అక్కడ ఉన్నంతసేపు అతని కళ్ళు జ్వాల వైపు నుండీ పక్కకి వెళ్ళనంటున్నాయి….సో ఆమె చేసే ప్రతి పనిని చూస్తూ డాక్టర్ తో మేడం ఎవరు ఆ అమ్మాయి పేషంట్స్ ని అంత బాగా చూసుకుంటుంది అని అడుగుతాడు ఆమె గురించి ఏమి తెలియనట్టుగా డాక్టర్ ఏమి చెప్తుందో వినాలని….
జ్వాల గురించి అడగ్గానే డాక్టర్ అలెర్ట్ అయి నవ్వుతూ తను జ్వాల అని ఈ హాస్పిటల్ లో నర్స్ క్రిష్ సార్..
చాలా మంచి అమ్మాయి.. ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చిన చూడలేదు..ఎంతో కష్టపడి పని చేస్తుంది… తన కష్టంతో తన ఫ్యామిలీ ని పోషిస్తుంది.. షి ఇస్ రియల్లీ గ్రేట్ గర్ల్…
ఇంత చిన్న ఏజ్ లో ఎన్నో బాధ్యతల్ని మోస్తుంది…
తనకి వచ్చే జీతం తోనే ఇల్లు గడుపుతుంది…తన అక్కల అవసరాలు తీరుస్తుంది…అంతేకాదు ఎవరన్నా ఆపదలో ఉండి సాయం కోరితే లేదు అనకుండా ఎంతో కొంత తనకి చేతనైన సాయం తప్పక చేస్తుంది…
తన దగ్గర డబ్బులు లేకున్నా సరే నన్ను అడిగి మరీ హెల్ప్ చేస్తుంది.. నేను అలా ఎందుకు జ్వాల చేస్తావు నీకు ఉండే ఖర్చులు సరిపోవా మళ్ళీ ఇవన్నీ అవసరమా అంటే మేడం ఆపదలో ఉన్నప్పుడు మనం ఇచ్చే రూపాయి కూడా చాలా విలువైనది….
ఆపదలో ఉన్న వాళ్లకి సాయపడితే ఆ దేవుడు రేపటి రోజున మనకి ఏదయిన అయినప్పుడు తప్పక దారి చూపుతాడు….