New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విధి రాసిన బంధం ❤️ – 12

విధి రాసిన బంధం ❤️ – 12

 

ఆ రోజు ఉదయం నుంచే లలితమ్మ ఏదో ఆలోచనలో ఉంది. హారికకు వచ్చిన సంబంధం గురించి వాళ్లతో మాట్లాడిన తర్వాత, ఆ అబ్బాయి మరోసారి హారికతో మాట్లాడాలని చెప్పాడు. పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిదేనని అతని తల్లిదండ్రులు కూడా అనడంతో లలితమ్మకు అందులో తప్పేమీ కనిపించలేదు.

 

అయితే ఆ విషయం రామయ్యకు తెలిస్తే ఆయన మళ్లీ హారిక అభిప్రాయం, ఇష్టం అంటూ మొదలుపెడతాడని ఆమెకు తెలుసు. అందుకే ముందుగా ఆయన్ని, రవిని ఇంట్లో లేకుండా చేయాలనుకుంది.

 

రామయ్య బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా లలితమ్మ పిలిచింది.

 

ఏమండీ, మీరు ఒకసారి బజారుకు వెళ్లి ఆ సామాన్లు తీసుకురండి. నిన్న చెప్పినవి కూడా అయిపోయాయి. రవిని కూడా మీతో తీసుకెళ్లండి.

 

ఇప్పుడే వెళ్లాలా? మధ్యాహ్నం వెళ్దామనుకున్నాను.

 

ఇప్పుడే తీసుకొస్తే మంచిది. మళ్లీ సాయంత్రం పనులుంటాయి కదా.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue