అవసరం లేదు ఆద్య..డాక్టర్ మా ఇంటికి కాల్ చేసారు.. అమ్మ వాళ్ళు వస్తున్నారు ఈ పాటికి వచ్చేస్తుంటారు అని చెప్తాడు రాఖీ…
అవునా గుడ్ అంటూ రాఖీ పక్కన కూర్చుని ఐ ఆల్సో మిస్ యూ రా…ఈ టూ డేస్ నీతో మాట్లాడకుంటే నాకు కూడా అస్సలు ఏం బాలేదు తెలుసా….
ఎంత బావ వాళ్ళతో ఉన్నా సరే నువ్వు గుర్తు వస్తూనే ఉన్నావ్….ఒక్కసారి అయిన నీతో మాట్లాడాలని ఎంతగా ట్రై చేసానో, కానీ బావ అసలు నాకు ఆ ఛాన్స్ ఏ లేకుండా చేసాడు…
ఫోన్ ముట్టుకుంటే చాలు నేను అంత దూరం నుండి వస్తే ఇప్పుడు కూడా నీకు ఫోన్ ముఖ్యమా అంటూ ఫోన్ తీసుకుని నాకు ఇవ్వలేదు..
అందుకే నీతో మాట్లాడలేకపోయాను.. లేదంటే నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా చెప్పు అంటూ రాఖీని ఎంతో ప్రేమగా చూస్తూ చెప్తుంది….
రాఖీ కూడా అంతే ప్రేమగా ఆద్యని చూస్తూ నాకు తెలుసులేరా నీ గురించి,నీ మనసు గురించి యూర్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అంటూ ఆద్య చేతిని చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు..