అబ్బా ఈయన ప్రపోజ్ చేస్తారు అని వెయిట్ చేస్తూ కూర్చుంటే అది మా శస్టి పూర్తి కి కానీ అయ్యేలా లేదు………. !! లేదు ఇలా చూస్తూ ఊరుకోకూడదు పోని ఒక పని చేస్తాను రేపు నేనే శౌర్యగారికి ప్రపోజ్ చేస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని తనలో తానే నవ్వుకుంటూ……….. !! ఫస్ట్ నా మాటలు విని షాక్ అవుతారు ఆ తర్వాత నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని హాగ్ చేసుకుంటారు……….. !! ఆయన మనసులో కూడా నాపై ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. ………. !! కాకపోతే ఆ ప్రేమను బయటకు చెప్పడానికి మాత్రం ఈయనకు ఎక్కడ లేని ఇబ్బంది……….. !! అందుకే ఈసారి ఎలాగైనా శౌర్య గారి నోటితోనే I Love You చెప్పించుకోవాలి……… !! అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుంటూ తనలో తానే సిగ్గుగా నవ్వుకుంది శాన్వి…….. !!
ఆ ఆలోచన రాగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ వెంటనే మొబైల్ తీసుకుని శౌర్యకు బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా మెసేజెస్ చేస్తూ ఉంటుంది………. !!
డిన్నర్ చేశారా శౌర్య ……….??
ఏం చేస్తున్నారు………..??
నేను రాలేదని ఇంకా కోపంగానే ఉన్నారా………??