New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 5

కడదాక నీతోనే ❤️‍🔥 – 5

 మురళీధర్ గారు : సత్యమూర్తి గారిని. చూసి  నిలబడ్డారు 

 

సత్యమూర్తి గారు : అయ్యో కూర్చోండి పరవాలేదు అని కూర్చోమన్నారు 

 

ఇద్దరు కుర్చిలో కూర్చున్నారు 

 

సత్యమూర్తి గారు : నేనే కలుద్దాం అనుకున్నాను మరళీ గారు మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది.తనని చదివిస్తే చాలా పై స్థాయికి వెళుతుంది తన చదువును అపోద్దు…..

 

మురళీధర్ గారు : అదేనండి తన గురించే కనుక్కుందామని వచ్చాను తను చదివిన చాలా ఇష్టపడుతుంది నాకు ఇష్టం లేకపోయినా తన బాధ చూడలేక మీతో మాట్లాడదామని వచ్చాను 

 

సత్యమూర్తి గారు : అవునండి తన ఫ్యూచర్ చాలా బాగుంటుంది చదివిస్తే మీకు మంచి పేరు తీసుకొస్తుంది మన పక్క ఊరిలో చాలా బాగా చెబుతారు నేను రికమండేషన్ చేస్తాను వాళ్ళు బాగా చదివే పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారు నేను మాట్లాడతాను వాళ్ళతో…..

 

మురళీధర్ గారు : అలా కాదండి ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలంటే కుదరదా అంటే  పక్కోరికి వెళ్లి రావడం అంటే చుట్టూ ఉన్న జనాలు ఏమంటారు అదే ఇంటి దగ్గర ఉండి చదువుకుంటే అటు తన చదువు కొనసాగుతుంది ఇటు మాకు సమస్య ఉండదు 

 

సత్యమూర్తి గారు  : అవునా అయితే సరే ఇంటి దగ్గర ఉండి చదువుకునేలాగా నేను చూస్తాను తనకు ఏమైనా అర్థం కానివి ఉంటే నేను చెప్తాను ఇంటి దగ్గర ఉండి చదువుకునేలా నేను మాట్లాడతాను మీరు కంగారు పడకండి ఇలాగైనా తను చదువుకోవడానికి ఒప్పుకున్నారు సంతోషం…

 

మురళీధర్ గారు : అలా ఒప్పుకోవడానికి మా అమ్మాయి ఒక యుద్ధమే చేసింది లేండి నాతో నిన్నంతా ఏడుస్తూనే ఉంది రాత్రి కూడా అన్నం తినలేదు పొద్దున్నే కూడా నాతో మాట్లాడకుండానే స్కూల్ కి వచ్చేసింది ఒక పోరాటమే చేసింది అని చెప్పాలి సరేలెండి ఇంక నేను వెళ్తాను పొలం పనులు చూసుకోవాలి

 

సత్యమూర్తి గారు :  సరేనండి  అని లేచి నమస్కరిస్తారు.

 

మురళీధర్ గారు వెళ్లిపోతారు …

సత్యమూర్తి గారు క్లాస్రూమ్  లో ఉన్న ప్రణవి దగ్గరకు వెళ్లి 

 

అమ్మ ప్రణవి….. ఇలా రామ్మ…… 

ఏంటి మాస్టర్ గారు ……

 

ఎప్పుడే మీ పెదనాన్న గారు వచ్చి వెళ్ళారు తెలుసా……

ఎందుకో……నిన్ను చవిస్తాను అన్నారు 

 

ప్రణవి : అవునా మాస్టర్ గారు……..నాకు చాలా సంతోషంగా ఉంది …….

 

సత్యమూర్తి గారు : కానీ ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలి అంటున్నారు….నేను చూసుకుంటాను లే నీకు ఏం అయినా అర్థం కాకపోతే నేను చెప్తాను

 

ప్రణవి  : పరవాలేదు మాస్టారు గారు……. ఇంటి దగ్గరన్న పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడతను …..అర్థం కానివి ఉంటే మీరు ఎలాగో ఉన్నారుగా….. అలగన్నా వాళ్ళు ఒప్పుకున్నారు అంటే చాలా గొప్ప విషయం 

 

సత్యమూర్తి గారు : అవును తల్లి ఎప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్ కోసమే ఆలోచించు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి 

 

ప్రణవి  : సరే మాస్టారు ….

 

 

 

 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 

 

 

ఆద్య…ఆద్య…….ఆద్య ……..

 

అబ్బా ఏమిటే ఆ అరుపులు  పిలువు అరవకు 

 

సాత్విక. : నీకు అరుపులు లాగ ఉన్నదా నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి .. …. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే మామూలుగా ఉంటుందా మా సార్స్  మేడమ్స్ మమ్మల్ని తెగ రుద్దేస్తున్నారే బాబు   నీకు లాస్ట్ ఇదే కదా టెన్త్ అవ్వింది నాకన్నా సలహాలు ఇస్తావేమో అని …

 

ఆద్య : అదా….సంగతి …నీ అల్లరి తగ్గించి కొంచెం బుక్ లో కాన్సన్ట్రేషన్ పెట్టు ఎవరి సలహాలు అవసరం లేదు నీకే ఫస్ట్ క్లాస్ వస్తది 

 

సాత్విక : పో ఎప్పుడు ఇంతే నువ్వు నేనేమి అడిగినా అలాగే చెప్తావ్ అవసరం లేదులే నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను బాయ్

 

ప్రగతి గారు : అదేమిటో అడిగింది కదా చెప్పొచ్చు కదా సంజన కూడా లేదు నువ్వే కదా చెప్పాలి సంజన తన చదువు కోసమని ఆర్యన్ లాగానే తను లండన్ కి వెళ్ళింది ఆర్యన్ కూడా లేడు ఏంటో పిల్లలందరూ దిక్కున ఉన్నట్టు ఉంటది మీ ఇద్దరే కదా అది ఏదో కొంచెం అల్లరి చేస్తాది అంతే దాని అల్లరి కూడా లేకపోతే ఎలాగా 

 

సాత్విక : అమ్మ అది ఊరికే నువ్వు అక్కడ ఉన్నావా అని నీ దగ్గర నన్ను ఇరికించడానికి అలా చేస్తది అది చదువులో ఎప్పుడు ఫస్ట్ కదమ్మా నీకు తెలియదా దానికి ఎవరు సలహాలు అవసరం లేదు నేను కూడా వదిలేస్తే దాని అల్లరి ఇంకా ఎక్కువ అయిపోతుంది అందరిలోకి చిన్నదాని బాగా ఆరాధన చేశారు అందరూ స్కూల్లో ఎన్ని కంప్లైంట్ వస్తున్నాయో తెలుసా

 

 

సరస్వతి గారు : అలా చెప్పు ఆద్య నా మాట ఎవరూ లెక్క చేయడం లేదు దాన్ని అల్లరి భరించలేకపోతున్నాను అంటే నన్నే అంటున్నారు మీ అమ్మ మరీను ఆర్యన్ లేడు సంజనా లేదు ఉన్నది వీళ్లిద్దరే కదా అని బాగా నెత్తికెక్కించుకుంటుంది 

 

ప్రగతి గారు : సరేలే ఇద్దరూ చాలా చేశారు కానీ ఇంక వదిలేయండి అదేం పెద్ద అల్లరి చేయడం లేదు దాన్నేమైనా అంటే నేను ఊరుకోను సరేగాని రండి బ్రేక్ఫాస్ట్ చేద్దురుగాని పద సరస్వతి 

 

 

అందరు బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి ఆద్య కాలేజ్ కి సాత్విక స్కూల్ కి సరస్వతి గారు ప్రగతి గారు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతారు

 

 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 

 

కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టు …..పదవతరగతి పరీక్షల సమయం వచ్చింది.

 

 

 

 

మరి. తర్వాత ఏం జరుగుతుంది ……?

ప్రణవి. సాత్విక లా పరీక్షా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి……? 

సంజన లండన్ ఎందుకు వెళ్ళింది…….?

 

ఇవన్నీ తెలుసుకోవాలంటే…….. ఫాలో అయిపోండి 

మన కడదాక నీతోనే ❤️‍🔥…..

 

 

 

ఇంకా ఉంది…….

కీప్ రీడింగ్…….

మీ విలువైన సమయాన్ని నా కోసం వినియోగించండీ…..

మీ చిన్న కామెంట్ నాకు పెద్ద ప్రోత్సాహం …….

స్టోరీ లో ఏం అన్నా  అనుమానాలు ఉంటే కామెంట్స్ లో పెట్టండి ….. నేను దానికి ఆన్సర్ చెప్తాను……