ఓకే మమ్మీ అంటూ మళ్ళీ తన రూమ్ లోకి వెళ్లిపోయాడు
ఓహో అయితే ఈ మనిషి ఇప్పటి వరకు వర్కౌట్స్ చేసుకుంటూ ఉన్నాడా అనుకుంటూ రెండు క్షణాలు రాణా వైపే చూస్తూ మళ్లీ అక్కడి నుంచి తిరిగి సుభద్ర గారితో మాట్లాడుతూ ఉంది
అలా చూస్తూ ఉండగానే 11 రోజులు పూర్తి అయిపోయాయి ఇక 11వ రోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న వెంటనే మైత్రి ఇంకా వాళ్ళ అమ్మ మైధిలి ఇద్దరూ అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు
జనని నువ్వు ఈరోజు మైత్రి రూమ్ లో పడుకో రేపు పంతులు గారితో మాట్లాడి మీ ఇద్దరి కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను సరేనా అప్పటివరకు కొంచెం ఇద్దరూ దూరంగా ఉండండి అమ్మ సరేనా వాడు తొందర పడ్డ నువ్వు కొంచెం వాడిని కంట్రోల్ చెయ్యు అన్నారు సుభద్ర గారు