Bonus Part – 1
| తప్పిపోయిన పాప కథ |
(కథలో రాముకి దొరికిన పాప అసలు ఎవరు? ఏంటి? అనే కథను ఇక్కడ తెలుసుకోవచ్చు మీరు)
దట్టమైన అడవి, ఎక్కడ చూసినా మనుషులు ఒంగోని పోతే కానీ చిన్న దారి ఉన్న తోవ కూడా కనిపించదు.
ఎర్రని మట్టి, ఆ మట్టి నిండా గుప్పుగా పేరుకుపోయిన మందల మందల పచ్చని చెట్లు. ఆ చెట్ల నిండా ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు పడి దొర్లేస్తున్న, పుట్ట పురుగులు, పిల్ల జంతువులు.
ఎక్కడ అడుగు పెట్టినా బోరున కురిసిన వాన వల్ల భూమి అంత జిగట జిగటగా ఉంది.