ఏదోటి చేయండి రెడ్డి గారు మా నానమ్మ ఉండనట్టే ఉండను అని గోల చేస్తుంది అన్నాడు శ్రీరామ్
మీ పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు అని ఊరుకున్నాను సర్
ఓపిక ఎక్కువ ఉండే వాళ్లే అర్హులు అని కూడా మెన్షన్ చేయండి… ఆవిడ వచ్చి మూడు నెలలు అయితే ఇప్పటికి ఆవిడ కోసం వచ్చి వెళ్లిన కేర్ టేకర్స్ పదిహేను మంది… ఇక ఆవిడకి ఓపిక లేక వెళ్ళిపోతాను అని సత్తాయిస్తుంది అని సన్నిహితుడు అయినా మేనేజర్ రెడ్డి గారి దగ్గర వాపోతున్నాడు భానుమతి గారి మనవడు శ్రీరామ్
సరే అని రెడ్డి గారు వెళ్ళిపోతుంటే వన్ మినిట్ రెడ్డి గారు అని మరొకసారి పిలిచాడు