స్వర్ణ ని మెట్లపై నుండి అప్పుడే కిందకి వస్తున్న శ్రీరామ్ చూసి ఇంత మార్నింగ్ రావడం ఏంటి నాన్నమ్మ కి రోజు రోజుకి చాదాస్థం ఎక్కువైపోతోంది అని నానమ్మ అంటూ గట్టిగా పిలిచాడు…
పూజ కోసం పువ్వులు కోస్తున్న భానుమతి గారు స్వర్ణ కళ్ళు ఆ మందారలని తలపిస్తుంటే ఏమైయ్యిందా అని ఆలోచిస్తుంటే శ్రీరామ్ అరుపులకి తేరుకొని ఉదయమే నిద్ర లేపనని ఏంట్రా ఆ అరుపులు అని అడిగారు…
టైమ్ చూస్తే సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు ఇంత ఎర్లీ మార్నింగ్ స్వర్ణ ని ఎందుకు రమ్మన్నావ్ అని అడిగాడు…
పూజ కి నాకు సాయం చేస్తుందని అని చెప్పారు భానుమతి గారు…