ఈ పక్క ఆ పక్క రెండు వైపులా కుస్తీలు పట్టాను. కానీ ఓపెన్ అవ్వలేదు.
వాడికి లాగే ఈ డోర్స్ కి కూడా బలుపు ఎక్కువ. వాడికి ఓపెన్ అయ్యాయి. నాకు మాత్రం ఓపెన్ అవడం లేదు. నాతో ఆడుకుంటున్నాయి.. అని వెనక డోర్స్ ని కోపంగా చూసి తిట్టుకుంటూ ముందు డోర్స్ దగ్గరికి వెళ్లి ప్రయోగాలు మొదలుపెట్టాను.
ఇక్కడ తెలియని విషయం ఒకటి చెప్పనా..??
నాకు కార్ డోర్స్ ఓపెన్ చేయడం రాదు. కానీ వాడు ఇచ్చిన ఛాన్స్ మిస్ అవ్వకూడదు, అందుకే డోర్స్ తో నాకు తెలిసినట్టు కుస్తీలు పడుతున్న.