“నేను కూడా అదే చెప్తున్నాను అక్క కానీ లహరి వాళ్ళ ఆయన ఫోన్ చేసి మరీ చెప్పాడు ఇందాక.. దానికి నీరసంగా ఉంది అంట ఒకసారి చెక్ అప్ కి తీసుకెళ్లండి అత్తయ్య అని.
ఇక ఆ పిల్లోడు చెప్పాక మనం తీసుకువెళ్లకపోతే బాగోదు కదా..! అందుకే నేను కూడా వెళ్దాము అంటున్నాను.” అని అంది లహరికి చిక్కు తీసి జడ అల్లుతు కస్తూరి.
“వాళ్లు చిన్నపిల్లలు కస్తూరి.. వాళ్లకి అనుభవం లేదు కదా కానీ మనకి ఉంది కదా..!
కోరి కోరి బిడ్డలకి నష్టం కలిగే పనులు ఎందుకు చేయడం,చూద్దాం రేపొద్దున కూడా ఇలాగే నీరసం ఉంటే మనిద్దరం కలిసి దాన్ని హాస్పటల్ కి తీసుకువెళ్దాంలే.” అని అంది కౌసల్య.
“పెద్దమ్మ కూడా చెప్తుందిగా సరేలే అమ్మ.” అని అంది లహరి.