భాగం – 6
చిన్నప్పటి నుంచి తన భుజాల పై ఎంతో ప్రేమగా ఎత్తుకొని పెంచిన మామ ఇక లేడు అని తెలిసిన రాము శిలలా మారిపోయాడు ఉన్న చోటనే…
| కొన్ని నెలల క్రితం |
అదొక తిరుమల గిరి మధ్యలో నిండుగా చెట్లతో, పుట్టలతో అల్లుకుపోయిన ఒక అటవీ ప్రాంతం.
ఊరికి కాస్త దూరంగానే ఉంటుంది ఆ ప్రాంతం.
చుట్టూ అలుముకున్న దట్టమైన అడవి లోపల ఒక ఐదు కిలోమీటర్ల తర్వాత ఒక చిన్న గూడెం.