** అజేయ – 16 **
ఆ అడవుల కింద దాగి ఉన్న కొన్ని అసాధారణమైన రాతి నిర్మాణాల ఆకృతులు డిజిటల్ గా బ్లింక్ అవుతున్నాయి..
రాఘవ్ చేసిన ఆ కచ్చితమైన మ్యాపింగ్ చూసి డీన్ ఆర్థర్ కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి..రాఘవ్ తన పవర్‌ఫుల్ అండ్ పాష్ ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ డీన్ ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడం మొదలు పెట్టాడు..
“నేను అక్కడ ఎలాంటి పాత పద్ధతి తవ్వకాలు జరపడం లేదు, సర్. ఐ యామ్ యూజింగ్ లేటెస్ట్ LiDAR స్కానింగ్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ..
నేను కేవలం అడవి పైనుండి సర్వే మరియు భూగర్భ స్కానింగ్ మాత్రమే చేస్తాను..
వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ లోకల్ సెంటిమెంట్స్..నేను డేటాను సేకరిస్తాను. అండ్ దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ బ్రేక్‌థ్రూ ఫర్ అవర్ యూనివర్సిటీ..