New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 1

నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 1

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

జూబ్లీ హిల్స్ సెవెన్ స్టార్ హోటల్ 

 

హోటల్ టాప్ ఫ్లోర్ లో సూపర్ లగ్జరీ రూమ్ 

 

 

తెల్లవారు జాము 5:00 

 

వంటి మీద బట్టలు లేకుండా స్పృహ తప్పి ఆద మరిచి నిద్ర పోతుంది ఒక అమ్మాయి 

 

ఆ అమ్మాయి పక్కనే టవల్ చుట్టుకొని సిగరెట్ తాగుతూ దాన్నుంచి వచ్చే పొగ ఊదుతూ ఉన్నాడు అతను 

 

ఒక గంట కి లేలేత సూర్య కిరణాలు ఆ గదిని తాకుతూ వాళ్ల మీద పడుతూ ఉంది 

 

సూర్యుడి వెచ్చని కిరణాలకి మెల్లగా స్పృహలోకి వస్తుంది ఆ అమ్మాయి 

 

తన పక్కనే టవల్ లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు 

 

గుడ్ మార్నింగ్ డార్లింగ్ కైపుగా పలకరించింది అతన్ని 

 

ఆమె వైపు చూశాడు అతను అతని చూపులో ఆటిట్యూడ్ స్పష్టంగా తెలుస్తుంది 

 

 

తను లేవడానికి చూసింది కానీ అంతలోనే తన వంటి మీద బట్టలు లేని సంగతి గుర్తొచ్చి బెడ్ షీట్ నీ నిండుగా కప్పుకొని లేచి కూర్చుని ” మరి మనం పెళ్లెప్పుడు చేసుకుందాం ??? ” అతని వైపే చూస్తూ ప్రశ్నించింది 

 

 

ఆ మాటలు విన్న మరుక్షణం అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి చేతిలో ఉన్న ఫోన్ పక్కకి విసిరేసి ఆమె వైపు చూస్తూ ఆమె పీక పట్టుకున్నాడు అతను 

 

అతని నుంచి ఇలాంటి చర్య అసలు ఊహించలేదు ఆ అమ్మాయి 

 

” హౌ డేర్ యు అసలు ఈ రన్వీర్ చౌదరి గురించి ఏమనుకుంటున్నావ్ చంపి పడేస్తాను ఆల్రెడీ అన్నీ అగ్రిమెంట్స్ మీద సైన్ చేసావు కదా సైన్ చేసే ముందు చదవలేదా ??? ” పొగరుగా అడిగాడు రన్వీర్ 

 

” నేను చదివాను కానీ సరదాగా అడిగాను !!!! ” భయపడుతూనే చెప్పింది ఆ అమ్మాయి 

 

” నా దగ్గర సరదాగా కూడా పెళ్లి పిల్లలు అనే టాపిక్ తీసుకొని రాకు !!!! “

 

” ఇవన్నీ ట్రాష్ అసలు అయినా పెళ్లి అనేది ఎందుకు చేసుకుంటారు దీని కోసమే కదా ఈ సుఖం కోసమే కదా అలా అయితే నేను రోజు ఈ సుఖం అనుభవిస్తున్నా ఇంక అలాంటప్పుడు నాకు మళ్ళీ పెళ్ళి చేసుకునే అవసరం ఏముంది ??? ” పొగరుగా అన్నాడు రన్వీర్ ఆమె పీక మీద నుంచి చెయ్యి తీస్తూ 

 

” ఒకవేళ నీ లైఫ్ లో అనుకోని విధంగా నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే అప్పుడేం చేస్తావ్ ??? ఒకవేళ పెళ్లి చేసుకొని కాదు ఇలా నీ వన్ నైట్ స్టాండ్ అమ్మాయిల లోనే బై మిస్టేక్ ఎవరైనా కన్సీవ్ అయ్యి పిల్లల్ని కంటే అప్పుడు ఏం చేస్తావ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటావా ??? ” అడిగింది ఆ అమ్మాయి 

 

” పెళ్లి చేసుకోను ఆ పుట్టిన పిల్లల్ని పీక పిసికి చంపేస్తాను !!!! ” అంటూ పైకి లేచాడు రన్వీర్ 

 

 

రన్వీర్ చెప్పిన సమాధానానికి బుర్ర గిర్రున తిరిగింది ఆ అమ్మాయికి  

 

” ఇలా కూడా ఉంటారా మనుషులు ??? వామ్మో కర్మ కాలి ఎవరైనా వీడి జీవితంలోకి వస్తే దాని పని అక్కడితో ఎండ్ కార్డ్ పడిపోయినట్టే !!!! ” అనుకుంది మనసులో 

 

ఇంతలో ఆమె మొహం మీద ఏదో పేపర్ విసిరినట్టు అనిపించడంతో వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పేపర్ నీ చూసింది 

 

అది చెక్ అని ఇట్టే అర్థమయిపోయింది 

 

” మర్యాదగా ఇంకొక ఫైవ్ మినిట్స్ లో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు !!!! ”  అన్నాడు రన్వీర్ 

 

ఓపిక లేకపోయినా కూడా అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని లేచి తన డ్రెస్ వేసుకొని హెయిర్ మొత్తం సరిగ్గా చేసుకొని రన్వీర్ ఇచ్చిన చెక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు 

 

 

” యూ ఫ**** లేడీ !!! ” అనుకున్నాడు మనసులో 

 

ఆ అమ్మాయి మాత్రం ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది 

 

ఆ అమ్మాయి మాత్రం ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది 

 

రణ్వీర్ కూడా రెడీ అయ్యి అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు 

 

 

ఆఫీస్ లో చాలా మంది అమ్మాయిలు రన్వీర్ నీ చూసి ఫిదా అయిన వాళ్లే 

 

వాళ్లలో చాలామందికి రన్వీర్ వన్ నైట్ స్టాండ్ కోసం తెలుసు అలా అయినా అతనితో పొందు పంచుకోవాలి అని అనుకునే మెంటాలిటీ చాలా మంది అమ్మాయిలలో అక్కడ ఉంది 

 

ఒకటి అతని అందమైతే ఇంకొకటి అతను ఇచ్చే డబ్బు 

 

స్టైల్ గా నడుచుకుంటూ ఎవరిని కనీసం పట్టించుకోకుండా తన కాబిన్ లోకి వెళ్లిపోయాడు రన్వీర్ 

 

 

 

##############

 

 

” అక్క అక్క అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఉంది చూడు నీకు రైట్ సైడ్ !!!! ” అంటూ చెట్టు మీద జామకాయలు కోస్తూ ఉన్న అమ్మాయికి డైరెక్షన్స్ ఇస్తున్నారు కింద ఉన్న పిల్లలు 

 

” ఎక్కడుందిరా నాకు కనిపించడం లేదు !!!!  ” చెట్టు కొమ్మల్లో నుంచే అరుస్తూ చెప్పింది ఆ అమ్మాయి 

 

” అక్క చెయ్యి కొంచెం ముందుకి చాపు నీ చేతికి అందేస్తుంది !!!! ” అన్నారు ఇద్దరు ఆడపిల్లలు 

 

” ఆగండి !!!! ” అంటూ కొంచెం ముందుకి జరిగి ఆ కాయలు కోస్తూ ఉంది ఆ అమ్మాయి 

 

ఇక ఆ కాయ కూడా కోసేసి తన చేతికి ఉన్న వాచ్ వైపు చూసింది 

 

అప్పటికే 8 అవుతూ ఉండడంతో ” వామ్మో లేట్ అయిపోతాను అనుకుంటూ అరే బంగారాలు మళ్లీ ఈవినింగ్ కోసుకుందాం ఇప్పుడు అక్క ఆఫీస్ కి టైం అవుతుంది !!!! ” అంటూ కిందకి దిగింది ఆ అమ్మాయి 

 

” సరే అక్క ఇదిగో ఇది మా వంతు ఇది నీ వంతు !!!! ” అంటూ మూడు కాయలు ఆ అమ్మాయి చేతిలో పెట్టారు పిల్లలు 

 

వాళ్లకి గాల్లోనే ముద్దులు ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది ఆ అమ్మాయి 

 

” మైధిలి ఇంకా నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టలేదమ్మా !!!! ” అన్నారు పార్వతమ్మ గారు 

 

” అయ్యో సారీ నాని ఇప్పుడే పెడతాను !!!!! ” అంటూ దేవుడి దగ్గరికి వెళ్లి 

 

” తండ్రి శివయ్య రియల్లీ సారీ అంతా ఆ పింకీ బబ్లీ వల్ల వచ్చింది తెలుసా కాయలు కోసే వరకు కూడా నా ప్రాణం తీసేసారు వాళ్ల గోలలో పడి నిన్ను మర్చిపోయాను తండ్రి నన్ను క్షమించే !!!! ” అంటూ అక్కడే ఉన్న శివలింగంతో మాట్లాడుతూ అభిషేకానికి అన్ని అవర్చుకుంటుంది 

 

శివుడి స్తోత్రాలు పాడుతూ ఆయనకి అభిషేకం చేస్తూ తర్వాత దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని అప్పటికే పార్వతమ్మ గారు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఉండడంతో అ బాక్స్ పట్టుకొని తన స్కూటీ మీద ఆఫీస్ కి స్టార్ట్ అయింది 

 

 

 

రన్వీర్ ఇండస్ట్రీస్ 

 

కంట్రీ లోనే నెంబర్ వన్ బిజినెస్ మాన్ మన రన్వీర్ చౌదరి గారు ఏషియా లోనే టాప్ టు బిలినియర్స్ లో ఉన్న వ్యక్తి 

 

కొన్ని లక్షల కోట్లకి అధిపతి మరి అంత డబ్బు ఉంటే పొగరు బలుపు అహంకారం ఆటోమేటిక్ గా ఉంటాయి కదా సో ఇవన్నీ మన బాబు గారి చుట్టూ వైఫైలా అలా ఉంటూనే ఉంటాయి 

 

పెళ్లి పిల్లలు సంసారం అంటే పరమ చిరాకు కానీ సెక్స్ లో మాత్రం మంచి నైపుణ్యం కలవాడు ఒక ఆడపిల్లని తాకకుండా రాత్రి పడుకోడు అలానే ఒకసారి తాకిన ఆడపిల్ల నీ జీవితంలో మళ్లీ టచ్ చేయడు అది బాబు గారి సిద్ధాంతం 

 

ఈ రన్వీర్ చౌదరి గారి ఆఫీస్ లోనే ఒక చిన్న ఎంప్లాయ్ గా పని చేస్తుంది మన మైధిలి 

 

అప్పటికే స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ అవ్వడంతో కంగారుగా భయంతో లోపలికి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చింది మైధిలి 

 

” హే మైదు ఈరోజు లేట్ అయ్యావా ??? ” అడిగింది తన ఫ్రెండ్ సౌమ్య 

 

” అవునే బాబు కర్మ కాలి ఈరోజు లేట్ అయ్యాను !!!! ” నీరసంగా చెప్పింది మైధిలి 

 

” ఏం కాదులే పదా నీకు కంపెనీ ఇవ్వడానికి నేనున్నాను కదా !!!! ” అంటూ ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ లిఫ్ట్ లో నుంచి బయటికి వచ్చారు 

 

” ఈరోజు సీఈఓ గారు వచ్చారు ఫాస్ట్ గా మీ ప్లేసెస్ కి వెళ్లి వర్క్ చేసుకోండి !!!! ” అన్నాడు జనరల్ మేనేజర్ 

 

రన్వీర్ వచ్చాడు అని తెలిసిన మైధిలి కి ఒంట్లో ఒణుకు మొదలైంది 

 

” ఆ సీఈఓ వచ్చాడా అయినా ఆ కామాంధుడు ఆఫీస్ కి ఎందుకు వచ్చాడు ??? ” అనుకుంటూ ఆలోచిస్తూ తన సీట్ లోకి వెళ్లి కూర్చుంది మైధిలి  

 

” ఏయ్ మైదు ఏం ఆలోచిస్తున్నావ్ ??? “అడిగింది సౌమ్య 

 

” ఏం లేదు ఆ కామాంధుడు ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నా ??? ” అంది మైధిలి 

 

” నీకోసమే వచ్చుంటాడులే ??? ” కన్ను కొడుతూ చెప్పింది సౌమ్య 

 

” అలాంటి వాడి చేతికి చిక్కడం కంటే నా ప్రాణం నేను తీసుకోవడం బెటర్ !!!! “

 

” నాకు నేను కొలిచే నా శివుడు లాంటి భర్త కావాలి అంతేకానీ ఇలాంటి రాక్షసుడు కాదు !!!!! ” అంది మైధిలి 

 

” నీ శివుడికి కూడా ఇద్దరు భార్యలు కదా గౌరీ గంగా మరి అతి తప్పు కాదా ??? ” అడిగింది సౌమ్య 

 

” సౌమ్య నీకు ఇక్కడ అర్థం కావట్లేదు శివుడు పార్వతి దేవిని పెళ్లి చేసుకున్నారు గంగా దేవి భూమి మీదకి వస్తే ఆ ఫోర్స్ కి భూమి తునాతునకలు అయిపోతుంది అంటే పీసెస్ పీసెస్ కింద అయిపోతుంది ఆ ఫ్లోని తట్టుకోలేదు అందుకే శివుడు తన జటాజూటంలో బంధించారు అర్థమవుతుందా ??? “

 

” అందుకే మనం ఎక్కడైనా పార్వతీ పరమేశ్వరులు అంటాం !!!! ”  అంటూ తన పని చేసుకుంటూ ఉంది మైధిలి 

 

 

 

@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

————–continues……….. 

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ 

 

 

రెండు భిన్న ధ్రువాలు మన మైధిలి అలాగే రన్వీర్ అలాంటి ఇద్దరు ఒకటైతే ఏం జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో