New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. ప్రవరాఖ్యుడు – 14

Mr. ప్రవరాఖ్యుడు – 14

అంతా విన్న విశాల్ … ఇప్పుడు నీ ప్లాన్ ఏంటీ?? అని తాపీ గా లెగ్స్ క్రాస్ చేసుకుంటూ అడుగుతాడు. నువ్వే ఏదోకటి చేయాలి విషు… నన్ను ఆది అవమానించింది. అలాంటి దాని జీవితం అవమానపాలు అవ్వాలి. డూ సమ్థింగ్ బేబీ…అంటుంది అతని చెయ్యి పట్టుకుని. వెంటనే అతని చేతిని వెనక్కి లాక్కుంటూ హేయ్ ఎన్ని సార్లు చెప్పాలి నీకు …?? పని అయిపోయాక నన్ను టచ్ చేయొద్దని అంటూ అరుస్తాడు. అతని అరుపు కి భయపడుతూ సారీ సారీ బేబీ మర్చిపోయా అంటూ వెనక్కి జరుగుతుంది. దాని పేరేంటి అని అడుగుతాడు..ఆమె ఫోన్ నుండి తన ఫోన్ కి ఫోటో పెట్టుకుంటూ… తనూజ కి లోలోపలే మండిపోతూ వుంటుంది. దానిలో ఏముందని అందరూ దాని వెనక పడుతున్నారు…. బి** అని తిట్టుకుంటూ కోపం గా ఫోన్ వంక  చూస్తుంది . హేయ్ నిన్నే అని విశాల్ కసురుకునే సరికి హ్..హీ…హీరా బేబీ అంటుంది భయంగా. హ్మ్మ్ దాని డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి … అండ్ నేను ఆ కాలేజ్ లో జాయిన్ అవుతాను యాస్ ఎ లెక్చరర్ అని చెప్తాడు. వావ్ బేబీ…అంటూ తనూజ ఎక్సైట్ అవుతుంటే ఆమె వైపు చీదరింపు గా చూస్తూ … హీరా పిక్ ఓపెన్ చేసి ‘వెయిట్ ఫర్ మీ మై క్యూట్ రాబిట్ ‘ అంటూ సైడ్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్తున్న అతని వైపు చూస్తూ నీ థాట్ నాకు అర్థమైంది విషు…దాని దగ్గర మంచి వాడిలా కలరింగ్ ఇచ్చి నీ వలలో పడేయాలి అనుకుంటున్నావ్…దాన్ని చూసి నువ్వు నాకు దూరం అయినా లేక నేనుకున్నట్టు అక్కడ జరగపోయినా…. నా ప్లానింగ్ లో నేనుంటా బేబీ అనుకుంటూ నవ్వుతుంది…( ముందు ఇది లెగాలి గా …చెత్త మొహంది 😡) హీరా….నన్నే ఎదిరించావ్ కదా …నీ దగ్గరకి పంపిస్తున్నా వాడు పెద్ద సైకో గాడు… వీడొక్కడు చాలు నీ బతుకు ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికి అంటూ నీరసంగా లేచి నడవడం కుదరకపోవడం తో విశాల్ ను బండ భూతులు తిట్టుకుంటూ గోడలు బల్లలు పట్టుకుంటూ బాత్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మెల్లిగా బట్టలు వేసుకుని బయటికి వచ్చి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. 

 

ఇవేమీ తెలియని హీరా తన ముందు వచ్చే రాహు గురించి తెలియక పాపం డాన్స్ ప్రాక్టీస్ అయ్యాక రిషి కోసం వెయిట్ చేసి అతను కనపడక హాస్టల్ కి వెళ్ళిపోతుంది. 

 

రాఖీ కొత్తగా లవ్ లో పడడం తో షాలు తో గ్రౌండ్ లో ఒక చెట్టు కింద కూర్చుని ముచ్చట్లు పెడతాడు. అవును సార్…!! రిషి సార్ ఎందుకంత ఫాస్ట్ గా వెళ్ళిపోయారు ?? అని అడుగుతుంది. వాడికి ఆఫీసు నుండి కాల్ వచ్చింది లే. మావయ్య కాల్ చేసి రమ్మన్నారు ఏదో మీటింగ్ అంటా అందుకే వెళ్ళిపోయాడు అని చెప్తాడు. వావ్ సార్ …రిషి సార్ అప్పుడే బిజినెస్ కూడా హాండిల్ చేస్తున్నారా ?? అని ఎక్సైట్ అవుతుంటే …ఒక ఐబ్రో పైకెత్తి…నిజం చెప్పు నువ్వు నన్ను లవ్ చేశావా ?? లేక రిషి నా?? వాడి గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ ?? అనేసరికి అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త కోపం గా రాఖీ చెంప మీద కొట్టి “నీకంటికి నేనెల కనిపిస్తున్నాను రా?? అతన్ని లవ్ చేస్తూ నీకు ఒకే చెప్పేంత బ్యాడ్ క్యారెక్టర్ అనుకుంటున్నావా నాది?? అయినా నాదే తప్పులే నువ్వు లవ్ అనగానే ఒకే చెప్పడం నాదే తప్పు …అంటూ ఏడుస్తుంది షాలు. నిజానికి రాఖీ ని చూసిన వెంటనే షాలు కి కూడా నచ్చుతాడు. అందుకే అతను లవ్ అనగానే ఒకే చేసేసింది. ఇప్పుడు అతను అలా అనగానే ఆమెకి ఒక్క క్షణం ఓకే చెప్పి తప్పు చేశానా అనిపిస్తుంటే అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడానికి చూస్తుంటే వెంటనే రాఖీ ఆమె చెయ్యి పట్టుకుని … హేయ్ ఎందుకు ఏడుస్తున్నావ్ ?? నేనేదో సరదాగా …అంటూ మాట పూర్తి కాకుండానే మళ్ళీ పీకుతుంది. బిక్కమొహం వేసుకుని ఎందుకు కొట్టావే అని అరుస్తాడు. అతడు అలా అరిచేసరికి కొంచెం భయంగా అనిపించి సో.. సారీ సార్ అంటూ కంగారు పడుతుంది. ఇట్స్ ఒకే లే నేనే సారీ ..నేనేదో సరదాగా అలా అనేశాను కానీ ..అలా అనకుండా ఉండాల్సింది సారీ బేబీ అంటాడు. షాలు కళ్ళు తుడుచుకుంటూ నాకు రిషి సార్ “అన్నయ్య ” లాంటి వాడు. నేను అలానే ఫీల్ అయ్యాను …కాకపోతే అన్నయ్య అని పిలిస్తే ఏమనుకుంటారో అని సార్ అని పిలుస్తున్న అని చెప్పింది. దానికి రాఖీ నిజంగానే గిల్టీ గా ఫీల్ అవుతూ ఐయాం సో సారీ బేబీ .. నేనలా అనకుండా ఉండాల్సింది అని హగ్ చేసుకుంటాడు. అతన్ని తిరిగి హగ్ చేసుకుంటూ నేను కూడా సారీ కోపం లో కొట్టేసా..కానీ నాకు బాధ గా అనిపించింది..మీరు నన్ను నమ్మట్లేదని …అని చెప్తుంది. అక్కడే ఆమె క్యారెక్టర్ అతనికి అర్థమయ్యే సరికి తన సెలెక్షన్ కరెక్టే  అని ఆనందపడుతూ గట్టిగా హగ్ చేసుకుని  సారీ షాలు అని సిన్సియర్ గా చెప్తాడు. ఇట్స్ ఒకే సార్ అంటుంది షాలు. హేయ్ మళ్ళీ సార్ ఏంటీ ఇందాక రా అన్నావ్ గా ?? అంటూ ఆట పట్టిస్తాడు. 

 

వెంటనే ఆమెకి కూడా గుర్తొచ్చి నాలుక కరుచుకుంటూ సారీ అని చెప్తుంది. అంత ముద్దుగా మొహం పెట్టుకున్న ఆమెని చూస్తూ దగ్గరగా జరిగి ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తూ కిస్ చేస్తాడా….?? 🤔😄

 

రిషి ఎందుకు ఆఫీస్ కి వెళ్ళాడు ?? 

 

విశాల్ నిజంగానే కాలేజ్ లో జాయిన్ అవుతాడా?? 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue