New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆలుమగలు – 6
ఆలుమగలు Premium 4 min read

ఆలుమగలు – 6

అందరు బయలుదేరి వెళ్లారు అజిత్ వాళ్ళింటికి…. అంతా దిగి వరలక్ష్మి గారు లోపలికి వెళ్లి హారతి తీసుకొచ్చారు…. ఇద్దరికి హారతి ఇచ్చి పక్కకి వెళ్ళాక…. సంజన కీర్తన శ్రావ్య ముగ్గురు కలిసి ఆట పట్టించడం మొదలు పెట్టారు….

 

అజిత్ కి అదంతా నచ్చకపోయినా అది ఆనవాయితీ అనేసరికి ఇంక తప్పక ఉన్నాడు….ఏంటి ఇక్కడ మీరు అడ్డంగా తప్పుకుంటే లోపలికి వెళ్తాం….

 

అమ్మమ్మ అంత తొందర అయితే ఎలా బావ గారు…. ముందు పేర్లు చెప్పాలి ఇద్దరు…. ఏంటి పేర్లు చెప్పాలా ఏ మా పేర్లు మీకు తెలియదా…. లేక గుర్తు చేయాలా అన్నాడు చేయి సరిచేసుకుంటూ….

 

అబ్బా అన్నయ్య ప్లీజ్ ఇదొక సరదా…. ఏంటి సరదా మీరు కూడా తనతో చేరి అలానే అయ్యారా అన్నాడు సీరియస్ గా…. ప్లీజ్ అండి కొంచం ఓపిక పట్టండి…. అబ్బా జనని ప్లీజ్ నువ్వు కూడా మొదలు పెట్టకు….

 

అది కాదు అండి కాదనకండి….ప్చ్ సరే కానీయ్ ఏంటో ఏడవండి… ముందు మా అక్క పేరు చెప్పండి బావ…. ఆ తర్వాత మా అక్క మీ పేరు చెప్పిద్ది అనింది….ఆ మాటకి ఫేస్ ని సీరియస్ గా పెట్టుకొని….

 

నేను నా భార్య జనని వచ్చాం అని చెప్పాడు…. ఇప్పుడు ఓకేనా….ఇంక మేము వెళ్లొచ్చా….ఆహా అప్పుడే కాదు మా వదిన చెప్పాలి ఇప్పుడు అనింది శ్రావ్య….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue