Bonus part – 3
| సతీష్ కుమార్ జీవిత చరిత్ర |
అమ్మాయి తరపున తల్లి తండ్రులు అంటూ లేరు, పెంచింది బాబాయి పిన్నీలు. వాళ్ళకి ఎప్పటి నుంచో తనంటే భారమే. అందుకే తను వెళ్ళిపోయినా పెద్దగా బాధ పడలేదు.
తను కూడా ఇంకెంత కాలం ఆ నరకంలో బ్రతకాలి అనేసి ప్రేమించిన వాడితోటి ప్రశాంతంగా బ్రతకడానికి వచ్చేసింది రమణి.
అందరిలా కాకుండా లేచిపోయి పెళ్ళి చేసుకున్నా, అప్పుడప్పుడు వచ్చే సూటి పోటీ జనాల మాటలని పట్టించుకోక వాళ్ళ జీవనాన్ని ఎంతో సంతోషంగా జీవించే సమయంలో వాళ్ళకు ఒక బుల్లి దేవత పుట్టింది. తనకి ఆరాధ్య అని పేరు పెట్టుకున్నారు.
వాళ్ళ అదృష్టమో లేక ఆ పాప అడుగు మహత్యమో తెలియదు, చేస్తున్న చిన్న పనుల వల్ల కాస్త డబ్బులు ఎక్కువగా వచ్చి మధ్యలో ఆపేసిన అతని డిగ్రీని పూర్తి చేసేసి ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ లో జాబ్ సంపాదించుకున్నాడు సతీష్.