ఇంద్ర చేసిన పనికి ఒక్కసారిగా అతడి గుండెలపై వాలింది అతడు దగ్గరగా ఉండగా అతడి నుండి వస్తున్నా సువాసన స్వర్ణ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నోట్లో నుండి మాట పెగలట్లేదు ….అతడి గుండె పై చెయ్యేసి ఇబ్బందిగా వదులు ఇంద్ర… నేను త్.. త ర్వాత మాట్లాడుతాను అంది..
ఏ ఇప్పుడేం అయింది అన్నాడు…
ఒక అమ్మాయ్ ముందు షర్ట్ లెస్ గా ఉండటానికి సిగ్గుగా అనిపించట్లేదా… వెళ్లి డ్రెస్ వేస్కోని రా అంది…
చూడటానికి నీకు లేని సిగ్గు చూపించడానికి నాకెందుకో అన్నాడు అతడు..