New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 5

ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 5

 

 

 

 

 

 

🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ -05

(The Destiny Of Love )🌸🕊️

 

 

హృషిక్.. మాత్రం మనసులో ఎదవలు.. వీళ్ళు స్టాచులా అయిపోతారు అని తెలీదు అనుకుంటూ..

 

తన ఫ్రెండ్స్ వైపు తిరిగి నిజం గానే తన స్నేహితులు స్టాచు అవ్వడం చూసి.. చుట్టూ చూస్తాడు..

 

కాలం అక్కడే ఆగినట్టు అనిపిస్తుంటే.. హ్మ్మ్ మళ్ళీ ఏ ఏంజిల్ నో టైమ్ ని స్టాచు చేసింది అని అనుకుంటూ..

 

ఆగిన కాలంలో అతడు ముందుకు సాగుతాడు..

చుట్టూ వున్నా కాలం అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంటే.. 

 

గాలిలోనే ఆగి పోయిన సీతకొక చిలుకని చూస్తూ.. ఇంకో వన్ మినిట్ లో అంతా నార్మల్ అవ్వుద్ది అని అనుకుంటూ ఆ కొద్ది క్షణాల కాలాన్ని అనుభూతి చెందుతాడు హృషిక్..

 

హృషిక్ అనుకున్నంతలోనే  కాలం మళ్ళీ యాదవిదిగా.. మారగా.. ఓహ్.. ఈ రోజు ఏంటి టైమ్ కొంచం తొందరగానే సెట్ అయి పోయింది  అని మనసులోనే అనుకుంటూ..

 

ఎప్పుడు ఇంతే.. ఒక టూ మినిట్స్ కూడా టైమ్ ని ఎంజాయ్ చేయనివ్వదు.. ఎవరో ఆ గాడేస్.. ఇంతకీ.. ఈ కాలాన్ని ఆపేది.. దేవత నేనా.. లేదంటే… దేవుడా..

 

యాక్షులా.. లేదా దేవా దూతలా.. లేదంటే.. నేను అనుకునే.. ఆ దేవా కన్య నేనా..అని మనుసులో అనుకుంటూ.. తన ఊహల్లో ఒక రూపానికి ఊపిరి పోసే ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అవుతుంటాడు హృషిక్..

 

ప్చ్.. ఈ టైమ్ ఏంజెల్.. ఎవరు బేబీ నువ్వు.. ఇంకో టెన్ మినిట్స్ అలానే టైమ్ ని స్టాప్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు హృషిక్ 

 

హృషిక్ ఫ్రెండ్స్.. హృషిక్  వాళ్లతో మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ.. వాళ్ళని దాటి ముందుకు వెళ్లిన హృషిక్ ని చూసి..  రేయ్ హృషి అని హృషిక్ దగ్గరికి వస్తారు..

 

హృషిక్ తన ఫ్రెండ్స్ ని గమనించిన కూడా పట్టించుకోకుండా.. అసలు టైమ్ ఎందుకు అలా అప్పుడుడప్పుడు ఆగిపోతుందో  అని ఆలోచిస్తూ… 

 

ఆగిన ఆ టైమ్ లో కూడా తను ఎందుకు.. కదలగలుగుతున్నాడు అని అనుకుంటూ.. 

 

ఎందుకు ప్రతిసారి తనకి ఎవరో ఏదో చెప్పాలి అని  ట్రై చేస్తున్నట్టుగా తనకి ఎందుకు పదే పదే గుర్తు వస్తుంది అని అనుకుంటూ.. ముందుకు నడుస్తాడు..

 

హృషిక్.. ఫ్రెండ్స్.. రేయ్ హృషి అంటూ.. ఆగకుండా వెళ్తున్న హృషిక్ ని పట్టుకొని ఆపి.. సీరియస్ గా హృషిక్ ని చూస్తూ.. రేయ్ అంతలా అరుస్తున్నాం  వినిపించటం లేదా రా ఇడియట్ అని అంటూ..

 

మాతో మాట్లాడుతూ.. మా దగ్గరే కూర్చున్న వాడివి.. కన్ను మూసి తెరిచేలోగా.. ఇక్కడికి ఎలా వచ్చావ్ రా.. 

 

మా దగ్గర ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నావా.. లైక్ మాయలు ఆర్ మంత్రాలూ లేదా మ్యాజిక్ అని అంటారు..

 

హృషిక్ మౌనంగా ఉండటం చూసి..   వెయిట్.. వెయిట్ మాయలు.. ఇంకా మంత్రాల వంటివి ఎమ్ చెయ్యట్లేదు కదా.. అసలే ఈ మధ్య నీ మూడ్ కూడా బాగుండట్లేదు అని డౌట్ గా అడుగుతారు…. 

 

హృషిక్ తన ఫ్రెండ్స్ వైపు విసుగ్గా చూస్తూ.. తనకే  క్లారిటీ లేని విషయాల గురించి తన ఫ్రెండ్స్ కి ఏమని ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటూ.. 

 

ఏంటి బె మీ గోలా.. నేను సన్ రైజ్ ఎంజోయ్ చేద్దాం అని వస్తుంటే.. మీ నస ఒక్కటీ అని అంటూ.. అటు చుడండి బే అని.. తన ఫ్రెండ్స్ కి తన ఎదురుగా వున్నా.. దాన్ని చూపిస్తూ వాళ్ళని డైవర్ట్ చేస్తాడు హృషిక్….

 

అప్పుడే ఆలయం గోపురం వెనుక నుండి తొలి వేకువ సూర్య కిరణాలు బంగారు వర్ణంలో కనిపిస్తుంటే ఆ ప్రకృతి సౌందర్యాన్ని తన ఫ్రెండ్స్ కీ చూపిస్తాడు.. హృషిక్..

 

ఎంతో.. మనోహరంగా వున్నా ఆ సూర్యోదయంన్ని… మనసారా కన్నుల్లో నింపుకుంటూనే .. హృషిక్ తో రేయ్ మామా నువ్వు గుడిలో ఉండి కూడా మమ్మల్ని తిడుతున్నావ్ రా అని కంప్లైనింగ్ గా అంటారు..

 

హృషిక్.. తన ఫ్రెండ్స్ మాటలకి తను వాళ్ళని బే అని అన్నాడు.. అని అనుకుంటూ… తన ఫ్రెండ్స్ వైపు కోపంగా చూసి.. తను గుడి ప్రాంగణంలో అలా మాట్లాడినందుకు మనసులోనే ఆ అందాల రామయ్యకి క్షమాపణలు చెప్పి..

 

అంతా మీ వల్లే అని తన ఫ్రెండ్స్ ని అంటూ.. మీ  గోలా ఇంకా అయిపోతే.. మనం ఈవెనింగ్ వరకు కాశికి వెళ్ళాలి.. 

 

అండ్ ఈ రోజు నైట్ గంగ హారతి కూడా తప్పకుండ చూడాలి అని అంటూ.. మనసులో అక్కడ అయిన నాకు ఏదైనా  తెలుస్తుందేమో అని అనుకుంటూ..

 

తన ఫ్రెండ్స్ వైపు చూసి ఓకే నా అని అడుగుతాడు హృషిక్.. తన ఫ్రెండ్స్ అయినా…మృదుల్.. నీరజ్.. ఇంకా. ఆనంది మరియు కౌముదిలని చూస్తూ.. 

 

అమ్మాయిలు  ఇద్దరు మాకు ఓకే.. హృషి అని అంటూ హృషి ఈ రోజు కార్తీక మాసం మొదటి సోమవారం అంట రా..

 

నదిలో దీపాలు వదిలేస్తే  మంచిది అని  అమ్మ చెప్పింది.. అంటూ మనం కూడ అలా చేద్దాం రా అని అడుగుతారు బ్రతిమిలాడుతున్నట్టు .. 

 

హృషిక్ వాళ్ళని చూసి ఓకే అని మాములు గా చెప్పి..

మృదుల్ ని ఇంకా నీరజ్ లని చూసి.. రేయ్.. ముందు హోటల్ కి   వెళ్లి.. డ్రెస్  చేంజ్ చేసుకున్నాక…

 

టిఫిన్ చేసి… ఇంకొంచెం  సమయం అయోధ్యని కూడా ఎక్సప్లోర్ చేసాక.. కాశికి.. స్టార్ట్ అవుదాం అని చెప్తాడు..

 

మృదుల్ ఇంకా నీరజ్ ఇద్దరు కూడా హృషిక్  మాటలకి ఓకే రా అని అంటారు.. ఆ తరువాత ఫ్రెండ్స్ ఐదుగురు కలిసి వాళ్ళు స్టే చేస్తున్న హోటల్ కి వెళ్తారు.. 

 

అందరు కూడా టిఫిన్ చేసాక.. బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకొని.. అయోధ్యలో వున్నా కొన్ని ఫేమస్ ప్లేసెస్  చూడటానికి వెళ్తారు అందులో ముఖ్యమైనవి…

 

మొదటి ది..రామ జన్మభూమి అదేనండి రామ మందిరం

 

అలాగే..సరయూ ఘాట్.. సరయు నది హారతి..

 

* * * * * * * * * * * * * * * * * * * * * * 

 

𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️