“నిజమే కదా..! నేను దీని గురించి ఆలోచించలేదు మన జానుకి కూడా తొమ్మిదో నెల వచ్చిందిగా చేద్దామండి..” అని అంది అమ్మ.
“అవునా..” అన్నట్టుగా చూశాడు జాను నీ నాన్న..సంతోషంగా తల ఊపింది..”చేయండి” అన్నట్టుగా జాను.
నాన్న పంతులు గారికి ఫోన్ చేసి అడిగితే ఈరోజు మంచిగా ఉంది చేయండి అన్నారు.. తొమ్మిదో నెల కావడంతో జానుకి శ్రీమంతం ఏర్పాట్లు అమ్మ చేసింది,మిగిలిన ఏర్పాట్లు నేను నాన్న మొదలు పెట్టాము.
శ్రీమంతంలో మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు,చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు.. అంతా జరిగిందిరా.. అంతా బాగా జరిగింది.
జాను సంతోషంగా కూడా ఉంది తన బిడ్డకి అందరి ఆశీర్వాదం ఉంది అని.