YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 3
😈😈😈😈😈
ఉదయాన్నే భానుడు ఉదయించి తన లేలేత కిరణాలను కిటికీ ద్వారా రణ్‌వీర్ బాడీపై ప్రసరింపజేశాడు. రణ్‌వీర్ ఇరిటేట్‌గా ఫీలవుతూ బ్లాంకెట్ కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నాడు. ఇంకో రెండు నిమిషాలకు మళ్లీ ఇరిటేట్ చేస్తూ మొబైల్ కంటిన్యూస్‌గా మోగడం మొదలైంది. రణ్‌వీర్‌కి చిరాకు వచ్చి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి.. “యు బ్లడీ ఇడియట్! @@@@” అని ఆంగ్లంలో నాలుగు అక్షింతలు వేసి, మరుసటి నిమిషమే ఎదురుగా ఉన్న గోడకి విసిరికొట్టాడు. ఆ ఫోన్ పది ముక్కలైంది.
విసురుగా బెడ్ దిగి వాష్‌రూమ్‌లోకి వెళ్లి, షవర్ ఆన్ చేసి గోడకి చేతులు ఆనించి నిలబడ్డాడు. షవర్ లోంచి ఒక్కొక్క నీటి బిందువు ఒంటిమీద పడుతున్నకొద్దీ ఇరిటేటింగ్ ఫీలింగ్ పోయి.. ఎప్పటిలాగే ఎక్స్‌ప్రెషన్‌లెస్ ఫేస్ పెట్టి, ఒక 30 నిమిషాల్లో బాత్ కంప్లీట్ చేసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. ఎప్పటిలాగే బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని, డియో స్ప్రే చేసుకుని, హెయిర్ అండ్ వాచ్ సెట్ చేసుకుంటూ రూమ్‌లోకి వచ్చాడు.
ఈసారి పర్సనల్ మొబైల్ రింగ్ అవుతూ కనిపించింది. ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసి, “చెప్పు..” అని తనదైన బేస్ వాయిస్‌తో అన్నాడు. అటువైపు నుంచి మాట్లాడుతున్న రిషికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినంత ఫీలయ్యాడు.
”వాట్ హాపెండ్ రిషి? వై ఆర్ యు కాలింగ్?” బేస్ వాయిస్‌తో అడిగాడు.
”రాణా! న్యూ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మీటింగ్ ఉంది. ఇంకో 30 నిమిషాల్లో నువ్వు అటెండ్ అవ్వాలి. నేను హాల్లోనే ఉన్నాను, వస్తున్నావా?” అని అడిగాడు రిషి.
”ఓకే, ఐ విల్ కమ్ ఇన్ జస్ట్ ఫ్యూ సెకండ్స్” అని కాల్ కట్ చేసి బ్లేజర్ వేసుకుంటూ మెట్లు దిగుతూ వచ్చాడు.
”రిషి, లెట్స్ గో!” అన్నాడు రణ్‌వీర్.
”కన్నా! రా, బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్లు” అని పిలిచారు తల్లి అయిన రాతిక గారు.
”నో నీడ్!” అని ఒక్క ముక్కలో చెప్పి బయటికి నడిచాడు రణ్‌వీర్.
రణ్‌వీర్‌తో పాటు రిషి కూడా కార్ లో ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారు.
”వాట్ ఈజ్ మై షెడ్యూల్ టుడే మిస్టర్ రిషి?” అని అడిగాడు రణ్‌వీర్.
”సార్! టుడే షెడ్యూల్ ఈజ్..” అని చెప్పడం మొదలుపెట్టాడు. “ఇంకో 30 నిమిషాల్లో న్యూ ప్రాజెక్ట్ మీటింగ్, ఆఫ్టర్ దట్ నిన్నటి ఈవెంట్ ప్లానర్ మేనేజర్‌ని వచ్చి కలవమన్నారు కదా.. తనతో అపాయింట్‌మెంట్ ఉంది. దట్స్ ఆల్ టుడే సార్!” అని చెప్పడం ముగించాడు.
ఫోన్‌లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ రిషి చెప్పిందంతా విని, “ఓకే” అని బేస్ వాయిస్‌తో చెప్పాడు.
రెండు నిమిషాల తర్వాత.. 30 ఫ్లోర్ల బిల్డింగ్ ముందు కార్ ఆగింది. ఆ బిల్డింగ్ మొత్తం ఎంతో పోష్ అండ్ రిచెస్ట్ యూనిక్ ఇంటీరియర్స్‌తో బిల్డ్ చేసి ఉంది. అక్కడ వర్క్ చేయడం కోసం చాలామంది ఎంప్లాయీస్ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే శాలరీ ఇంక్రిమెంట్ హైగా ఉంటుంది, అలాగే ఫుడ్ & మెడికల్ సదుపాయాలు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. అదే RSV GROUP OF COMPANIES.
రణ్‌వీర్ ఉన్న మెయిన్ బ్రాంచ్‌కి గార్డ్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కార్ దిగి ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాడు. రణ్‌వీర్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఎంప్లాయీస్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. వాళ్లు తీసుకునే ఊపిరి శబ్దం కూడా వినపడేంత నిశ్శబ్దం!
రణ్‌వీర్ రావడం చూసి అందరూ లేచి విష్ చేస్తున్నా.. ఎవరికీ రిటర్న్ విష్ చేయకుండా తనదైన ఆటిట్యూడ్‌తో పర్సనల్ లిఫ్ట్‌లోకి వెళ్లి 28వ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. వెనకాలే రిషి కూడా ఫాలో అయ్యాడు.
28వ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఆగింది. డైరెక్ట్‌గా తన ఛాంబర్‌లోకి వెళ్లి, “రిషి, అరేంజ్‌మెంట్స్ అయ్యాక కాల్ మీ” అని చెప్పి ఫైల్స్ చెక్ చేస్తూ సైన్ చేయడం స్టార్ట్ చేశాడు రణ్‌వీర్.
”అందరూ కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అయ్యారు సార్. మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు” అని చెప్పాడు రిషి.
”ఓకే, దెన్ లెట్స్ గో!” అని కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లాడు రణ్‌వీర్.
మేనేజర్‌తో పాటు టీమ్ హెడ్స్, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు.
రణ్‌వీర్ రావడం చూసి గౌరవంగా అందరూ లేచి విష్ చేశారు.
రాణా వచ్చి.. “ఓకే, సిట్ డౌన్ ఎవరీవన్” అని గంభీరంగా చెప్పి.. “ఓకే గైస్, లిసన్ కేర్‌ఫుల్లీ! వి ఆర్ స్టార్టింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్. హియర్ ఆర్ ది డీటైల్స్..” అని ప్రాజెక్టర్ ఆన్ చేసి, గంభీరమైన ముఖంతో బేస్ వాయిస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు.
(ఈలోపు మన హీరోయిన్ ఏం చేస్తుందో చూద్దాం రండి)
&&&&&&&&&&&&&&&&&&&&&&&
ఎర్లీ మార్నింగ్ 5:00 గంటలకు కళ్లు తెరిచిన మన పాపకి.. ఎదురుగా ప్రశాంతమైన నవ్వుతో, ఒక చేతిలో టీ మగ్‌తో కనిపించాడు హర్షిత్ వర్ధన్!
”బావా..!” అని లేచి హగ్ చేసుకుని, “నైట్ వస్తానని ఎందుకు రాలేదు? నీ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా?” అని అడిగింది మన పాప.
తనని చూసి నవ్వుతూ టీ మగ్ (మన పాపకి కాఫీ నచ్చదు) పక్కన టేబుల్ మీద పెట్టి, తన చుట్టూ చేతులు వేసి టైట్‌గా హగ్ చేసుకున్నాడు. “బుజ్జీ.. నీకు తెలుసు కదా, న్యూ ప్రాజెక్ట్ మీద వెళ్లానని!” అని చెప్పి, బుజ్జి నుదిటి మీద ముద్దు పెట్టాడు హర్షిత్.
తను చిన్నగా నవ్వుతూ.. “ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వెయిట్ చేయ్! అండ్ నాకు డ్రెస్ తీసిపెట్టు బావా” అని అడిగింది.
”ఓకే, తొందరగా ఫ్రెష్ అయ్యి రా. బ్రేక్‌ఫాస్ట్ చేసి నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్‌కి వెళ్తాను” అని తన బుజ్జికి డ్రెస్ తీసిపెట్టి రూమ్ డోర్ వేసి వెళ్ళిపోయాడు.
(ఇంకా హర్షిత్ వర్ధన్ గురించి చెప్పాలంటే.. తన అమ్మనాన్న చిన్నప్పుడే చనిపోయారు. విక్రమ్ గారి చెల్లెలు, బావ చనిపోయాక హర్షిత్‌ని తమ దగ్గరకు తెచ్చుకున్నారు విక్రమ్, వాసవి గార్లు. సొంత పిల్లలకంటే ఎక్కువే చూసుకున్నారు. ఇక ఈ బావామరదళ్ల పూర్తి వివరాలు ముందు ముందు చూద్దాం!)
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కింద హాల్లో మన హీరోయిన్ వచ్చేసరికి అందరూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
”గుడ్ మార్నింగ్ డాడీ, అన్నయ్యా, బాబాయ్!” అని విష్ చేసి హర్షిత్ పక్కన కూర్చుంది.
”గుడ్ మార్నింగ్ తల్లి!” అని రమ్య ఫాదర్ విశ్వనాథ్ చక్రవర్తి గారు విష్ చేశారు.
(విశ్వనాథ్, విక్రమ్ గార్లు అన్నదమ్ములు. విక్రమ్ గారికి పెళ్లైనప్పటి నుంచి అందరూ కలిసే ఉంటున్నారు. విక్రమ్ గారికి కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, విశ్వనాథ్ గారు, విక్రమ్ గారు కలిసే చూసుకుంటున్నారు.)
”అవును డాడీ! న్యూ ప్రాజెక్ట్‌కి టెండర్ వేశారు కదా, ఏమైంది?”
”అది.. మనం, వేరే కంపెనీ వేసిన టెండర్ అమౌంట్ రెండూ ఒకేలా ఉన్నాయని.. రెండు కంపెనీలు కొలాబ్ అయి ప్రాజెక్ట్ ఫినిష్ చేయమన్నారు తల్లి!”
”హో ఓకే! విచ్ కంపెనీ?”
”RSV కన్‌స్ట్రక్షన్స్!”
”హ్మ్మ్…. ఎక్కడో…. విన్నానదే!” అని “బావా, హూ ఈజ్ ది CEO ఆఫ్ దట్ కంపెనీ?” అని అడిగింది.
”అదే అక్కా, నిన్న ఈవెంట్ చేశాం కదా.. ‘రణ్‌వీర్ సింహ వాసుసేన’, అతనే!” అని చెప్పి.. వెనక్కి తిరిగి చూసి భయపడిపోతూ.. “తూ… తూ… నువ్వేంటే ఇలా రెడీ అయ్యావు? 🙄🙄” అంది చిట్టి తల్లి .
”బావా! ఎలా ఉన్నాను?” అని హర్షిత్ దగ్గర మెలికలు తిరుగుతూ అడిగింది రమ్య.
”అచ్చం పండుకోతిలా ఉన్నావు!” అని రమ్య నెత్తి మీద మొట్టికాయ వేశారు కరుణ చక్రవర్తి గారు.
”అమ్మా..! 😤😤”
”ఏంటే అమ్మా? ఆ జడలో మందారపువ్వు, పెదవులకు రెడ్ కలర్ లిప్‌స్టిక్.. అచ్చం పంది మూతిలా ఉంది! ఆ టాప్‌కి ప్యాంట్‌కి ఏమైనా మ్యాచ్ అయిందా? వెళ్లు.. వెళ్లి మార్చుకోపో!”
”బావా, నువ్వైనా చెప్పు.. బాగోలేనా?”
”😂😂😂😂 హ్మ్మ్…… సారీ! 😂😂 నా వల్ల కావడం లేదు!” అని నవ్వేశాడు హర్షిత్.
”డాడీ, పెద్దనాన్నా.. మీరైనా చెప్పండి!”
”బాగానే ఉన్నావులే తల్లి! ఇలా బయటికి వెళ్తే పిల్లకోతులు నిన్ను వాళ్ల అమ్మ అనుకుని వదలవు తల్లి, వెళ్లి డ్రెస్ మార్చుకుని రా! 🤭”
”మీరు కూడానా? ☹️”
”ఏయ్! నువ్వు ఇంకా వెళ్లలేదా?”
”మ్మ్… వెళ్తున్నామ్మా!”
”ఏంటి అందరూ నవ్వుతున్నారు?” అని రెడీ అయి వచ్చిన విజయ్ అడిగాడు. రమ్య చేసిన పని చెప్పి నవ్వుకుంటూ అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. ఈలోపు డ్రెస్ మార్చుకుని రమ్య కూడా వచ్చింది.
”ఏంటే కోతి, ఏదో చేశావంట?”
”మ్మ్మ్…… టువంటి 🥲🥲🥲 అది…”
”నువ్వు కూడా ఏంటి విజ్జూ? నోరుమూసుకుని తిను” అని విసిగారు వాసవి గారు.
”నువ్వు తిను అమ్మా” అని తల నిమిరి ఇడ్లీ ప్లేట్‌లో పెట్టారు. అలా అందరూ మాట్లాడుకుంటూ తినేసి.. విశ్వనాథ్, విక్రమ్ గార్లు ఆఫీస్‌కి వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోయారు.
”నేను కోర్టుకి వెళ్తున్నాను” అని వెళ్లబోతున్న విజయ్‌ని ఆపుతూ..
“రమ్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి బ్రో!” అని చెప్పి..
”రమ్యా, నేను చెక్ తీసుకుని డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చేస్తాను. బాస్‌కి ఇన్ఫార్మ్ చేయి. బై!” అంది హీరోయిన్.
”అమ్మా, పిన్నీ.. మేము ఆఫీస్‌కి వెళ్తున్నాం” అని సెండ్ ఆఫ్ ఇచ్చి, హర్షిత్‌తో రణ్‌వీర్ ఆఫీస్‌కి స్టార్ట్ అయింది చిట్టితల్లి.
”మామ్, మేము కూడా వెళ్తున్నాం” అని విజయ్, రమ్య స్టార్ట్ అయ్యారు.
రమ్యని డ్రాప్ చేసి.. “బైమ్మా, టేక్ కేర్! ఈవెనింగ్ వచ్చి పిక్ చేసుకుంటా” అన్నాడు విజయ్.
”ఓకే బై బ్రో! అక్క వచ్చాక మెసేజ్ చేస్తాను” అని చెప్పి రమ్య తన ఫ్లోర్‌కి, విజయ్ కోర్టుకి వెళ్లారు.
TO BE CONTINUED…
వాట్ నెక్స్ట్……
కామెంట్స్ & రేటింగ్స్ ఇవ్వండి!
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్….. బై ఫ్రెండ్స్ 👋
Swipe left/right or tap the sides to turn pages