New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 8

♥️బావ మరదలు♥️ – 8

నల్లటి స్కార్పియో కార్ గమ్యం తెలియకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై దూసుకుపోతోంది. కారు వెనుక సీట్లో ఇద్దరు రౌడీల మధ్య సాహిత్య కూర్చుని ఉంది. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయి, నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. ముందు సీట్లో చైర్మన్ రాజశేఖర్ చాలా గంభీరంగా ఫోన్ మాట్లాడుతుండగా, పక్కన కిరణ్ ముఖంలో గర్వంతో ఊగిపోతున్నాడు. సాహిత్య కళ్లలో ఇందాకటి వరకు ఉన్న భయం మెల్లమెల్లగా పోయి, ఆమె మైండ్ మళ్లీ యాక్టివ్ అయింది. “ఈ ముసలి చైర్మన్ గాడు, ఆ తింగరి కిరణ్ గాడు నన్ను కిడ్నాప్ చేస్తారా? నన్ను దాచడం మీ తరం కాదురా.. ఇప్పుడు చూడండి నా చిలిపి తడాఖా!” అని మనసులో అనుకుంది.

ఆమె కావాలనే నోటితో “ఉూూ… ఉూూ…” అంటూ గట్టిగా శబ్దాలు చేస్తూ ఊపిరి ఆడనట్లు నటించింది.

అది చూసి కిరణ్ వెనక్కి తిరిగాడు. “బాస్! దీనికి ఊపిరి ఆడనట్లు ఉంది. నోటి ప్లాస్టర్ తీయమంటారా? అయినా ఇదొక చిన్న పిల్ల, ఏం చేస్తుందిలే” అన్నాడు.

“సరే తీయ్, కానీ గట్టిగా అరిస్తే కార్‌లోనే షూట్ చేస్తా” అని రాజశేఖర్ హెచ్చరించాడు.

 

 

కిరణ్ నెమ్మదిగా సాహిత్య నోటి ప్లాస్టర్ తీశాడు. అంతే! సాహిత్య ఒక్కసారిగా గాలి పీల్చుకుని గట్టిగా దగ్గుతున్నట్లు నటించి, కిరణ్ ముఖం మీదే “హాచ్ఛూ…” అంటూ పెద్ద తుమ్ము తుమ్మింది.

“అబ్బా… ఏంటిది సాహిత్య? నా ముఖం అంతా పాడు చేశావు!” అంటూ కిరణ్ ముఖం తుడుచుకున్నాడు.

“సారీ కిరణ్! నాకు సిటీ డస్ట్ పడదు. అయినా మీలాంటి హ్యాండ్‌సమ్ అబ్బాయిలు నన్ను ఇంత లగ్జరీ కార్‌లో కిడ్నాప్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీ బాస్ చైర్మన్ గారే చాలా ముసలాడిలా, కోపంగా ఉన్నారు” అంది సాహిత్య చాలా అమాయకంగా రాజశేఖర్ వైపు చూస్తూ.

రాజశేఖర్ కార్ అద్దంలో నుంచి ఆమె వైపు కోపంగా చూశాడు. “నోరు మూయ్! నువ్వు కిడ్నాప్ అయ్యావు అన్న సంగతి గుర్తుంచుకో” అన్నాడు గంభీరంగా.

“గుర్తుంది బాస్! కానీ కిడ్నాప్ చేసినప్పుడు కనీసం తాగడానికి థమ్సప్, తినడానికి బిర్యానీ అయినా ఇప్పించాలి కదా. మీరేమో వందల కోట్ల ఆస్తి కోసం చూస్తున్నారు, కనీసం ఒక ఐదు వందల రూపాయల బిర్యానీ కూడా ఇప్పించలేరా? మీ పిసినారితనం చూస్తుంటే జాలేస్తోంది” అంది సాహిత్య పెదవి విరుస్తూ.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue