New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల 🔥 – 19
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 19

 

ఇంక అక్కలకి పెళ్లిళ్లు చేస్తే నా బాధ్యత తీరడమే కాక వాళ్ళు కూడా సంతోషం గా ఉంటారు అనుకున్నాను.. కానీ నువ్వేం చేసావ్ వాళ్ళ మొగుళ్ళ రూపం లో నాకు యముళ్ళని పంపించావు….

 

పెళ్లయిన రోజు నుండీ కట్నం, కట్నం డబ్బులు ఇదే మాట…వాళ్ళు అడిగిన ప్రతిసారి అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మీ అక్కల్ని మీ ఇంటికే తీసుకెళ్ళు….

 

మీ అక్కల్తో మేము కాపురం చేయలేము అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే రోజు రాత్రుళ్ళు నాకు నిద్ర కూడా పట్టేది కాదు తెలుసా.. వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అవుతాయో…ఒకవేళ బావలు అన్నంత పని చేసి అక్కల్ని పంపించేస్తే అది చూసిన అమ్మ, నాన్నల పరిస్థితి ఏంటి…

 

కూతుళ్ళ జీవితాలు కళ్ళ ముందే మోడు వారుతుంటే ఏ అమ్మ , నాన్నలు అయిన తట్టుకోగలరా…

 

కూతుళ్ళ కాపురం సరిదిద్దలేని మనవి ఒక బతుకులేనా అని వాళ్ళేమైనా చేసుకుంటే నేను భరించగలనా నా కంటూ ఈ లోకంలో ఉండేది నా కుటుంబం మాత్రమే కదా…

 

అలాంటి కుటుంబాన్ని, వాళ్ళ ప్రేమల్ని పోగొట్టుకుని నేనెలా బతకాలి అని అందుకే డే అండ్ నైట్ డ్యూటీ చేసి ఎన్నో చోట్ల అప్పుడు చేసి మరీ వాళ్లకి డబ్బులు ఇస్తూ వచ్చాను..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue