New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 20

♥️బావ మరదలు♥️ – 20

శివ హడావుడిగా బాత్‌రూమ్ నుండి తల తుడుచుకుంటూ హాల్‌లోకి వచ్చాడు. బెడ్‌రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఉన్న సాహిత్య ముఖం అప్పటికే చిన్నబోయింది. ఎప్పుడూ తుంటి పనులతో ఇల్లంతా అల్లాడించే రౌడీ మరదలు, ఈరోజు చేతులు కట్టుకుని చాలా కోపంగా సోఫా వైపు చూస్తోంది.

శివ హాల్‌ వైపు చూడగానే సోఫాలో ఒక అమ్మాయి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్ జీన్స్ మరియు టాప్ వేసుకుని, చేతిలో ఫైల్ పట్టుకుని కూర్చుని ఉండటం గమనించాడు. ఆమె మరెవరో కాదు… శివ మేనమామ కూతురు కావ్య. చిన్నప్పుడు ఎప్పుడో వైజాగ్‌లో ఉండేది. చదువుల్లో చాలా టాపర్. సిటీకి వచ్చి చాలా ఏళ్లయింది.

“హాయ్ శివ బావా! గుడ్ మార్నింగ్!” అంటూ కావ్య సోఫాలోంచి లేచి చాలా ఆత్మీయంగా వచ్చి శివ చేతులు పట్టుకుంది. “నిన్న మీ శోభనం అని తెలుసు బావా. అందుకే డిస్టర్బ్ చేయకూడదని పొద్దున్నే వచ్చాను. ఒక వండర్‌ఫుల్ న్యూస్! నేను రీసెంట్‌గా రాసిన మీ కంపెనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు అన్నీ క్లియర్ అయిపోయాయి. ఈరోజే నా జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. అది కూడా మీ సాఫ్ట్‌వేర్ డిపార్ట్‌మెంట్‌లోనే, నీ అండర్‌లోనే నేను అసిస్టెంట్ మేనేజర్‌గా జాయిన్ అవుతున్నాను!” అంది ఫైల్ చూపిస్తూ చాలా సంతోషంగా.

 

 

శివ ఆశ్చర్యపోయాడు, అంతే సంతోషపడ్డాడు. “వావ్ కావ్య! గ్రేట్ న్యూస్. నువ్వు చాలా బాగా చదువుతావని తెలుసు కానీ, నా టీమ్‌లోనే జాబ్ రావడం నిజంగా చాలా హ్యాపీ” అన్నాడు నవ్వుతూ.

పక్కనే నిలబడిన సాహిత్యకు ఆ ‘బావా’ అనే పిలుపు, శివ చేతులు కావ్య పట్టుకోవడం చూసి లోపల ఎక్కడో కడుపు మంట మొదలైంది. “ఓహో! ఈమెగారు వైజాగ్‌లో చదవకుండా ఇక్కడికి వచ్చి నా మొగుడి టీమ్‌లోనే దూరిందా? పైగా పొద్దున్నే వచ్చి చేతులు పట్టుకుని ముచ్చట్లాడుతోందే!” అని మనసులో అనుకుంది.

కావ్య సాహిత్య వైపు తిరిగి చూసింది. “హాయ్ సాహిత్య! కంగ్రాచ్యులేషన్స్. పెళ్లిలో సరిగ్గా మాట్లాడలేకపోయాం. అయినా శివ బావ చాలా లక్కీ తెలుసా, ఇంత చిన్న వయసులోనే పెద్ద మేనేజర్ అయ్యాడు. ఆఫీస్‌లో బావ రేంజ్ వేరేలా ఉంటుంది. ఇకపై నేను, బావ రోజూ ఒకే కారులో ఆఫీస్‌కి వెళ్లొచ్చు, హాయిగా వర్క్ చేసుకోవచ్చు” అంది కావాలనే అన్నట్లు.

ఆ మాట వినగానే సాహిత్య ముఖం పూర్తిగా మాడిపోయింది.

“అవునా కావ్య గారూ.. చాలా థాంక్స్ అండి. కానీ మా బావకు ఆఫీస్ టెన్షన్ ఎక్కువ. కారులో ఒంటరిగా వెళ్తేనే ఆయనకు ప్రశాంతత ఉంటుంది. మధ్యలో డిస్టర్బెన్స్ ఆయనకు నచ్చదు” అంది సాహిత్య నవ్వు నటిస్తూనే గొంతులో కాస్త కారం దట్టించి.

 

అయ్యో అదేం లేదు సాహిత్య, కావ్య నా టీమ్ మెంబర్ కదా, పైగా మన చుట్టాలమ్మాయి. కలిసి వెళ్తే తప్పేముంది? నువ్వు వెళ్లి మా ఇద్దరికీ కాఫీ తీసుకురా” అన్నాడు శివ ఏమీ ఆలోచించకుండా చాలా నార్మల్‌గా.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue