New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤‍🔥 మనసు పలికే మౌనం ❤‍🔥 – 1

❤‍🔥 మనసు పలికే మౌనం ❤‍🔥 – 1

నీకు నా పైన ఇంత ప్రేమ ఉంది నాకు ఎందుకు అప్పుడు చెప్పలేదు అంటాడు అబ్బాయి…

 

 

 

నాకు నీ ప్రేమ దొరకదు అనుకున్న అలాంటిది ఎలా చెప్పను… నువ్వు ఇంకో అమ్మాయి ని ప్రేమిస్తున్న అని తననే పెళ్లి చేసుకోవాలి అని నాకే చెప్పావ్ ఇంకా నా ప్రేమని చెప్తే ఎలా తీసుకుంటావో అని చెప్పలేదు అంటూ గట్టిగా హాగ్ చేసుకుని ఏడుస్తుంది అమ్మాయి….

 

 

 

ఓయ్ ఇప్పుడు ఎందుకే ఏడవడం పెళ్లి కుడా చేసుకున్నాం ఇంకా నువ్వు నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం అంటూ అమ్మాయి కన్నీళ్లు తుడుస్తాడు అబ్బాయి….

 

 

 

అమ్మాయి ఏడుస్తూ నువ్వు నాకు దక్కవు అన్న ప్రతి సారి ఇక్కడ గుండె పై వేలు చూపిస్తూ ఎవరో కత్తి తో గుచుతున్నంత బాధ కలిగేది…..

 

 

 

నువ్వు ఏడవకు మా అప్పుడు నేను ఎవరిని ప్రేమించిన ఇప్పుడు నీ వాడిని అయిపోయా కదా నువ్వు ఇలా ఏడిస్తే నాకు చాలా బాధ గా ఉంది మా నీ ప్రేమ గుర్తించలేక ఇన్ని ఇయర్స్ ఒక అబద్దం ప్రేమలో ఉండి నన్ను నేను మోసం చేసుకున్న ఇక నుంచి ఒక్క క్షణం నీకు దూరం గా ఉండలేను అని అమ్మాయి ని చూస్తూ చెప్తాడు అబ్బాయి…..

 

 

 

 

అమ్మాయి అబ్బాయిని చూసి నీకు నా ప్రేమ గురించి నేను చెప్పలేదు ఎలా తెలిసింది పెళ్లి టైం కి అక్కడికి వచ్చి అబ్బాయిని లాగేసి నువ్వు తాళి కట్టావ్ ఎలా?అని క్వశ్చన్ చేస్తుంది అమ్మాయి….

 

 

 

 

నా బంగారం నీకు మైండ్ లేదే నా పై ప్రేమ ని 12 సంవత్సరాలనుండి దాచి పెట్టావ్ నీ ఫ్రెండ్ రీసెంట్ గా నన్ను కలిసింది తను అంత చెప్పి దొంగమొహం నీ పెళ్లి అని వన్ డే ముందు చెప్పి తనని ఇంకా కలవకు అని వార్న్ చేసింది అంటాడు ఆదిత్య….

 

 

 

 

నా ఫ్రెండ్ ఎవరు నేమ్ చెప్పు అని అడుగుతుంది అవంతిక…..

 

 

 

 

నా పైన ప్రేమని ఎవరికీ చెప్పావ్ తానే చెప్పింది నువ్వే గుర్తుచేస్కో అవి అంటాడు ఆది…

 

 

 

చెప్పు కన్నా నాకు గుర్తు లేదు అని అంటుంది అవి….

 

 

 

 

అబ్బ ఎంత బాగుందో అప్పుడు కన్నా అని నోట్స్ లో చేతిలో రాసుకుంటువుంటే నేనే అని తేలిక ఎన్ని సార్లు అడిగా ఎవరు అంటే కృష్ణయ్య అని చెప్పావ్ కధే అంటాడు.ఇంకా ఎవరు నీ పక్కనే తాడి చెట్టుల ఉంటుంది కదా లలిత అని చెప్తాడు ఆది…

 

 

 

ఓహ్ లల్లి చెప్పిందా అయినా అది చెప్పింది కాబట్టి వచ్చావ్ లేకపోతే వచ్చే వాడివి కాదు కదా అని మొహం తిప్పేస్తుంది అవి….

 

 

 

 

బంగారం మనం పోసిషన్ లో నువ్వు ఇలా చెయ్యకే అని తర్వాత గొడవ పడదాం అని అవి ని అల్లుకుపోతాడు ఆది….

 

 

 

ఆది పై  12 సంవత్సరాల నుంచి దాచిన ప్రేమ ఇప్పుడు తన ప్రియ సకుడికి ఇష్టం గా చూపిస్తుంది అవి…

 

 

 

 

అవి సహకారానికి మళ్ళీ మళ్ళీ తనలో కలిపేసుకుని ఐ లవ్ యూ అవి బంగారం అని నుదిటి పై ముద్దు పెట్టి కళ్ళుమూసుకుంటాడు ఆది….

 

 

 

ఆది ప్రేమ మనసారా అనుభవించినా అవి ఆది గుండెల పై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది….

 

 

 

ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి నిద్ర కి ఉపక్రామిస్తారు….

 

 

 

( వాళ్ళకి ముందు వచ్చే సమస్యలు తెలీవు పాపం )

 

 

 

 

మార్నింగ్ అవి ఫస్ట్ లేచి ఆది పెదవుల పై చిన్న పెక్ ఇచ్చి గుడ్ మార్నింగ్ కన్నా అని అక్కడి నుండి తన శారీ చుట్టుకుని వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి స్కై బ్లు వైట్ మిక్స్ కలర్ శారీ కట్టుకుని అమ్మాయి కొంచెం కలర్ తక్కువ బట్ మొహం కలగా ఉంటుంది చిన్న స్టికర్ దానికింద కుంకుమ పెట్టి పాపిడి లో కుడా కొంచెం పెట్టుకుని బ్లాక్ బీడ్ చైన్ ఆది కట్టిన తాళి ఇంకా ఎం వేసుకోకుండా అలానే బాల్కనీలోకి వెళ్తుంది అవి….

 

 

 

 

 

సూర్య నమస్కారం చేసుకుని తన హెయిర్ ని తుడుచు కుంటూ ఉంటుంది టవల్ తో…

 

 

 

అవి బాల్కనీలోకి వెళ్ళగానే తన ప్రెసిన్స్ దూరం అయ్యింది అని పైకి లేచి చుట్టు చూస్తాడు ఆది…

 

 

 

బాల్కనిలో బ్యాంగిల్స్ సౌండ్ వినిపించి అటువైపు అడుగులు వేస్తూ అవి ని చూసి ఆగిపోతాడు ఆది…

 

 

 

 

అక్కడ అవి తన హెయిర్ తుడుచుకుంటూ ఉంటే తన హెయిర్ లో వాటర్ డ్రాప్స్ జారీ తన బ్లౌజ్ లో నుంచి కిందకి జరుతూ ఉంటే నాజుకైనా నడుము మీద వాటర్ డ్రాప్స్ ముత్యాల్లా మెరుస్తూ ఉంటే బాబు గుండె అమాంతం పెరిగి గోతులో గుటక పడుతుంది. ఇంకొంచెం సేపు అవి కి దూరం ఉంటే తన గుండె ఆగిపోతుందేమో అన్నట్టు ఉంటే రెండు అడుగుల్లో అవిని చేరి బ్యాక్ హాగ్ చేసుకుంటాడు ఆది….అవి ఒక్క క్షణం ఉలిక్కి పడి వెనక్కి చూసి కన్నా అప్పుడే లేచావా అంటుంది చిన్నగా నవ్వుతూ….

 

 

 

 

నువ్వు నాకు ఇంత సేపు దూరం అయితే మెలుకువ రాకుండా ఉంటుందా అంటూ భుజం పై ఉన్న వాటర్ డ్రాప్స్ ని నోట్లోకి పీల్చుకుంటాడు ఆది….

 

 

 

అవి ఆది స్పర్శ కి సర్వం మర్చిపోతుంది తను కోరుకుంది తనతో జీవితాంతం కలసి ఉండాలి అని ఆది తన కళ్ళముందే కనిపిస్తుంటే తనకి చెప్పలేనంత ఆనంద గా ఉంది అవి కి….

 

 

 

 

ఆది తన మనుసులో మాట అర్థం అయినట్టు ఇంత కన్నా సంతోషం గా చూసుకుంటా అవి అని అంటాడు ఆది….

 

 

 

 

కన్నా నేను పూజ చేసుకోవాలి నువ్వు  ఫ్రెష్ అవ్వుపో నేను ఫ్రెష్ అవుతా అని అంటుంది…

 

 

 

 

నువ్వు ఫ్రెష్ అయ్యావ్ కదా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవ్వడం ఎందుకు అంటాడు తనకి నిజం గా అర్థం అవ్వలేదు…

 

 

 

నైట్ కలయిక తర్వాత ఫ్రెష్ అవ్వాలి కన్నా నేను ఫ్రెష్ అయ్యి వచ్చా నువ్వు మళ్ళీ హాగ్ చేసుకున్నావ్ నువ్వు ఫ్రెష్ అవ్వలేదు అందుకే మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి అని చెప్తుంది అవి….

 

 

అయితే పద ఇద్దరం ఫ్రెష్ అవుదాం అని అవి ని ఎత్తుకుని వాష్రూమ్ కి వెళ్తారు ఇద్దరు పది నిమిషాల్లో అయ్యే స్నానం రెండు గంటలకి పూర్తి అయ్యి బయటికి వచ్చి ఇద్దరు రెడీ అయ్యి కిందకి వస్తారు….

 

 

 

 

కన్నా నువ్వు ఇక్కడే ఉండు నేను నీకు కాఫీ తెస్తా అంటుంది అవి….

 

 

 

నాకు వద్దులే పూజ అయ్యాక ఇద్దరం కలిసి తాగుదాం అంటాడు ఆది…..

 

చిన్నగా నవ్వి ప్రసాదం చెయ్యడానికి కిచెన్ కి వెళ్తే వెనుకే ఆది కుడా వెళ్తాడు….

 

 

 

కన్నా నువ్వు ఎందుకు వచ్చావ్ హాల్లోకి వేళ్ళు అంటుంది అవి….

 

 

 

బంగారం నువ్వు ఎక్కడ ఉంటే నేను కుడా అక్కడే ఉంటా నువ్వు ప్రసాదం చెయ్యి నేను హెల్ప్ చేస్తా అంటాడు ఆది….

 

 

 

కన్నా నువ్వు ఎం చెయ్యద్దు నాకు చెయ్యడం వచ్చు నువ్వు చూడు చాలు అని ఫస్ట్ పాలు పొంగించి పాయసం చేస్తుంది అవి….

 

 

 

 

 

ప్రసాదం బౌల్ లో వేసి దేవుడి రూమ్ క్లీన్ చేసి అక్కడ పెట్టి పువ్వుల కోసం గార్డెన్ కి వెళ్తుంది అవి…

 

 

 

ఆది కుడా వెనుకే వెళ్లి పువ్వులు కోస్తాడు కావలసిన్నని కోసి లోపలికి వచ్చి పూజ చేసి ప్రసాదం పెట్టి కొబ్బరి కాయ కొట్టి దానిలో పువ్వు వచ్చి ఉంటుంది సంతోషం గా అక్కడ పెట్టేసి హారతి ఇచ్చి ఆది కి కళ్ళకి అద్ది కుంకుమ పెట్టి ఇద్దరు ఒకచోటే నిలబడి దండం పెట్టుకుంటారు….

 

 

 

 

 

నా కన్నా  ప్రేమ 12 సంవత్సరాలనుండి నుండి  నాకు  దూరం అవుతూనే ఉంది.కానీ నువ్వు మమ్మల్ని కలిపావు ఇలాగే జీవితాంతం ఉండేలా చూడు అని అవి కోరుకుంటుంది….

 

 

 

 

నా బంగారం ఏది కోరుకుంటే అదే తనకి ఇవ్వు అని ఆది కోరుకుంటాడు…

 

 

 

పూజ అయిపోయాక ఇద్దరు హాల్లో కి వస్తారు కన్నా కాఫీ తెస్తా అని లేస్తుంది అవి…

 

 

 

ఆది అవి ని తన మీదకి లాక్కుని నువ్వు వద్దులే బంగారం ఇప్పటికే తిరిగి తిరిగి అలసి పోయావ్ అని ఒడిలో కూర్చో బెట్టుకుని మెయిడ్ ని పిలుస్తాడు…

 

 

 

 

మెయిడ్ వచ్చి తలదించుకుని ఉంటుంది కాఫీ జ్యూస్ తీసుకునిరా అని చెప్తాడు ఆది…

 

 

 

మెయిడ్ ఓకే అని తల ఉపి లోపలికి వెళ్తుంది…

 

 

అవి ఇబ్బందిగా కదులుతు కన్నా నేను తెస్తా కదా అంటుంది…

 

 

బంగారం పూజ అన్నావ్ ఊరుకున్నా అంతే కానీ నువ్వు పనులు చెయ్యడం నాకు ఇష్టం లేదు అంటాడు ఆది….

 

 

 

కంటిన్యూ….

 

అవి❤️ఆది ప్రేమ నెక్స్ట్ పార్ట్ లో ఇంకా బాగుంటుంది…

 

 

 

ఈ స్టోరీ చాలా ఎఫర్ట్స్ పెట్టి రాస్తున్న మీరు కుడా సపోర్ట్ చెయ్యండి అలాగే ఎలా ఉందొ తప్పకుండ కామెంట్స్ చెయ్యండి….