ఇక్కడ పార్వతి గారు అరవింద్ ప్రణతి గురించి ఆలోచిస్తూ కంగారు పడుతు కూర్చుంటారు అప్పుడే కొంచెం కొంచెం గా ప్రణతి కి స్పృహ వస్తూ ఉంటుంది తనకి ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు వెంబడిచడం నిత్విక్ వచ్చి కాపాడి మ్యారీ మీ అని అడగడం మెడలో తాళి అన్ని ఒకేసారి గుర్తు వస్తాయి.
అమ్మ అని ఉలిక్కి పడి పైకి లేచిద్ది తను ఆలా అరవడం బయట వాళ్ళకి వినిపించి లోపలికి ఇద్దరు కంగారు కంగారుగా వస్తారు వెంటనే పార్వతి గారిని చూసి భయం తొ గట్టిగ పట్టుకొని ఏడ్చేసిద్ధి తన గురించి ఏమి అయినా తప్పు గా అనుకున్నారేమో అని నేను ఏ తప్పు చేయలేదు అమ్మ ఇది అసలు ఎలా నా మెడలోకి వచ్చిందో తెలియదు అని చెప్పి వెక్కుతూ ఏడుస్తది.
ఇంతలో అరవింద్ వచ్చి అక్క నువ్వు కంగారు పడకు భయ పడకు మేము ఉన్నాం నీకు మేమెందుకు అక్క నీ గురించి తప్పు గా అనుకుంటాం నువ్వు ఏంటో మాకు తెలియదా అని పక్కన కూర్చుని అంటుంటాడు.
ఆ మాటలకి కళ్ళు తుడుచుకొని పార్వతి గారు కూడ అవును అమ్మ ఇంక నువ్వు దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా పో నిన్న ఎప్పుడు తిన్నావో ఏమో నీ కోసం ఏమైనా చేసి తీసుకొస్తాను అని చెప్పి ప్రణతిని వాష్రూమ్ దాకా తీసుకెళ్లి ఇంక పార్వతి గారు కూడా వంట గదిలోకి వెళ్తారు.
కానీ అరవింద్ మాత్రం అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ హాస్పిటల్ వాడిదే కదా మాకు అసలు ఈ టెన్షన్ లో ఆ ఆలోచన తట్టనే లేదు చ అనుకోని పార్వతి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటాడు.
పార్వతి గారు అప్పుడే కూరగాయలు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి
అన్ని కడిగి వాటిని కోస్తూ ఉంటారు అప్పుడే అరవింద్ కిచెన్ లోకి వచ్చి గట్టు మీద ఎక్కి కూర్చొని పార్వతి గారిని చూస్తూ చెప్పాలా వద్ద అని ఆలోచిస్తూ ఉంటాడు.