అగస్త్య దన్వికతో కలిసి మెట్లు దిగి కిందకు వచ్చేసరికి హాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరి చూపులు ఒక్కసారిగా వాళ్లిద్దరిపైనే పడ్డాయి.
అప్పటికే అగస్త్య కోసం ఎదురుచూస్తూ ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతున్న వాళ్లకు, అతని పక్కన ఉన్న దన్వికను చూడగానే తమ సందేహాలను ఆపుకోవడం మరింత కష్టమైంది…..
అసలు నిన్నటి పెళ్లిలో ఏం జరిగిందో, తాము పెళ్లి కుదిర్చిన అమ్మాయి ఏమైందో, ఇప్పుడు అగస్త్య పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో ఎవరికీ అర్థం కావడం లేదు.
అందరికంటే ముందుగా గీత తన మనసులో ఉన్న ఆందోళనను బయటపెడుతూ అగస్త్యా, ఒక్క నిమిషం ఆగు,అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు.
మేము నీకు పెళ్లి కుదిర్చింది ఒక అమ్మాయితో, కానీ నిన్న పెళ్లి మండపంలో పెళ్లి చేసుకున్నది మరొక అమ్మాయితో. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు?
మేము పెళ్లి కుదిర్చిన అమ్మాయి ఏమైంది?
అసలు నిన్న ఏం జరిగింది? అని ప్రశ్నించింది.