ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 4
🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ 04
(The Destiny of Love )🌸🕊️
అప్పుడే ఆ ఆలయ మెట్ల మీద నెమ్మదిగా కనిపిస్తుంది ఒక నీడ.. ఆ రాముడే మళ్ళీ ఈ అవనిని చేరడా అన్నట్టుగా వున్నా.. ఒక ఆజానుబహుడు పట్టు పంచలో మేడలో కండువా ఒక్కటే ధరించి.. శ్రీ రామ తారక మంత్రాన్ని అతడి మనసు మననం చేసుకుంటూ వుంటే..
“శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాననే”
అని మౌనంగా పలుకుతాయి అతడి పెదవులు…
అతను ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెడతాడు నిశ్చల మనసుతో…. తన స్నేహితులతో కలిసి…
ఆ సూర్యుడు సరయు నది మీద నుంచి మెల్లగా పైకి ఎగసే వేళ… ఆ వెలుగు కిరణాలు ఆ ఆలయంలోని ఆ రాతి మెట్ల మీద పడతుంటే..
ఆ అయోధ్య గాలిలోనే ఒక శాంతి నిండి.. పోయినట్టుగా..
వాళ్ళకి ముందుగా కనిపించేది…
ఆకాశాన్ని తాకేలా నిలిచిన ఆ రామ మందిర శిఖరం…
నాగర శైలిలో చెక్కిన ప్రతి శిల్పం… కూడా ఒక కథలా మాట్లాడుతుంది… మనతో..
ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే…
వారి పాదాల కింద నిలిచినా ఆ రాయి చల్లదనం,
చెవుల్లో.. మారు మొగుతున్న.. గర్భ గుడి గంటల మృదువైన ధ్వని..,
అది వినగానే.. అతడి హృదయంలో ఏదో తెలియని అతీత భావం ఏర్పడగా….
సుదీర్ఘంగా వరుసగా నిలిచిన ఆ రాతి స్తంభాలని చూస్తూనే.. ప్రతి స్తంభంపై చక్కగా చెక్కిన.. ఆ రామాయణ మహా కావ్యంలోని ప్రతి ఘట్టం కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ వుంటే…
రాముడు విల్లు ఎత్తిన క్షణం,
సీతా స్వయంవరం,
అరణ్యవాసం,
వానరసేన ఉత్సాహం…
అవి అన్ని కూడా వారి మనసులో చోటుచేసుకోగ… వారి అడుగులు ఆ గర్భగుడి వైపుగా సాగుతుంటే.. అటుగా నడుస్తూ…
అక్కడ…స్వచ్ఛమైన వెలుగులో నిలిచిన బాలరాముడుని దర్శించుకుంటారు..
చిన్న వయసు అయినా..,ఆ ముఖంలో రాజసం, కరుణ ఇంకా ధైర్యం… చక్కగా కనువిందు చేస్తుంటే…
ఆ రామయ్య కళ్లలోకీ చూస్తే.. ఆ రామయ్య..
“నీవు.. నా సమక్షంలో సురక్షితంగా ఉంటావు ” అన్నట్టుగా చెప్తున్నట్టు అనిపిస్తుంటే.. అది అంతా కూడా రామ భక్తి.. రామయ్య మీద నమ్మకం అని అనిపిస్తున్న వేళ….
విగ్రహం చుట్టూ వెలిగే దీపాల కాంతి… ఆ రాయి గోడల మీద నర్తిస్తుండగా కాలం.. అక్కడే ఆగిపోయినట్టే అనిపిస్తుంది…
ఎంతో సమయం..అలా ఆ రాముణ్ణి చూస్తూ అలాగే ఉండి పోతారు.. స్నేహితులు అంతా..
అలా ఆ రామయ్య దర్శనం చేసుకున్నాక..బయటికి వచ్చేసరికి… చల్లగా వారి వంటిని తాకుతున్న.. ఆ సరయు నది గాలి సైతం శ్రీరామ నామాన్ని మోసుకువస్తుంటే వారి చెవుల్లో మారు మోగుతుంటుంది… శ్రీ రామ తారక మంత్రం..
గర్భగుడి ముందుకి రాగానే.. ఆ గుడి ఆవరణంలో కూర్చున్న వాళ్ళకి.. ఏదో తెలియని ఆనందం మనసుని నింపిస్తుంటే..
అతడి దృష్టి మాత్రం…ఆ రాయి స్తంభాల మీద చెక్కిన రామాయణ ఘట్టాలు.. మీదే.. ఉంటుంది ఆ శిల్పాలు కూడా అతనిన్నే చూస్తున్నట్టుగా… అతనికి అనిపిస్తూ వుంటే…
గర్భగుడి ముందు ఆగి
తల వంచి చేతులు జోడిస్తాడు…
బాల రాముడి విగ్రహం.. నవ్వుతూ అతన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంటే ఆ రామయ్య చల్లని చూపు అతడి మీద పడగానే.. అతడిలో ఏదో తన్మాయత్వం….
ఆ రాముడినే.. తలుచుకుంటూ.. ఉంటాడు అతడు.. తనదైన లోకంలో మరో వైపు తమ మాటలని పట్టించుకోని అతడిని పిలుస్తారు.. అతడి స్నేహితులు…
రేయ్.. హృషిక్ అంటూ.. వారు పిలుస్తున్న పిలుపులు.. చాలా సమయం తరువాత.. అతని చెవులని తాకగానే..
తన ఫ్రెండ్స్ వైపు తిరిగి.. ఏంట్రా అని అంటాడు.. అక్కడ ఆ ఆలయం అతనికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే… అది ఏంటో తెలుసుకునే పనిలో వున్నా అతడు..
తన స్నేహితులు చేసే ఆటంకం.. అతడికీ అలవాటే అన్నట్టుగా.. వాళ్ళని చూస్తాడు.. చిన్న చిరు నవ్వుని పెదవుల మీదనే నిలిపి..
వాళ్ళు రేయ్ హృషి.. ఏంట్రా ఎప్పుడు చూసిన అలా స్టాచు అయిపోతావ్ అని అడుగుతారు
హృషిక్.. మాత్రం మనసులో ఎదవలు..నేను కాదు వీళ్ళు స్టాచులు అయిపోతారు అని తెలీదు అని అనుకుంటూ..
వాళ్ళని చుస్తే.. నిజంగానే తన స్నేహితులు స్టాచు అవ్వడం చూసి.. చుట్టూ చూస్తాడు..
కాలం అక్కడే ఆగినట్టు అనిపిస్తుంటే.. హ్మ్మ్ మళ్ళీ ఏ ఏంజిల్ నో టైమ్ నీ స్టాచు చేసింది అని అనుకుంటూ..
ఆగిన కాలం లో అతడు ముందుకు సాగుతాడు..!!!
కార్తీక మాసం మొదటి సోమవారం…
శివతత్వం మేల్కొన్న రోజు…
అదే రోజు, అయోధ్యలో,
ధర్మాన్ని మోసే ఒక మనిషి
తన మార్గాన్ని ఎంచుకున్నాడు.”
ధర్మానికి శివ శక్తి అంగీకారం అన్నట్టే… అతడి అడుగులు ధర్మం వైపు అడుగులుగా నడుస్తాయి…
అతడి అడుగుల గమ్యం.. ఆమె అయితే…
శివతత్వం… ఆమె అవ్వగా…
విష్ణురక్షణ.. అతడు అయి.. ఆమెకి రక్షకుడిగా మారగలడా…!!!
శివుడు అంటేనే.. తపస్సు, వినాశనం, మార్పు..
విష్ణువు అంటేనే..ధర్మం, రక్షణ, స్థిరత్వం..
అలాంటి ఆ శివకేశవుల .. ప్రతి రూపాలుగా వున్నా..
యాషిక.. అండ్ హృషిక్ లా ప్రయాణం ఎలా సాగబోతుందో…
వారి.. ప్రణయమే.. ప్రళయమైన వేళ…
The Destiny of Love…
చదువుతూ వుండండి…
* * * * * * * * * * * * * * * * * * * * * *
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️
Swipe left/right or tap the sides to turn pages