్ గారి దగ్గరికి వెళ్లి,

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue