New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
My obsessive younger husband 🦁 part -2 – 1

My obsessive younger husband 🦁 part -2 – 1

 

విజయ్ సింహ గారి కనుబొమ్మలు ముడి పడి ఆశ్చర్యంగా చూసాడు….

జగన్నాధం రెక్క పట్టుకుని పైకి లేపి “ఏం జరిగింది..?!! అని గట్టిగా గంభీర స్వరంతో అడిగాడు…

 

 

“నన్ను ఏం అడగకూ నువ్వు చావలి అంతే చావలి…!! అంటూ వెంటనే మళ్ళీ కత్తితో పొట్టలో పొడిచాడు..

 

 

వెంటనే అక్కడికి పరుగున వచ్చిన ఇద్దరు అబ్బాయిలు “డాడ్..!! అంటూ గట్టిగా అరుస్తూ విజయ్ సింహ గారి నీ పట్టుకుని ఆ జగన్నాధంన్నీ ఒక్క తన్ను తన్ని విజయ్ గారి నీ లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు  హాల్లో ఉన్న సోఫా లో ….

“రిషబ్ సింహ, రిధ్విక్ సింహ “లు 

 

 

స్లీవ్స్ మడతా పెడుతూ బయటకు వచ్చి అక్కడ ఉన్న రాడ్స్ తీసుకుని “ఎవర్రా మీరంతా..? అని ఇద్దరు వాళ్ళ మీదకు విరుచుకు పడుతూ ఎదురు దాడి చేస్తారు… 

 

 

వచ్చిన వాళ్ళనీ వచ్చినట్టు కొడుతూ పోతుంటే 10 మంది ఒకసారే వాళ్ళ మీదకు వస్తారు…

 

 

అయిన తగ్గకుండా కడుపులో పంచులు ఇస్తూ కాళ్ల తో ఎగిరి తంతు, ఇద్దరు గట్టి పోటీ ఇస్తూ ఫైట్ చేస్తుంటారు, 

 

 

వాళ్లేం తక్కువ కాదు 6 ప్యాక్ తో 6 ఫీట్ హైట్ తో యవ్వన వయసులో ఉన్న పాతికేళ్ల కుర్రాడు ఒకడు … 22ఏళ్ళ కుర్రాడు మరొకడు….

 

****************************************************************************

 

అక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్న ముగ్గురు లో ఒక వ్యక్తి “రేయ్.. రేయ్…వాళ్ళనేం చేయకండి…!! అంటాడు… 

 

“ఏంటి మినిస్టర్ బంధాలు బంధుత్వాలు గుర్తొస్తున్నాయా… మరి విజయ్ గాడి విషయంలో లేదా…? అంటాడు వాళ్ళలో ఒకడు ….

 

 

ఇంకొకడు మెయిన్ లీడర్ “వాళ్ళేనేం చేయరులే భయపడకు…!!!అంటాడు 

 

“రేయ్ వాళ్ళనేం చేయకండి రా వాళ్ళని గట్టిగా పట్టుకుని ఆ విజయ్ గాడి సంగతి చూడండి వెళ్ళి…. అంటాడు మెయిన్ వాడు…

 

 

****************************************************************************

 

ఆ విషయం బ్లూటూత్ నుండి వింటున్నా ఆ రౌడీ “ఒకే సార్..! అని  అక్కడున్న రౌడీలతో వాళ్ళని పట్టుకోండి అని చెప్పడంతో వాళ్ళిద్దరినీ నలుగురేసి చొప్పున చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకొని బంధిస్తారు …

 

వాళ్ళని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటారు ఇద్దరు… 

 

వాళ్ళకి కాళ్లు చేతులు ఆడటం లేదు అయిన తగ్గట్లేదు పోరాడుతున్నారు …

 

****************************************************************************

 

“రేయ్ ఆ పిల్ల బచ్చల్ని అలాగే పట్టుకొని ఉండండి కొంతమంది లోపలికి వెళ్ళి సగం చచ్చిన ఆ విజయ్ గాడిని పూర్తిగా చంపేయండి….!!! అంటారు ఆ ముగ్గురు లో ఒకడు 

 

************************************

 

విల్లా లోపలికి కొంతా మంది వెళ్ళగానే అక్కడ విజయ్ సింహ గారి ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇద్దరు ఆడవారు… 

 

“దేవుడా రామచంద్ర ఏంటి మాకు ఈ పరిస్థితి మమ్మల్ని కాపాడే వాడే లేడా …??!!అంటూ తల దగ్గర ఒకరు కాళ్ల దగ్గర ఒకరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు ….

 

 

************************************

 

 

ఆ ముగ్గురు క్రూరంగా నవ్వుతూ “అరేయ్ లోపల ఉన్న ఆ ఆడవాళ్ళని కూడా వేసెయ్యండి రా పీడా పోతుంది ఒక్కరు కూడా మిగల కూడదు…!!!అని క్రూరమైన నవ్వుతో అంటారూ ….

 

అంతే బయట ఉన్నా కొంత మంది లోపలికి వచ్చి విజయ్ సింహ దగ్గర కూర్చున్న ఒకావిడను జట్టు ఈడ్చుకుంటు కింద పడేసారు ….

 

విజయ్ గారు ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు “రేయ్ వదలండిరా తనను ఏం చెయ్యొద్దు… మీకు కావాల్సింది నేను నన్ను చంపండి….!! అంటూ లేచే ప్రయత్నం చేస్తుంటే అప్పటికే రక్తం ఓడుతూ స్పృహ కోల్పోయే పరిస్థితి లో ఉన్నాడు ….

 

ఆవిడ ఏడుస్తూ “మమ్మల్ని వదిలేయండి ప్లీస్…!!! అని బ్రతిమాలుతూ ఉంది ….

 

వెంటనే ఆవిడ జుట్టు పట్టుకుని పైకి లేపి కొట్టడానికి చెయ్యి ఎత్తే లోపే వాడి కడుపులో దిగింది ఒక బల్లెం…. అక్కడిక్కడే వాడు నెలకు ఒరిగిపోయాడు “ఆ…..!!అంటూ అరుస్తూ…

 

(బల్లెం ఎక్కడి నుంచి వచ్చిందో అని మళ్ళీ నన్ను అడగకండి ఆ రౌడీ లు వచ్చేటప్పుడు కొన్ని వెపన్స్ తెచ్చుకున్నారు అందులోదే ఇదీ ఒకటి )

 

వెంటనే అటువైపు చూసారు ఆ రౌడీలు ….

 

“డోంట్ డేర్ టు టచ్ మై విమెన్…!! ఐ విల్ కిల్ యూ ఫకింగ్ బాస్టర్డ్….!!! అని గంభీరమైన వాయిస్ తో ఎర్రటి కళ్ళతో రౌద్రమైన రూపంలో పిడికిలి బిగించి అరుస్తూ చెప్పాడు…..

 

ఆ రౌడీలతో సహా అక్కడున్న ఆడవారు, విజయ్ గారు అతని వైపు తిరిగి చూసారు తీక్షణంగా…..

 

అతడు ఎలా ఉన్నాడు… అంటే ప్రళయ రుద్రునిలా నెత్తుటి కళ్ళతో నిప్పులు చెరుగుతూ గట్టిగా బిగుసుకున్న పిడికిలికి మెడనరాలు పైకి తేలి చూస్తేనే భయంకరంగా ఊగిపోతున్నాడు …

 

అందరూ అతన్ని చూసి ఒక్కసారి గా దిగ్భ్రాంతి తో షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండి పోయారు ….

 

ఆవిడ కింద పడబోతుంటే వెంటనే ఆవిడ దగ్గరికి వచ్చి “అత్త !!…అంటూ రెక్క పట్టి పైకి లేపి కూర్చోబెట్టాడు పక్కనే ఉన్నా ఇంకో సైడ్ సోఫాలో ….

 

వెంటనే వెనక్కి అటు తిరిగి విజయ్ గారి దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని “డాడ్ జస్ట్ థర్టీ మినిట్స్ బేర్ యువర్ పైన్ ఐ విల్ ఫినిష్ థెం ఆల్ బ్లడీ ఫకింగ్ బాస్టడ్స్….!!! అంటాడు చాలా గంభీరంగా… 

 

స్పీడుగా బయటకు అడుగులు వేస్తూ మెరుపు వేగంతో ఆ రౌడీల పై విరుచుకు పడతాడు …

 

అతని మీద కు వస్తున్న వాళ్ళను ఒకడి పొట్టలో గుద్ది ఇంకొకడి గొంతు పట్టుకుని విసిరేసి మరొకడిని కాలితో గుండెల్లో తన్ని తలతో డీ కొడుతూ ఉంటే వాళ్ళు మళ్లీ పైకి లేవకుండా స్పృహ కోల్పోతున్నారు ….

 

ఇలా కాదు అని 10 మంది చొప్పున ఒక్కసారిగా మీదకు వెళ్లారు పెద్ద పెద్ద కత్తులతో ….

 

కత్తులతో వాళ్ళు దాడి చేయడనికి రాగ రెండూ చేతులతో కత్తులున్న చేతులని….

ఇద్దరినీ ఒకేసారి పట్టుకుని ఎగిరి తొడల పై తన్నగా ఎముకలు ఫట్ ఫట్ మని సౌండ్ చేస్తూ విరిగిపోయి కింద పడ్డారు ….

 

ఆ రెండు కత్తులను అతని చేతుల్లోకి తీసుకోని సైడ్ స్మైల్ చేస్తూ… 

వాళ్ళ వైపు చూసి చిరుత వేగంతో ఒక్కొక్కడిని కత్తితో దాడి చేస్తుంటే అసలు వేటు పడిన విషయం కూడా ఆ రౌడీలకి తెలిసేలోపే కత్తినీ దించేస్తున్నాడు ….

 

ఒకేసారి మళ్ళీ ఒక 20 మంది అతన్ని పై విరుచుకు పడ్డారు …

ఎంత మంది వచ్చినా మెరుపు వేగంతో దూసుకుంటూ రెండు కత్తులతో రెండు చేతులతో సవ్యసాచిలా వాళ్ళ మీద కి దూసుకుపోతున్నాడు ….

 

ఆ ఇరవై మంది అక్కడిక్కడే రక్తంతో కుప్పకూలిపోయారు అతను చేస్తున్న ధాటికి నిలువరించలేకపోతున్నారు ఆ రౌడీలు….

 

అతను చేస్తోంది ఫైటింగ్ కాదు వార్ ….

యుద్ధం చేస్తున్నాడు …. తన వాళ్ళని దక్కించుకోవడం కోసం… 

 

ఇంతకి అతను ఎవరో గెస్ చేయండి సరదాగా 

 

కామెంట్ ఇచ్చేసేయండి దోస్తులు…. 🙎♥️

ఫాలో కూడా చేసేయండి….🏃‍♀️🏃

 

🥳🥳✍️✍️ comment must bigulu….

 

please give me your support and quality reviews…..🙏 🙏 

 

 

 

 

                        ✍️ మీ Neeru’s RAM