కార్ లో కూర్చున్న చోట నుండే మెయిల్ ఓపెన్ చేసిన స్వర్ణ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినంత పని అయ్యింది ఆ మెయిల్ చూసి….
ఇంతకీ ఏంటా మెయిల్ అంటే…..
ఫ్రమ్ : చైర్మన్ & సీఈఓ ఆఫీస్
సబ్జెక్ట్ : ఆఫీసియల్ అనౌన్స్మెంట్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)
CEO…? అని మెల్లగా చదువుకుంటూ క్షణం కనుబొమ్మలు ముడిచింది. ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో మెయిల్‌ను ఓపెన్ చేసింది…