ఆ ఇంటికి వచ్చిన కొన్ని గంటల తర్వాత నుంచి ఆ ఫ్యామిలీలో తను కూడా ఒక మెంబర్ అయిన అను కౌసల్యని అమ్మ అని, రఘురామయ్య గారిని డాడీ అని పిలవడం తనకి తెలియకుండానే జరుగుతున్న విషయం.. వెంటనే వచ్చి రఘురామయ్య పక్కన కూర్చోని కౌసల్య కొసరి కొసరి వడ్డిస్తుంటే ఇష్టంగా తింటుంది.
వేద తీసుకొచ్చిన గోంగూర పచ్చడితో ఇష్టంగా తిన్నారు వేద సునంద గారు.
డిన్నర్ కంప్లీట్ చేశాక..”రేపు సండే ఆ ఫ్యామిలీని మన ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చెయ్ వేద.” అని అంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ సునంద.
“ఇన్వైట్ అయితే చేస్తాను కానీ వస్తారో రారో మమ్మీ.. అంటే శౌర్య గారు నైట్ ఎప్పుడో వస్తారు డ్యూటీ నుంచి,ఆయనని అడగకుండా ఆంటీ బయటకి రాదు.” అని అంది తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ వేద.