ఆద్య తన కాలేజీ విషయాలు చెప్తు దిలీప్ బిసినెస్ గురించి ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతూ ఉంటె దిలీప్ అన్నీ విషయాలు ఆద్య కి చెప్తూ ఉండేవాడు…
అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే వసుధ భోజనానికి పిలవడంతో అందరు వెళ్లి కూర్చుంటారు….
దిలీప్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి వావ్ అన్నీ నాకు ఇష్టం అయినవే చేసావా అత్త నువ్వు సూపర్ అత్త ఐ లవ్ యూ అంటూ బుగ్గపై ముద్దు పెట్టి హ్మ్ కానీ పెట్టు పెట్టు వీటిని చూస్తుంటేనే నా నోరు ఊరిపోతుంది….ఆకలి కూడా దంచేస్తోంది అన్నీ ఒక పట్టు పడతా అంటూ ఫుల్ ఎక్సయిట్ అవుతూ చెప్తాడు….
దిలీప్ మాటలకి, ఎక్సయిట్ మెంట్ కి అందరు నవ్వుకుంటారు….
ఆద్య కూడా నవ్వుతూ నువ్వు కొంచెం కూడా మారలేదు బావ ఇప్పటికి కూడా చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తు నవ్వుతూ నీ చుట్టు ఉన్న వాళ్ళని నీ మాటలతో నవ్విస్తూ ఉన్నావ్ అంటుంది….
హహహ దిలీప్ నీ బావ అమ్మ ఇక్కడ అంత ఈజీ గా మారిపోతే ఎలా నా ఈ అల్లరి అంటే నా మరదలికి చాలా ఇష్టం కదా అందుకే మారను…ఈ అల్లరిని ఆపను అంటాడు దిలీప్ అందంగా నవ్వేస్తూ…