New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 5

ఎవరిది ప్రేమ? – 5

ఓహ్ అవునా…ఏంటి సార్ చెప్పండి అని అంటుంది ఆద్య…

 

అప్పుడు ప్రిన్సిపాల్  ఆమె వైపే చూస్తూ ఆద్య నాకు నీ హెల్ప్ కావాలి చేస్తావా అంటాడు…

 

 అయ్యో మీరు అలా అంటున్నారు ఏంటి సార్.. అయినా నేను మీకు ఏం హెల్ప్ చేయగలను అంటుంది అయోమయంగా ఫేస్ పెట్టి సార్ ఏం అడగాలనుకుంటున్నారో అర్ధం కాక …

 

 

ఆద్య ఫేస్ చూసిన సార్ చిన్నగా నవ్వుతూ ఎస్ ఆద్య నాకు ఈ హెల్ప్ నువ్వు మాత్రమే చేయగలవు..  అదేంటి అంటే ఇటు చూడు అంటూ ఆ అబ్బాయి వైపు చూపించి హి ఇస్ మిస్టర్ రాఖీ నీకు తెలుసు అనుకుంటున్నా..నిన్నే మన కాలేజ్ లో మీ క్లాస్ లోనే జాయిన్ అయ్యాడు అంటూ రాఖిని చూపిస్తూ చెప్తాడు….

 

అప్పుడు చూస్తుంది ప్రిన్సిపాల్ కి ఇటు పక్క ఉన్న రాఖీని..అతన్ని చూసి ఓహ్ నేను ఇందాక చూసింది ఇతన్నేనా, అయినా ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు. క్లాస్ కి వెళ్లకుండా అనుకుంటూ ఏమోలే అని అంతటితో దాన్ని వదిలేసి హా తెలుసు సార్ నిన్న ఈవెనింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు క్లాస్ లో చూసాను అని చెప్తుంది నార్మల్ గా …

 

హ్మ్…ఇతను ఇంతకముందు ఫారిన్ లో చదువుతున్నాడు ఆద్య..కొన్ని ప్రోబ్లమ్స్ వల్ల వీళ్ళ ఫ్యామిలీ ఇండియా వచ్చేసారు.అందుకే రాఖీ లేట్ గా మన కాలేజీ లో జాయిన్ అయ్యాడు….

 

హి ఇస్ ఆల్సో వెరీ టాలెంటెడ్ స్టూడెండ్ లైక్ యూ  అని నవ్వుతూ చెప్పి  అతను లేట్ గా జాయిన్ అవడంతో క్లాస్సేస్ చాలా మిస్ అయ్యాడు కదా.. సో ముందుగా మీకు చెప్పిన క్లాస్సేస్ అన్నీ రాఖీకి నువ్వే ఎక్సప్లయిన్ చెయ్యాలి….

 

రాఖీ నోట్స్ రాసుకునే దానికి కూడా నువ్వు హెల్ప్ చెయ్యాలి…అతని డౌట్స్ క్లియర్ చెయ్యాలి..ఇదే నువ్వు చెయ్యాల్సిన హెల్ప్…

 

నువ్వు ఎంత టాలెంటెడో నాకు తెలుసు.. ప్రతి చిన్న విషయాన్ని బాగా అర్ధం చేస్కుంటావ్.. పక్కన వాళ్లకి ఆ విషయాన్ని చక్కగా అర్ధం అయ్యేలా ఎక్సప్లయిన్ చేయగలవ్..

 

 అందుకే రాఖీ కి హెల్ప్ చేయడానికి నువ్వే కరెక్టే అని నిన్ను రమ్మని పిలిచాను అని అతను ఆద్యని ఎందుకు పిలిచాడో క్లియర్ గా చెప్పేసాడు….

 

అంత విన్న ఆద్య నార్మల్ గా స్టడీ విషయాలలో ఎవరికైనా హెల్ప్ అంటే ముందు ఉంటుంది కాబట్టి ఓకే సార్ నేను చూసుకుంటాను…అతనికి అన్నీ నేను ఎక్సప్లయిన్ చేస్తాను అని చెప్తుంది…

 

హ్మ్ గుడ్ ఆద్య.. థాంక్యూ…నీకు ఎప్పుడు ఫ్రీ టైమ్ ఉంటె అప్పుడు రాఖీ కి హెల్ప్ చెయ్ అని చెప్తాడు ప్రిన్సిపాల్..

 

ష్యూర్ సార్.. ఇంత చిన్న విషయానికి మీరు థాంక్స్ లాంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది ఆద్య….

 

ఆ మాటకి చిన్నగా నవ్విన ప్రిన్సిపాల్ రాఖీని చూస్తూ ఇంక నీకేం ప్రాబ్లమ్ లేదు రాఖీ..అంత మా ఆద్య చూసుకుంటుంది..నీకు ప్రొఫెసర్స్ కంటే కూడ క్లారిటీ గా చెప్తుంది అని నమ్మకంగా చెప్తాడు..

 

ఆ మాటలు వినగానే ఆద్య చిన్న నవ్వు నవ్వుతుంది….

 

రాఖీ మాత్రం ఆమె వైపు తిరిగి థాంక్స్ ఆద్య గారు అని పొలైట్ గా చెప్తాడు.

 

 ఇట్స్ ఓకే అని రాఖీ తో చెప్పి, సార్ ఇంక నేను క్లాస్ కి వెళ్ళనా అని మర్యాదపూర్వకంగా సార్ ని అడగగా.. ఓకే ఇద్దరు క్లాస్ కి వెళ్ళండి అని చెప్తాడు ప్రిన్సిపాల్..

 

దాంతో రాఖీ, ఆద్య అక్కడ నుండి వెళ్ళిపోతారు..

 

క్లాస్ లోకి వచ్చిన ఆద్యని తన ఫ్రెండ్స్ విషయం ఏంటి అని అడగగా ఆద్య ప్రిన్సిపాల్ తనతో మాట్లాడిన మాటలు అన్ని చెప్తుంది…

 

ఓహ్ ఓకే…అతను కూడా నీలానే పుస్తకాల పురుగన్నమాట… వచ్చిన నెక్స్ట్ డే నే చదువుపై తెగ శ్రద్ద పెడుతున్నాడు అని అంటారు…

 

హ్మ్ అందరు మీలా చదువంటే భారం లా ఫీల్ అయ్యేవాళ్ళు ఉండలేరు గాని కామ్ గా క్లాస్ వినండి అని వాళ్ళని కసిరి క్లాస్ వింటుంది…

 

సేమ్ రాఖీ కూడా శ్రద్దగా క్లాస్ వింటూ ఉంటాడు…

 

అలా ఇద్దరు ఈవెనింగ్ వరకు క్లాస్ వింటూ ఫ్రీ టైమ్ లో ఆద్య దగ్గరకి వచ్చి ముందు చెప్పిన క్లాస్సేస్ చెప్పించుకుంటూ ఉంటాడు అతను …

 

వాళ్ళిద్దర్నీ ఒక చోట ఎక్కువగా మాట్లాడుకోవడం చూసిన క్లాస్ లో అబ్బాయిలు షాకింగ్ గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఈ ఆద్య ఏంటి నిన్న వచ్చిన వాడితో ఇంత తక్కువ టైమ్ లో అంతలా మాట్లాడుతుంది అని డౌట్ వచ్చి అదే విషయాన్ని తన ఫ్రెండ్స్ ని అడగడంతో వాళ్ళు ప్రిన్సిపాల్ చెప్పిన మేటర్ చెప్పడంతో, ఓహ్ అదా విషయం గురుడు కూడా ఆద్య లానే ఉన్నాడన్నమాట అలా అయితే మాకు పెద్ద ప్రాబ్లెమ్ ఉండదులే అని మనసులో అనుకుంటారు….

 

(అమ్మాయిలని ఇంప్రెస్స్ చేస్కోవచ్చు అని వీళ్ళ బాధ వీళ్ళది పాపం )

 

అలా రోజు క్లాస్సెస్,నోట్స్ అంటూ ఆద్య, రాఖీ ఎప్పుడు ఒకే చోట ఉంటూ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు….

 

రాఖీ ఆద్యతో తప్ప ఇంకే అమ్మాయిలతో పెద్దగా మాట్లాడేవాడు కాదు…ఫార్మాలిటీగా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉండేవాడు..

 

అది ఆద్య కూడా గమనించి నాట్ బ్యాడ్..మంచి అబ్బాయిలనే ఉన్నాడు అనుకుంటుంది మనసులో …

 

అలా అలా రెండూ వారాలు గడిచిపోయాయి….

అప్పటికి ఆద్య రాఖీకి అన్నీ క్లాస్సేస్ చెప్పేసింది….

అతను నోట్స్ అన్నీ పూర్తిగా రాసుకునేందుకు హెల్ప్ చేసింది….

 

అన్నీ కంప్లిట్ అయ్యాక రాఖీ ఆద్యకి ఎంతో  కృతజ్ఞతగా థాంక్యూ సో మచ్ ఆద్య… నీ వల్లే నేను త్వరగా అన్నీ క్లాస్సేస్ నేర్చుకున్నాను..నోట్స్ కూడా అన్నీ రాసుకోగాలిగాను…

 

నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావ్…నీ వాల్యూబుల్ టైమ్ ని నాకోసం చాలా స్పెండ్ చేసావ్..ఒన్స్ అగైన్ థాంక్యూ… థాంక్యూ సో మచ్ అని చెప్పి, నీ హెల్ప్ కి నా తరపున చిన్న ట్రీట్ అని ఐస్క్రీమ్, చాకోలెట్స్ తెచ్చిస్తాడు…..

 

ఆద్య అలాంటివి ఏమీ వద్దు అని ఎంతలా చెప్తున్నా,నువ్వు నాకు చేసిన హెల్ప్ కి ఏదో నా తృప్తి కోసం ఇవి తీసుకో ఆద్య ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేయడంతో ఆద్యకి ఇంక అవి తీసుకోక తప్ప లేదు..

 

రాఖీ ఆద్యకి మరొక్కసారి థాంక్స్ చెప్పి ఆద్య అవి తినేవరకు అక్కడే ఉండి ఫినిష్ అయ్యాక ఆమెకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు…..

 

వెళ్లిపోతున్న అతన్నే చూస్తూ గుడ్ బాయ్ లానే ఉన్నాడు.. చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ తన బస్లో ఇంటికి వెళ్ళిపోతుంది..

 

continued..