New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 5

పులి పంజా 🐯 – 5

భాగం – 5

 

వెనుక నుంచి సోము పక్క నుంచి రాము ఒక్క సారిగా ఇద్దరు బులెట్లు ఒకే సారి దాని శరీరంలోకి దించేశారు. 

 

అస్సలు ఊహించని ఆ ప్రక్రియకి సోమయ్య శరీరాన్ని నోటి నిండా బంధించిన ఆ పెద్ద పులి ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది ఉన్న చోటనే… 

 

అది చచ్చినా కూడా వదలక తుపాకుల్లో ఉన్న బుల్లెట్లు అన్నిటిని దాని శరీరంలోకి బలంగా దించేసి వాళ్లలో మేలుకొన్న కోపాన్ని, ద్వేషాన్ని, ఉద్రేకాన్ని చల్లపరుచుకోలేదు కానీ తగ్గించుకున్నారు కాస్త.

 

ఉన్నట్టుండి మోగిన బుల్లెట్ శబ్దానికి అదిరి పడ్డాడు వీరయ్య. 

 

పులి చచ్చింది అని తెలియగానే చేతిలో ఉన్న గన్ ని పక్కకి విసిరేసి పరుగున సోమయ్య దగ్గరికి వెళ్లి, “నాన్న నాన్న…” అంటూ సోము. 

 

“మామ మామ…” అంటూ రాము. 

 

బోరున ఏడుస్తూనే సగానికి సగం పులి ఆరగించేసిన అతని శరీరాన్ని పట్టుకొని బోరుమన్నారు. 

 

వాళ్ల గొంతులు విన్న వీరయ్య, “రేయ్ నాన్న” అంటూ లోపల నుంచే ఆయాస పడుతూ పిలుస్తూ మెల్లిగా బయటికి వచ్చాడు. 

 

తనని చూసిన రాము, “నాన్న…” అంటూ పరుగున దగ్గరికి వెళ్లి ఆసరాగా తనని పట్టేసుకున్నాడు. 

 

“మీరెందుకు…. మీరెందుకు వచ్చారు రా ఇక్కడికి.”

 

ఆయాస పడుతూనే అంటున్న అతని మాటలని చెవులారా వింటున్నా కూడా రాము చూపులన్నీ తండ్రి గుండెల పై రక్కేసిన పులి పంజా పైనే ఉన్నాయి. 

 

ఇంకా ఒక్క సెకండ్ అక్కడ ఆలస్యం చేసినా లోపల ఉన్న ఇంకొక మృగం కచ్చితంగా బయటికి వస్తుంది అన్న ఆలోచన తోనే, “సోము వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్లాలి మామను తీసుకుని రా.”

 

వస్తున్న కన్నీళ్ళని ఆపుకుందామన్నా ఆపుకోలేక కన్నీళ్ళ మధ్యలోనే పలికాడు రాము. 

 

వాడి మాటలకి నిర్జీవంగా పడి ఉన్న మిత్రుడు అలియాస్ బావ పార్థివ దేహాన్ని చూసిన వీరయ్య కళ్ళల్లో జీవం లేకుండా పోయింది. 

 

అప్పటి వరకు తట్టుకుంటున్నా ఊపిరి ఒక్క సారిగా ఎక్కువ వచ్చేసి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి భరించలేక నోరు తెరిచే లోపే స్పృహ కోల్పోయాడు. 

 

తండ్రికి ఏమైందో అర్థం కాక, “నాన్న నాన్న” అంటూ గాబరాగా అతనిని రెండు చేతుల్లోకి ఎత్తేసుకొని నేల పై కూర్చుండి శోకసంద్రంలో మునిగిపోయిన మిత్రుడిని గదిమి మరి సోమయ్య శవాన్ని తన చేత పట్టించి వారి శరీరాలు సహకరించకపోయినా ధైర్యాన్ని కూడా పెట్టుకుని మరి ఎలా గోలా ఆ అడవిని దాటి ఊరిని చేరుకున్నారు ఇద్దరు. 

 

ఊరి వెలుతురు చూడగానే కాలు తడబడింది సోముకి. 

 

కింద పడబోతున్న మిత్రుడిని గాబరాగా పట్టేసుకుని, “చిన్నగా రా రా” బలవంతంగా చెప్పాడు రాము.

 

వీరి కోసమే ఎదురు చూస్తున్న ఊరు జనం అంతా తండ్రులని మోసుకొస్తున్న బిడ్డలని చూసిన అందరి కళ్ళు ఒక్క క్షణం పనిచేయటం మానేశాయి. 

 

అప్పటి వరకు ఇంకా రాని తన భర్త కోసమే ఎదురు చూస్తున్న నీరజ కళ్ళకి బిడ్డల రాక ఉపశమనంలా అనిపించినా, 

 

వేలాడిపోయిన బిడ్డ ముఖంలో దిగులు తన చేతిలో నిర్జీవంగా మాంసపు ముద్దగా కనిపిస్తున్న భర్త శరీరాన్ని చూడగానే గుండె గుబేలు మంది. 

 

ఉన్న చోటనే కుప్పకూలిపోతున్న నీరజని గాబరాగా పట్టేసుకున్నారు పక్కనున్న ఆడవాళ్ళంతా. 

 

ఊరికి చేరుకోగానే ఆ ఊరి నాటు వైద్యులని పిలిపించి వెనువెంటనే వారి ఇద్దరికీ వైద్యాలు చేపించేశారు. 

 

ఎటు వంటి ఫలితం దక్కదు అని తెలిసినా ఏదో చిన్న ఆశతో తూట్లు తూట్లుగా మారిపోయిన సోమయ్య శరీరానికి వారికి తెలిసిన వైద్యాలని పిల్లల మంకు పట్టుతో చేసినా లాభం లేకుండా పోయింది.

 

గుండె పై పులి పంజా పడిన వీరయ్య కి మందులు ఇచ్చేసి కొద్ది సేపటికి లెగుస్తాడు అని చెప్పిన వైద్యులు, పూర్తిగా ప్రాణం కోల్పోయిన సోమయ్య ఇక లేడు అని చెప్పగానే తన కోపం కట్టలు తెంచుకొని తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక వారి మీద పడిపోయాడు సోము. 

 

పిల్లాడి ఆవేశంలో అర్థం ఉంది అని తెలుసుకున్న మిగతా వాళ్లంతా తనని కట్టడి చేసే పనిలో పడితే, 

 

చిన్నప్పటి నుంచి తన భుజాల పై ఎంతో ప్రేమగా ఎత్తుకొని పెంచిన మామ ఇక లేడు అని తెలిసిన రాము శిలలా మారిపోయాడు ఉన్న చోటనే…

 

ఇంకా ఉంది…

 

ఇప్పుడు ఏం జరుగుతుంది?

అసలు ఆ ప్రాంతం కథ ఏంటి?

ఎందుకు పులులు ఇలా మనుషుల్ని వేటాది వెంటాడి మరీ చంపుతున్నాయి?

 

తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే…

 

 

అంతలోపు మీకు నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి.. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…

 

ఇట్లు

మీ కీర్తి💕