🌸🕊️ నా రాక్షసి వే – 30 🌸🕊️
కీతూ అరుపుకి దేవ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన బాల్కనీ లోకి వెళ్తాడు కీతూ కూడా అక్కడే వుంది అని తనకి తెలియడంతో..
కార్తీ తన రూమ్ నుండి వచ్చేసరికి దేవ్ కీతూనీ తన వైపు లాక్కొని ఏమ్ అయింది అని అడుగుతాడు కంగారుగా .. అసలు సన్నీ అక్కడే వున్నా విషయం గమనించుకోక…
చెప్పాలి అంటే కీతూ అరుపుకి ఒక క్షణం దేవ్ హార్ట్ బీట్ ఆగిపోయింది అనే అనుకోవాలి.. కీతూ అరుపుకి ఒక్కసారిగా తనని చేరుకున్నాడు మెరుపు వేగంతో ఆమెని అన్ని వేళల కాచుకొని వుండే రాజు వలె…