క్యాంటిన్ కి ఎందుకు వస్తారు మిస్?? మినిమమ్ కామన్ సెన్స్ అనేది యూస్ చేయవా నువ్వు??? అనుకుంటూ విసుగ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుండి…
ఈ హిట్లర్ ప్రతి సారీ నన్ను కావాలనే ఇన్సల్ట్ చేస్తున్నాడు… ఈ సారీ బురద కాదు వేడి వేడి కాఫీ మీద పోయాలి వీడి మీద అప్పుడు కానీ ఈ శాన్వి అంటే ఏంటో అర్థం కాదు అని మొహం తిప్పుకుని తనకేం కావాలో తీసుకొని ఫ్రెండ్స్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళింది…
మళ్ళీ!!! మా అన్నయ్య తో గొడవేంటే నీకు అని అడిగింది కృతి…
ఓసేయ్!! ఇంకోసారి అన్నయ్య కన్నయ్య అన్నావ్ అనుకో క్యాంటిన్ సాక్షిగా వేడి వేడి కాఫీ నీ అన్న మీద పొసేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది హిటేక్కిన బుర్రతో…
పోసినా పొసేస్తుంది అనే భయంతో అది కాదే అంటున్న కృతిక ని కోపంగా చూస్తూ… అసలు మా ఇద్దరికి గొడవ జరగడానికి కారణం నువ్వేనే??? ఆ కార్ లో నువ్వున్నప్పుడు నీ అన్న తో పాటే నువ్వు కార్ దిగి ఉంటే ఈ హిట్లర్ గాడికి నేను బలయ్యేదాన్ని కాదు కదే అంది…
అంటే శాన్వి యాక్చువల్‌గా ఆ బురద అన్నయ్య డ్రైవింగ్ వల్ల కాదు నా వల్లే నీ మీద పడింది…