❤️ I Want You ❤️ MADLY…🥵 – 10
ధబ్ అంటూ సౌండ్ వినిపించిన వైపు కళ్లెత్తి చూసింది విషి. వాడు పైకి లేవడానికి అవస్థ పడుతూ కనిపించాడు..వాడిని చూడడమే ప్రాణం లేచొచ్చినట్టు వెంటనే కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది. అసలు ఎవరు కొట్టారు అనుకుంటూ అయోమయం ప్లస్ ఆనందం కలిపి పక్కకి చూసింది.
వాడితో వచ్చిన ముగ్గురిని చితక్కొట్టుడు కొడుతున్నాడు మన హీరో😎… ఆరుడుగుల పైనే ఎత్తుతో కండలు తిరిగిన దేహం తో తెల్లని మేని ఛాయ … కోపం వల్ల రెడ్ పెయింట్ వేసుకుని ఉంది. ఒక్క క్షణం విషీ చూపంతా విరాజ్ మీద నిలిచిపోయింది. అంత అందంగా ఉన్నాడు మరి😏.
విషి తనని చూస్తున్నట్టు అనిపించి ఆమె వైపు చూసేసరికి వాళ్ళలో ఒకడు చిన్న షార్ప్ నైఫ్ తో పొడవడానికి చూసాడు. అది గమనించిన విషి “ఏవండీ ! పక్కకి చూడండి.. నైఫ్ ” అని అరవడం, వాడు పొడవడం , విషి మాట వినిపించుకుని విరాజ్ ఆ నైఫ్ ని పట్టుకోవాలని చూడడం అది విరాజ్ అరచేతిలో గుచ్చుకుని బ్లడ్ రావడం రెప్ప పాటులో జరిగిపోయాయి. ఆ నైఫ్ తెచ్చిన వాడి ఫేస్ మీద ఒక్క పంచ్ ఇచ్చాడు విరాజ్. వాడు అక్కడే పడిపోయాడు. పక్కనే కింద పడి ఉన్న బ్యాగ్ తీసుకుని విషి వైపు కి తిరిగే సరికి అతనికి దగ్గరగా నిలబడి ఉంది. అంత దగ్గర గా ఆమెని చూస్తుంటే అతని ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ … చూపు తిప్పకుండా ఆమెనే చూస్తూ మీ బ్యాగ్ అని చిన్నగా అయిన బేస్ వాయిస్ తో అన్నాడు. అతని వాయిస్ కి ఒక్క క్షణం అతనిని చూస్తూ ఉండిపోయి వెంటనే చూపు తిప్పుకుని బ్యాగ్ అందుకోకుండా అతని చేతిని తన చేతి లోకి తీసుకుని చూసింది. ఆమె అలా పట్టుకుంటుంది అని ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విరాజ్ ఫ్రీజ్ అయిపోయాడు. బాగా లోతుగా అయింది గాయం. సో అందరి హీరోయిన్స్ లాగానే రొటీన్ చీరంచు చింపి కట్టు కట్టింది😌…
అది చూసిన మన హీరో మనసు లో తల కొట్టుకున్నాడు…( అందరిలానే ఇది కూడా చీరంచు చింపింది..😏 కొత్తగా ట్రై చేయొచ్చుగా అని బాబు ఫీలింగ్ అన్నమాట 😂) . రండి దగ్గరలో హాస్పిటల్ ఉంది వెళ్దాం అంటూ చొరవగా అతని చేతిని పట్టుకుని. ఇలాంటి పాత రొటీన్ సెంటిమెంట్ సీన్లంటే బొత్తిగా ఇష్టం లేని విరాజ్ కి చిరాకు దొబ్బి చేతిని వెనక్కి లాక్కుని ” ఇట్స్ ఒకే… మీరు ఈ బ్యాగ్ పట్టుకోండి ..నాకు పనుంది ” అని సాధ్యమైనంత కూల్ గా అన్నాడు. అది కాదండి…మీ చెయ్యి అంటూ మళ్ళీ పట్టుకోబోతుంటే … ” ఎహె ఆపు …నా చెయ్యేమి విరగలేదు …దీనికే ఇంత హడావిడి చేస్తావేంటి “బ్యూటిఫుల్ ” వెళ్ళు నీ పని చూస్కో పోయి అని ఆమె చేతిలో బ్యాగ్ పెట్టాడు. విషి చెవులు బ్యూటిఫుల్ అన్న దగ్గరే పని చేయడం మానేశాయి. ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ ఆలోచనకే తల లో నరాలు లాగినంత నొప్పి కలిగి తల పట్టుకుని నార్మల్ అవుతూ బ్యాగ్ అందుకుని ఒకసారి విరాజ్ వైపు చూసి థ్యాంక్ యు అని వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. “హేయ్ బ్యూటిఫుల్ ” అని మళ్ళీ పిలిచాడు విరాజ్… విషి అసహనంగా కళ్ళు మూసి తెరిచి విరాజ్ వైపు చూస్తూ “సీ మిస్టర్…నా పేరు తెలియక పోతే మిస్ అని సంభోందించండి లేదంటే అడగండి…హెల్ప్ చేశారు కాబట్టి చెప్తాను ..నోటికొచ్చిన పేర్లతో పిలవకండి” అని సీరియస్ గా చెప్పి వేగంగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమె వైపు చూస్తూ పొడుగ్గ బ్యాక్ మీద నాట్యం చేస్తూ ఊగుతున్న జడ వైపు జడ కి అనుగుణంగా కదులుతున్న బ్యాక్ వైపు చూస్తూ ఉఫ్ఫ్ అంటూ హెవీ బ్రీత్ తీసుకుంటూ హార్ట్ మీద రబ్ చేసుకున్నాడు విరాజ్. ఇంకా తనని విరాజ్ పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగిన విషి కి ఆమె బ్యాక్ వైపు చూస్తూ కనిపించిన విరాజ్ నీ చూసి ఇడియట్ అని తిట్టుకుని చీర కొంగు నీ వెనక నుండి ముందుకి లాగి పట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె అలా చేయడం విరాజ్ కి ఇంకాస్త కిక్ ఇస్తే నవ్వుకుంటూ “హాట్ బ్యాక్ .. బ్యూటిఫుల్ ” అని సిగ్గు లేకుండా ఆమె వెళ్ళేంత వరకు మిస్ అవ్వకుండా చూసాడు.
లోపలికి వెళ్ళిన విషి హనీ పేరు మీద డబ్బులు డిపాజిట్ చేసి వాళ్ళు ఇచ్చిన స్లిప్ తీసుకుని బయటకి వచ్చేసరికి అరగంట పైనే పట్టింది.
బయటకి వచ్చిన విషి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని ముందుకి నడుస్తుంది ఆటో కోసం . ఇంతలో తన పక్కనే ఒక బ్లాక్ కార్ వచ్చి పక్కన ఆగింది. ఆ కార్ వైపు ఒకసారి చూసి లోపల ఎవరో తెలియక పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే కార్ వెనక డోర్ నుండి ఒక చెయ్యి ఆమెని లోపలికి లాగేస్తుంది.
Swipe left/right or tap the sides to turn pages